Anugula Rakesh Reddy | రేవంత్ రెడ్డి గజినీ.. ఒళ్లంతా పచ్చబొట్లు పొడవాలి..
Anugula Rakesh Reddy | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గజినీలా ప్రవర్తిస్తున్నారు.. ఆయన ఒళ్లంతా పచ్చబొట్లు పొడవాలి అని బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేశ్ రెడ్డి సూచించారు. రైతుల పట్ల సీఎం రేవంత్ నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు.
Anugula Rakesh Reddy | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గజినీలా ప్రవర్తిస్తున్నారు.. ఆయన ఒళ్లంతా పచ్చబొట్లు పొడవాలి అని బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేశ్ రెడ్డి సూచించారు. రైతుల పట్ల సీఎం రేవంత్ నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో రాకేశ్ రెడ్డి శుక్రవారం మీడియాతో మాట్లాడారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ రాక్షస రాజ్యం నడుపుతోంది. రైతుల పక్షాన వరంగల్‌లో కేటీఆర్ ప్రశ్నిస్తే ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టింది. కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ అమలు చేయకపోతే రైతులకు క్షమాపణ చెప్పాలి. చేతగాని దద్దమ్మలు మాత్రమే కేసులు పెడతారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఐకేపీ సెంటర్ల వద్దకు వెళ్లి రైతులతో మాట్లాడాలి అని రేవంత్ రెడ్డికి రాకేశ్ రెడ్డి సూచించారు.
తెలంగాణ ద్రోహులపై దురంధరుడు కేటీఆర్ పోరాటం..
రైతులను కాపాడుకోవడానికి ఎన్ని కేసులకైనా కేటీఆర్ సిద్దం. తెలంగాణ ద్రోహులపై దురంధరుడు కేటీఆర్ పోరాటం చేస్తున్నారు. కేటీఆర్ రైతు సంగ్రామ సదస్సులో 20 వేల మంది పాల్గొన్నారు. కాంగ్రెస్ రైతు మేళాలో 2వేల మంది కూడా లేరు. నువ్వు కేసు పెడితే కేటీఆర్ భయపడతారా...? బిఆర్ఎస్ పార్టీ పేరు చెప్తే కాంగ్రెస్ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని రాకేశ్ రెడ్డి పేర్కొన్నారు.
బిచ్చగాళ్లకు వేసినట్లు రైతు బంధు వేస్తున్నారు..
2024లో ఎకరానికి రూ. 15 వేలు ఎగ్గొట్టారు. 2025లో రూ. 7 వేలు ఎగ్గొట్టారు. ఇప్పుడు బిచ్చగాళ్లకు వేసినట్లు రైతు బంధు వేస్తున్నారు. అన్ని పంటలకు బోనస్ అని ఇప్పుడు సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తున్నారు. రేవంత్ రెడ్డి పాలనలో అడ్మినిస్ట్రేషన్ పూర్తిగా దిగజారింది. రాష్ట్రంలో రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఐకేపీ సెంటర్లు, మార్క్‌ఫెడ్ సెంటర్లలో పరిస్థితి దారుణంగా ఉంది. మొక్కజొన్నలో క్వింటాల్‌కు రూ. 900లు నష్ట పోతున్నారని తెలిపారు.
రేవంత్ రెడ్డి స్టార్ క్యాంపైనర్ కాదు స్టార్ డిస్ట్రిబ్యూటర్..
రైతులు మీ పాలనలో వలసలు వెళ్లారు. కేసీఆర్ సంక్షోభంలో ఉన్న వ్యవసాయాన్ని సంక్షేమం వైపుకు తీసుకువెళ్లారు. సివిల్ సప్లైస్‌లో పెద్ద స్కామ్ జరిగింది. మంత్రులు సివిల్ సప్లైస్ స్కామ్‌లో ఉన్నారు. కాంగ్రెస్ ఎక్కడ ఉంటే అవినీతి అక్కడ ఉంటుంది. తెలంగాణ ఖజానాను ఇతర రాష్ట్రాలకు పంపుతున్నారు. రేవంత్ రెడ్డి స్టార్ క్యాంపైనర్ కాదు స్టార్ డిస్ట్రిబ్యూటర్. ఎన్ని కేసులు పెట్టినా, జైలుకు పంపినా భయపడం. మా మీద కక్ష ఉంటే కేసులు పెట్టండి కానీ రైతుల జోలికి పోవద్దు. వరి ధాన్యాల కల్లాల్లో చనిపోతున్న రైతుల విషయంలో కాంగ్రెస్ పార్టీపై ఎన్ని కేసులు పెట్టాలి అని ఏనుగుల రాకేశ్ రెడ్డి ప్రశ్నించారు.
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
మే 21, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



