త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

RTC Bus | మంద‌మ‌ర్రిలో ఆర్టీసీ బ‌స్సు బోల్తా.. డ్రైవ‌ర్ నిద్ర‌మ‌త్తే కార‌ణ‌మా?

RTC Bus | మంచిర్యాల జిల్లా మందమర్రిలో (Mandamarri) ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు (RTC Bus) బోల్తా ప‌డింది. దీంతో ఇద్ద‌రు గాయ‌ప‌డ్డారు.

G

Telangana | Published On Jun 7, 2026, 9.20 am IST

RTC Bus | మంద‌మ‌ర్రిలో ఆర్టీసీ బ‌స్సు బోల్తా.. డ్రైవ‌ర్ నిద్ర‌మ‌త్తే కార‌ణ‌మా?
Advertisement

RTC Bus | త్రినేత్ర‌.న్యూస్‌: మంచిర్యాల జిల్లా మందమర్రిలో (Mandamarri) ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు (RTC Bus) బోల్తా ప‌డింది. దీంతో ఇద్ద‌రు గాయ‌ప‌డ్డారు. కొత్త‌గూడెం నుంచి బెల్లంప‌ల్లికి సూప‌ర్ ల‌గ్జ‌రీ బ‌స్సు వెళ్తున్న‌ది. ఈ క్ర‌మంలో మంద‌మ‌ర్రికి చేరుకోగానే బ‌స్సుపై డ్రైవ‌ర్ నియంత్ర‌ణ కోల్పోయారు. దీంతో అదుపుతప్పి జాతీయ ర‌హ‌దారి నుంచి స‌ర్వీస్ రోడ్డుపైకి బోల్తా పడింది. ప్రమాదంలో డ్రైవర్‌తో పాటు ఓ ప్రయాణికునికి స్వల్ప గాయాలయ్యాయి.

బస్సులో ఉన్న ప్రయాణికులు వారి వారి గమ్యస్థానాల్లో దిగిపోవడం.. చివరగా ఒక్క ప్రయాణికుడే బస్సులో ఉండటంతో ప్రాణ నష్టం తప్పింది. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. క్ష‌త‌గాత్రుల‌ను ద‌వాఖాన‌కు త‌ర‌లించారు. వాహ‌నాలు నిలిచిపోకుండా చర్యలు తీసుకున్నారు. ప్ర‌మాదానికి డ్రైవర్ నిద్రమత్తే కార‌ణ‌మ‌ని తెలుస్తున్న‌ది. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదుచేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement
Advertisement