RTC Strike | బస్సులు బంద్.. ఆర్టీసీ ఉద్యోగుల నిరవధిక సమ్మె
RTC Strike | రాష్ట్రంలో ఆర్టీసీ (TGSRTC) బస్సులు నిలిచిపోయాయి. తమ డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ ఉద్యోగులు నిరవధిక సమ్మెకు (RTC Strike) దిగారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మొదటి షిఫ్టు నుంచే బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.
RTC Strike | త్రినేత్ర.న్యూస్: రాష్ట్రంలో ఆర్టీసీ (TGSRTC) బస్సులు నిలిచిపోయాయి. తమ డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ ఉద్యోగులు నిరవధిక సమ్మెకు (RTC Strike) దిగారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మొదటి షిఫ్టు నుంచే బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులకు అవస్తలు తప్పడం లేదు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, యూనియన్‌ల పునరుద్ధరణ, ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వమే కొని సంస్థకు ఇవ్వడం సహా 32 డిమాండ్లను పరిష్కరించాలని, లేనట్లయితే నిరవధిక సమ్మెకు వెళ్తామని ఏప్రిల్ 13న ఆర్టీసీ జేఏసీ ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది. అయినప్పటికీ నిమ్మకు నీరెత్తినట్టు ఉన్న ఆర్టీసీ యాజమాన్యం, ప్రభుత్వం మంగళవారం మధ్యాహ్నం ఉద్యోగ సంఘాల నాయకులను చర్చలకు పిలిచింది.
చర్చలు విఫలం..
మంగళవారం సాయంత్రం సచివాలయం వేదికగా ఐఏఎస్ అధికారుల కమిటీతో ఆర్టీసీ జేఏసీ (JAC) నాయకులు జరిపిన చర్చలు ఎటువంటి ఫలితాన్ని ఇవ్వకుండానే ముగిశాయి. సుమారు నాలుగు గంటల పాటు సుదీర్ఘంగా సాగిన ఈ చర్చల్లో ఒక ఏకాభిప్రాయం కుదరకపోవడంతో, కార్మిక సంఘాలు సమ్మెకు వెళ్లాలన్న తమ నిర్ణయానికే మొగ్గు చూపాయి. దీంతో ముందస్తుగా ప్రకటించినట్లుగానే బుధవారం తెల్లవారుజాము నుంచే రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ సమ్మె ప్రారంభమైంది.
గడువు కోరిన ప్రభుత్వం..
తమ సమస్యలను అధికారులకు వివరించామని ఆర్టీసీ జేఏసీ చైర్మన్ వెంకన్న అన్నారు. ఐఏఎస్ అధికారుల కమిటీ 4 వారాలు గడువు కోరిందని చెప్పారు. తమ డిమాండ్లు కొత్తవి కావని, గతంలో ఇచ్చిన హామీలే అని తెలిపారు. మా మాట వింటే వినండి లేదంటే లేదని కమిటీ చెప్పిందని వెల్లడించారు. తప్పనిసరి పరిస్థితుల్లో సమ్మెకు వెళ్తున్నామని స్పష్టం చేశారు. తమ డిమాండ్లు సాధించే వరకు సమ్మె కొనసాగిస్తాంమని ఉద్ఘాటించారు. 32 డిమాండ్లు పరిష్కారమయ్యే వరకు సమ్మె చేస్తామన్నారు.
ప్రయాణికులకు తప్పని తిప్పలు..
అర్థరాత్రి నుంచే బస్సులు నిలిచిపోవడంతో సామాన్య ప్రయాణికులకు ఇబ్బందులు తప్పటడం లేదు. ఉదయాన్నే విధులకు హాజరయ్యే ఉద్యోగులు, విద్యార్థులు , సుదూర ప్రాంతాలకు ప్రయాణించాల్సిన వారు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో ప్రయాణికులు బస్టాపుల్లో వేచిఉన్నారు. కాగా, హైదరాబాద్‌లో ఎలక్ట్రిక్ బస్సులు యధావిధిగా నడుస్తున్నాయి.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



