Minister Tummala | వానలను చూసి వరి వేయొద్దు.. రైతులకు మంత్రి తుమ్మల సూచన..
Minister Tummala | రైతుల వద్దకు ఆధునిక సాంకేతికత, శాస్త్రీయ వ్యవసాయ పరిజ్ఞానాన్ని చేరవేయడమే ‘రైతునేస్తం’ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. సచివాలయంలో మంగళవారం నిర్వహించిన రైతునేస్తం 100వ ఎపిసోడ్ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
Minister Tummala | రైతుల వద్దకు ఆధునిక సాంకేతికత, శాస్త్రీయ వ్యవసాయ పరిజ్ఞానాన్ని చేరవేయడమే ‘రైతునేస్తం’ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. సచివాలయంలో మంగళవారం నిర్వహించిన రైతునేస్తం 100వ ఎపిసోడ్ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా 1,600 రైతువేదికల ద్వారా లక్షలాది మంది రైతులు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. రైతు–శాస్త్రవేత్త–అధికారులను ఒకే వేదికపైకి తీసుకొచ్చిన దేశంలోనే తొలి డిజిటల్ కార్యక్రమం రైతునేస్తమని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ప్రశంసించారు. ఎల్‌నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం కంటింజెన్సీ ప్రణాళికతో రైతులకు విత్తనాలు, సాంకేతిక సలహాలు, అవసరమైన సహాయం అందిస్తోందని తెలిపారు.
అనంతరం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ గత ప్రభుత్వం నిరుపయోగంగా వదిలేసిన రైతువేదికలను రైతులకు ఉపయోగపడే విజ్ఞాన కేంద్రాలుగా మార్చే లక్ష్యంతో వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం కల్పించి రైతునేస్తం కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు. శాస్త్రవేత్తలు, అధికారులు, రైతులు ఒకే వేదికపై ప్రత్యక్షంగా చర్చించే అవకాశాన్ని కల్పించడం ద్వారా రైతులకు శాస్త్రీయ వ్యవసాయంపై అవగాహన పెంచడమే కార్యక్రమం ఉద్దేశమని చెప్పారు. 2024 మార్చి 6న ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభమైన రైతునేస్తం కార్యక్రమం నేటితో 100 ఎపిసోడ్లు పూర్తి చేసుకోవడం రైతుల విశ్వాసానికి నిదర్శనమని మంత్రి పేర్కొన్నారు. ఇప్పటివరకు 24,85,581 మంది రైతులు ప్రత్యక్షంగా పాల్గొనగా.. వారిలో 5,26,107 మంది మహిళా రైతులు ఉన్నారని తెలిపారు. రెండేళ్ల కాలంలో 2,43,830 మంది అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొనగా, మొత్తం 27.30 లక్షలకు పైగా రైతులు కార్యక్రమం ద్వారా ప్రయోజనం పొందారని వెల్లడించారు. రైతువేదికలను డిజిటల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అనుసంధానం చేసి రైతులతో ప్రత్యక్షంగా శాస్త్రవేత్తలను కలిపిన కార్యక్రమం దేశంలోనే ఇదే తొలిసారని మంత్రి పేర్కొన్నారు.
భవిష్యత్‌లో నీటి లభ్యతే సవాల్..
ప్రపంచంతో పోటీపడే వ్యవసాయం కోసం సాంకేతిక పరిజ్ఞానం అత్యంత అవసరమని మంత్రి అన్నారు. వాతావరణ పరిస్థితులు, మార్కెట్ అవసరాలు, నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకొని పంటల ఎంపిక చేసుకోవాలని సూచించారు. రైతునేస్తం ద్వారా రైతులకు వాతావరణ హెచ్చరికలు, జిల్లాల వారీగా అనువైన పంటలు, శాస్త్రీయ సాగు విధానాలపై నిరంతరం అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం ఒకవైపు ఎల్-నినో ప్రభావం, మరోవైపు ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న యుద్ధ పరిస్థితులు వ్యవసాయ రంగంపై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్న మంత్రి, ఇలాంటి పరిస్థితులను ప్రభుత్వం, రైతులు కలిసి సమర్థవంతంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉందన్నారు. రైతును రాజుగా తీర్చిదిద్దడమే రైతునేస్తం కార్యక్రమం లక్ష్యమని స్పష్టం చేశారు. భవిష్యత్తులో నీటి లభ్యత మరింత సవాలుగా మారే అవకాశాలు ఉన్నందున అధిక నీరు అవసరమయ్యే పంటల కంటే ఆయిల్ పామ్, ఉద్యాన పంటలు, తక్కువ నీటితో సాగయ్యే పంటలను రైతులు పరిశీలించాలని సూచించారు. బోర్ల కింద, ప్రాజెక్టుల కింద ఏ ప్రాంతంలో ఏ పంటలు అనుకూలమో శాస్త్రవేత్తల సూచనల మేరకు సాగు చేయాలని పిలుపునిచ్చారు. దేశానికి రైతే వెన్నెముక అని, మారుతున్న పరిస్థితులను అర్థం చేసుకొని శాస్త్రీయంగా వ్యవసాయం చేస్తేనే రైతు ఆదాయం పెరుగుతుందని తెలిపారు.
ఆగస్టులో అల్పపీడనం..
వాతావరణశాఖ సమాచారం ప్రకారం గత వారం కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసినప్పటికీ, రానున్న రెండు మూడు రోజుల్లో అల్పపీడన ప్రభావంతో ముఖ్యంగా ఉత్తర తెలంగాణలోని ఆసిఫాబాద్, మంచిర్యాల తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఆగస్టు 10 ప్రాంతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని తెలిపారు. అయితే ఈ వర్షాలతో చెరువులు, ప్రాజెక్టులు నిండే పరిస్థితి లేదని, భూగర్భ జలాలు కూడా పెరిగే అవకాశం లేదని చెప్పారు. కాబట్టి రైతులు ఈ వర్షాలను చూసి నీటి అవసరం ఎక్కువగా ఉండే వరి వంటి పంటలను విస్తృతంగా సాగు చేయవద్దని సూచించారు. భూగర్భ జలాల పరిస్థితిని జిల్లా, మండలాల వారీగా రైతులకు ఎప్పటికప్పుడు తెలియజేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. సాధారణంగా జూలై నెలలో 218 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, ఈ ఏడాది కేవలం 150 మిల్లీమీటర్లు మాత్రమే నమోదై 27 శాతం లోటు వర్షపాతం నమోదైందని తెలిపారు. సెప్టెంబర్ నెలలో వర్షాలు మరింత తగ్గే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ సందర్భంగా పలు జిల్లాలకు చెందిన రైతులు తమ అభిప్రాయాలను వెల్లడించారు.
ఆయిల్ పామ్‌తో ఆదాయం వస్తుందన్న రైతు కృష్ణారెడ్డి
మహబూబాబాద్ జిల్లాకు చెందిన రైతు వల్లూరి కృష్ణారెడ్డి మాట్లాడుతూ 2020లో ఆయిల్ పామ్ సాగు ప్రారంభించానని, ప్రస్తుతం మంచి దిగుబడి, ఆదాయం వస్తోందని చెప్పారు. అడవి జంతువుల బెడద లేకుండా అన్ని పరిస్థితులను తట్టుకునే పంటగా ఆయిల్ పామ్ నిలుస్తోందన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూరియా యాప్ వల్ల విచ్చలవిడి యూరియా వాడకం గణనీయంగా తగ్గిందని పేర్కొన్నారు. కార్యక్రమం ముగింపులో మంత్రి తుమ్మల వివిధ జిల్లాల ఆదర్శ రైతులను సన్మానించారు. కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కే రేంద్ర మోహన్, వ్యవసాయశాఖ డైరెక్టర్ బీ గోపి, హార్టికల్చర్ ఎండీ యాస్మిన్ బాషా, సహకార శాఖ కమిషనర్ రాహుల్ రాజ్, వ్యవసాయ, ఉద్యాన విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సెలర్లు జానయ్య, రాజిరెడ్డి, వివిధ జిల్లాల ఆదర్శ రైతులు, అధికారులు పాల్గొన్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Chardham Yatra | ఉత్తరాఖండ్‌లో వర్షాల బీభత్సం.. చార్ధామ్ యాత్రకు బ్రేక్..
జులై 28, 2026

Ranganath | రంగనాథ్‌ను తప్పించాలని హైకోర్టు ఆదేశం.. ఇరకాటంలో రేవంత్ సర్కారు..! ఢిల్లీ నుంచే మంతనాలు..?
జులై 27, 2026

DGCA on Air Fare | దేశీయ విమాన ఛార్జీలకు రెక్కలు.. 72 మార్గాల్లో ఏడాదిలో 20.5 శాతం పెరుగుదల..
జులై 27, 2026
తాజావార్తలు
- ●Jitendra Singh | యూపీఏ హయాంలోనే పేపర్ లీక్‌లు.. అప్పుడెందుకు చర్యలు తీసుకోలేదు..? : జితేంద్ర సింగ్
- ●TAUK | లండన్ వీధుల్లో బోనాల జాతర.. ప్రత్యేక్ష ఆకర్షణగా తొట్టెల ఊరేగింపు
- ●BJP Ramchandar Rao | రాష్ట్రమంతా బీజేపీ శరవేగంగా విస్తరిస్తోంది.. నెక్స్ట్ అధికారం మాదే
- ●boAt | చిన్నారుల కోసం ప్రత్యేకంగా గూగుల్ మ్యాప్స్ సహిత స్మార్ట్ వాచ్.. లైవ్ ట్రాకింగ్ ఫీచర్‌తో లాంచ్..
- ●Jr Ntr | జూనియర్ ఎన్టీఆర్‌కు గాయం - డ్రాగన్ షూటింగ్‌కు రెండు నెలలు బ్రేక్
- ●Chardham Yatra | ఉత్తరాఖండ్‌లో వర్షాల బీభత్సం.. చార్ధామ్ యాత్రకు బ్రేక్..

Jitendra Singh | యూపీఏ హయాంలోనే పేపర్ లీక్‌లు.. అప్పుడెందుకు చర్యలు తీసుకోలేదు..? : జితేంద్ర సింగ్

TAUK | లండన్ వీధుల్లో బోనాల జాతర.. ప్రత్యేక్ష ఆకర్షణగా తొట్టెల ఊరేగింపు

BJP Ramchandar Rao | రాష్ట్రమంతా బీజేపీ శరవేగంగా విస్తరిస్తోంది.. నెక్స్ట్ అధికారం మాదే

boAt | చిన్నారుల కోసం ప్రత్యేకంగా గూగుల్ మ్యాప్స్ సహిత స్మార్ట్ వాచ్.. లైవ్ ట్రాకింగ్ ఫీచర్‌తో లాంచ్..



