RTC Strike | మూడో రోజుకు ఆర్టీసీ సమ్మె.. నేడు కార్మిక సంఘాలతో మంత్రుల కమిటీ చర్చలు
RTC Strike | త్రినేత్ర.న్యూస్: ఆర్టీసీ సమ్మె (RTC Strike) మూడో రోజుకు చేరింది. రాష్ట్ర వ్యాప్తంగా డిపోల నుంచి బస్సులు బయటకు రావడం లేదు. ఆర్టీసీ యాజమాన్యం తాత్కాలిక ఉద్యోగులతో బస్సులు నడుపుతున్నప్పటికీ అవి ప్రయాణికుల అవసరాలకు ఏమాత్రం సరిపోవడం లేదు.
RTC Strike | త్రినేత్ర.న్యూస్: ఆర్టీసీ సమ్మె (RTC Strike) మూడో రోజుకు చేరింది. రాష్ట్ర వ్యాప్తంగా డిపోల నుంచి బస్సులు బయటకు రావడం లేదు. ఆర్టీసీ యాజమాన్యం తాత్కాలిక ఉద్యోగులతో బస్సులు నడుపుతున్నప్పటికీ అవి ప్రయాణికుల అవసరాలకు ఏమాత్రం సరిపోవడం లేదు. కాగా, ఓ డ్రైవర్ ఆత్మహత్య చేసుకోవడం, పలువురు కార్మికులు బలవన్మరణానికి యత్నించడంతో సమ్మె తీవ్రస్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కార్మిక సంఘాలను చర్చలకు ఆహ్వానించింది. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలో క్యాబినెట్ సబ్‌కమిటీని (Cabinet Subcommittee) ఏర్పాటు చేసింది.
మొత్తం ఐదుగురు మంత్రులతో భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావుతో రెవెన్యూ రిసోర్సెస్ కమిటీ ఏర్పాటు చేశారు. శుక్రవారం ఆర్టీసీ జేఏసీతో మంత్రులు చర్చలు జరుపనున్నారు. ఈ సమావేశంలో తక్షణమే పరిష్కారమయ్యే డిమాండ్లపై దృష్టిపెట్టనున్నారు. కార్మికులు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని సీఎం రేవంత్ కోరారు.
10 గంటలకు సచివాలయంలో..
మరోవైపు సబ్‌కమిటీతో చర్చల నేపథ్యంలో ఉద్యోగ సంఘాలతో ఆర్టీసీ యాజమాన్యం భేటీ కానుంది. శుక్రవారం ఉదయం 10 గంటలకు ఆర్టీసీ ఉద్యోగ సంఘాలతో సచివాలయంలో చర్చలు జరుపనుంది. కాగా, ఉద్యోగులు అధైర్యపడొద్దు, ప్రభుత్వం అండగా ఉందని ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి అన్నారు. తొందరపాటు నిర్ణయాలతో ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దని ఆర్టీసీ కార్మికులకు సూచించారు. ఉద్యోగుల డిమాండ్లు పరిష్కారమే యాజమాన్యం ధ్యేయమని తెలిపారు.
నేడు ఉమ్మడి వరంగల్ బంద్
నర్సంపేట డిపో డ్రైవర్ శంకర్‌గౌడ్ మృతికి నిరసనగా ఉమ్మడి వరంగల్ జిల్లా బంద్‌కు ఆర్టీసీ జేఏపీ పిలుపునిచ్చింది. వరంగల్, హనుమకొండ, జనగామ, మహబూబాబాద్, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో వ్యాపార, వాణిజ్య వర్గాల వారు స్వచ్ఛందంగా బంద్‌కు సహకరించాలని కోరారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



