త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

RTC Driver | చెప్పుతో కొట్టి.. గొంతు ప‌ట్టి.. ఆర్టీసీ డ్రైవ‌ర్‌పై దాడి..

RTC Driver | ఆర్టీసీ డ్రైవ‌ర్‌పై ఓ వ్య‌క్తి విచ‌క్ష‌ణార‌హితంగా దాడికి పాల్ప‌డ్డాడు. డ్రైవ‌ర్‌ను చెప్పుతో కొట్టి.. బ‌య‌ట‌కు లాక్కొచ్చాడు. అంత‌టితో ఆగ‌కుండా న‌డిరోడ్డుపై డ్రైవ‌ర్‌ను ప‌డేసి గొంతు ప‌ట్టి చంపేందుకు య‌త్నించాడు. ప్ర‌యాణికులు అడ్డుకోవ‌డంతో డ్రైవ‌ర్ ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డాడు.

S

Telangana | Published On Apr 26, 2026, 4.06 pm IST

RTC Driver | చెప్పుతో కొట్టి.. గొంతు ప‌ట్టి.. ఆర్టీసీ డ్రైవ‌ర్‌పై దాడి..
Advertisement

RTC Driver | త్రినేత్ర‌.న్యూస్ : ఆర్టీసీ డ్రైవ‌ర్‌పై ఓ వ్య‌క్తి విచ‌క్ష‌ణార‌హితంగా దాడికి పాల్ప‌డ్డాడు. డ్రైవ‌ర్‌ను చెప్పుతో కొట్టి.. బ‌య‌ట‌కు లాక్కొచ్చాడు. అంత‌టితో ఆగ‌కుండా న‌డిరోడ్డుపై డ్రైవ‌ర్‌ను ప‌డేసి గొంతు ప‌ట్టి చంపేందుకు య‌త్నించాడు. ప్ర‌యాణికులు అడ్డుకోవ‌డంతో డ్రైవ‌ర్ ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డాడు. ఈ ఘ‌ట‌న న‌ల్ల‌గొండ జిల్లాలోని ఐటీ ట‌వ‌ర్ వ‌ద్ద ఆదివారం ఉద‌యం చోటు చేసుకుంది.

న‌ల్ల‌గొండ ఆర్టీసీ డిపోకు చెందిన ప‌ల్లె వెలుగు బ‌స్సు ఆదివారం ఉద‌యం హైద‌రాబాద్ దిల్‌షుఖ్‌న‌గ‌ర్ నుంచి న‌ల్ల‌గొండ ప‌ట్ట‌ణానికి బ‌య‌ల్దేరింది. అయితే ఓ వ్య‌క్తి త‌న భార్య‌ను బ‌స్సు ఎక్కించేందుకు వీటీ కాల‌నీలో ఆగి ఉన్నాడు. అక్క‌డ బ‌స్సులో ఆమెను ఎక్కించాడు.

ఆ త‌ర్వాత బ‌స్సును ఫాలో అయిన స‌ద‌రు వాహ‌న‌దారుడు.. ప‌దేప‌దే హార‌న్ కొట్టాడు. దీంతో డ్రైవ‌ర్ సైడ్ కూడా ఇచ్చాడు. ఇక వేగంగా దూసుకెళ్లిన ద్విచ‌క్ర వాహ‌న‌దారుడు.. బ‌స్సుకు అడ్డంగా త‌న బైక్‌ను ఆపాడు. ఇక బ‌స్సులోకి ప్ర‌వేశించిన అత‌ను డ్రైవ‌ర్‌పై చెప్పుతో దాడికి పాల్ప‌డ్డాడు. బూతులు తిట్టాడు. డ్రైవ‌ర్‌ను బ‌య‌ట‌కు లాక్కొచ్చి న‌డిరోడ్డుపై కింద ప‌డేశాడు. డ్రైవ‌ర్‌ను తంతూ.. గొంతు ప‌ట్టి చంపే ప్ర‌య‌త్నం చేశాడు. ప్ర‌యాణికులు ఆ వ్య‌క్తిని నిలువ‌రించి డ్రైవ‌ర్ ప్రాణాల‌ను కాపాడారు.

పోలీసుల‌కు ఫిర్యాదు

ప్ర‌యాణికులు, కండ‌క్ట‌ర్ క‌లిసి ఆర్టీసీ ఉన్న‌తాధికారుల‌కు స‌మాచారం చేర‌వేశారు. వారు హుటాహుటిన ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని డ్రైవ‌ర్‌ను ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఆర్టీసీ అధికారుల‌తో పాటు కొంత‌మంది ప్ర‌యాణికులు క‌లిసి పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

ఆస్ప‌త్రిలో చికిత్స‌

బాధిత డ్రైవ‌ర్ రామ్ కుమార్ న‌ల్ల‌గొండ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నాడు. అత‌ని ఆరోగ్య ప‌రిస్థితి నిల‌క‌డ‌గా ఉంద‌ని వైద్యులు తెలిపారు. దీంతో ఆర్టీసీ ఉన్న‌తాధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement
Advertisement