త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TGSRTC | ప్ర‌యాణీకుల‌కు ఆర్టీసీ బంప‌ర్ ఆఫ‌ర్‌

TGSRTC | తెలంగాణ రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ (TGSRTC) ప్ర‌యాణీకుల‌కు బంప‌ర్ ఆఫ‌ర్ (Bumper Offer) ప్ర‌క‌టించింది. త‌మ బ‌స్సుల్లో టికెట్ బుక్ చేసుకునే స‌మ‌యంలోనే తిరుగు ప్ర‌యాణానికి కూడా టికెట్ బుక్ చేసుకుంటే ప‌ది శాతం రాయితీ (10% Discount) ఇవ్వ‌నున్న‌ట్లు తెలిపింది.

A

Telangana | Published On Jan 1, 2026, 1.29 pm IST

TGSRTC | ప్ర‌యాణీకుల‌కు ఆర్టీసీ బంప‌ర్ ఆఫ‌ర్‌
Advertisement

TGSRTC | తెలంగాణ రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ (TGSRTC) ప్ర‌యాణీకుల‌కు బంప‌ర్ ఆఫ‌ర్ (Bumper Offer) ప్ర‌క‌టించింది. త‌మ బ‌స్సుల్లో టికెట్ బుక్ చేసుకునే స‌మ‌యంలోనే తిరుగు ప్ర‌యాణానికి కూడా టికెట్ బుక్ చేసుకుంటే ప‌ది శాతం రాయితీ (10% Discount) ఇవ్వ‌నున్న‌ట్లు తెలిపింది. ప్రైవేట్ ట్రావెల్స్, ఇత‌ర వాహ‌నాల‌తో పోటీ నేప‌థ్యంలో ఆర్టీసీ (RTC) ఈ నిర్ణ‌యం తీసుకుంది. దీంతో ప్ర‌యాణీకులు ఆర్టీసీవైపు ఆక‌ర్షితుల‌వుతార‌ని భావిస్తున్నారు. ఇప్ప‌టికే వివిధ మార్గాల్లో టికెట్ ధ‌ర‌ల్లో రాయితీ ఇస్తున్న ఆర్టీసీ, ఈవీ బ‌స్సుల్లోనూ రాయితీ ఇస్తోంది. తాజాగా సంక్రాంతి పండుగ వేళ సొంతూళ్ల‌కు వెళ్లేవారికి తిరుగు ప్ర‌యాణం టికెట్ కూడా బుక్ చేసుకుంటే ఈ ఆఫ‌ర్ వ‌ర్తించ‌నుంది.

ట్యాగ్స్:

Advertisement

తాజావార్తలు

Advertisement