త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rythu DISCOM | రైత‌న్న‌లు మీ భూముల్లో సోలార్ ప‌వ‌ర్ ప్లాంట్లు ఏర్పాటు చేయండి.. ఆర్థికంగా ల‌బ్ధిపొందండి!

TGRPDCL | రైతులు వారి భూముల్లో సోలార్ ప‌వ‌ర్ ప్లాంట్ల‌ను ఏర్పాటు చేసుకోవాల‌ని రైతు డిస్కమ్ (TGRPDCL) సీఎండీ ముషార‌ఫ్‌ ఫారూఖీ (Musharraf Faruqui) అన్నారు. త‌ద్వారా అన్న‌దాత‌లు త‌మ‌ ఆర్థిక ప‌రిస్థితిని మ‌రింత మెరుగుప‌రుచుకోవ‌చ్చ‌ని చెప్పారు.

G

Telangana | Published On May 8, 2026, 6.36 am IST

Rythu DISCOM | రైత‌న్న‌లు మీ భూముల్లో సోలార్ ప‌వ‌ర్ ప్లాంట్లు ఏర్పాటు చేయండి.. ఆర్థికంగా ల‌బ్ధిపొందండి!
Advertisement

Rythu DISCOM | త్రినేత్ర‌.న్యూస్‌: రైతులు వారి భూముల్లో సోలార్ ప‌వ‌ర్ ప్లాంట్ల‌ను (Solar Power Plants) ఏర్పాటు చేసుకోవాల‌ని రైతు డిస్కమ్ (Rythu DISCOM) సీఎండీ ముషార‌ఫ్‌ ఫారూఖీ (Musharraf Faruqui) అన్నారు. త‌ద్వారా అన్న‌దాత‌లు త‌మ‌ ఆర్థిక ప‌రిస్థితిని మ‌రింత మెరుగుప‌రుచుకోవ‌చ్చ‌ని చెప్పారు. కేంద్ర ప్ర‌భుత్వ ప‌థ‌క‌మైన ప్ర‌ధాన మంత్రి కిసాన్ ఉర్జా సుర‌క్ష ఏవ‌మ్ ఉత్త‌మ్ మ‌హాభియాన్ (PM-KUSUM)ను సమర్థవంతంగా అమలు చేస్తున్న‌ద‌ని చెప్పారు. తద్వారా డిస్కమ్ నుంచి రైతులు అదనపు ఆదాయాన్ని పొందవచ్చని తెలిపారు.

ఈ పథకం కింద రైతులు కేవలం 3.5 ఎకరాల భూమితో 1 మెగావాట్ సౌర విద్యుత్ ప్లాంటును ఏర్పాటు చేసుకోవచ్చ‌ని వెల్ల‌డించారు. ఇద్దరు లేదా ముగ్గురు చిన్న రైతులు సంయుక్తంగా ఇలాంటి ప్లాంట్లను ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. ఈ పథకంలో చేరేవారికి రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహ‌కాలు అందిస్తున్న‌ద‌ని చెప్పారు. వ్యవసాయేతర భూమి మదింపు (NALA) మార్పిడి చార్జీల నుంచి మినహాయింపు ఇస్తున్న‌ద‌ని, 50 శాతం స్టేట్ జీఎస్టీ రీయింబర్స్‌మెంట్, కాలుష్య నియంత్రణ మండలి (PCB) నిరంభ్యంత‌ర ప‌త్రం నుంచి మినహాయింపు, విద్యుత్ సుంకం నుంచి 100 శాతం మినహాయింపుతో సహా ప్ర‌భుత్వం అనేక ప్రోత్సాహకాలను అందిస్తున్న‌దని పేర్కొన్నారు.

రాష్ట్రంలో ప్ర‌స్తుతం వినియోగించే విద్యుత్‌లో అధిక భాగం బొగ్గు, డీజిల్ వంటి సాంప్రదాయ ఇంధన వనరుల ద్వారా ఉత్పత్తి అవుతున్న‌దని, ఇవి ప‌రిమితంగా ల‌భించ‌డంతోపాటు పర్యావరణానికి కూడా హానిక‌లిగిస్తాయ‌న్నారు. రాష్ట్ర ప్రభుత్వం తన పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి సామర్థ్యాన్ని 2029-30 నాటికి 29,645 మెగావాట్లకు పెంచాలని ల‌క్ష్యంగా పెట్టుకున్న‌ద‌ని చెప్పారు. ప్ర‌స్తుతం అది 10,642 మెగావాట్లుగా ఉంద‌ని చెప్పారు. ఈ లక్ష్యాన్ని సాధించడంలో రైతులు కూడా సహాయపడాలని కోరారు.

Advertisement
Advertisement