Eatala Rajender | ఎంపీ ఈటల రాజేందర్‌కు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు.. నిందితులు అరెస్టు
Eatala Rajender | బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌ను (Eatala Rajender) విమర్శిస్తూ మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో వెలసిన ఫ్లెక్సీలు పార్టీలో కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. పార్టీలో అంతర్గత విభేదాలు, లుకలుకలపై తీవ్ర చర్చ నడించింది.
Eatala Rajender | త్రినేత్ర.న్యూస్: బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌ను (Eatala Rajender) విమర్శిస్తూ మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో వెలసిన ఫ్లెక్సీలు పార్టీలో కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. పార్టీలో అంతర్గత విభేదాలు, లుకలుకలపై తీవ్ర చర్చ నడించింది. ఫ్లెక్సీలకు, పార్టీ కార్యకర్తలు, నాయకులకు ఎలాంటి సంబంధం లేదని ఏకంగా రాష్ట్ర అధ్యక్షుడు వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. తాజాగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేసిన వారిని కూకట్‌పల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఎంపీ ఈటల రాజేందర్‌పై అనుచిత ఆరోపణలు చేస్తూ కొంపల్లి, సుచిత్ర, కేపీహెచ్‌బీ కాలనీ, ఔటర్ రింగ్ రోడ్డు తదితర ప్రాంతాల్లో ఇటీవల గుర్తు తెలియని వ్యక్తులు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. దీనిపై చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు సైబరాబాద్ కమిషనర్, పలు పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. దీంతో దర్యాప్తు చేపట్టిన SOT పోలీసులు, కేపీహెచ్‌బీ పోలీసుల సమన్వయంతో నలుగురు అనుమానితులను అరెస్టు చేశారు. వారిని పోలీసు స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు.

నిందితులు కంటోన్మెంట్ ప్రాంతానికి, విజయనగర్ కాలానికి చెందిన వారుగా తెలిసింది. ఫ్లెక్సీలను ప్రింట్ చేసిన కుద్రత్ అనే వ్యక్తి తో పాటు వాటిని ప్రింట్ చేయమని చెప్పిన ఓ బోర్డు మెంబర్ పీఏ, ఫ్లెక్సీలను కట్టిన వ్యక్తి కూడా ఉన్నట్లు సమాచారం. కూకట్‌పల్లి అసెంబ్లీ బీజేపీ కన్వీనర్, న్యాయవాది శ్రీకర్ రావు పిర్యాదు మేరకు కేపీహెచ్‌బీ పోలీసులు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా నిందితుల వెనుక ఎవరున్నారు, ఏ ఉద్దేశంతో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారనే విషయాన్ని పోలీసులు ఆరాతీస్తున్నారు.
తాజావార్తలు
- ●LPG cylinder | మరోసారి పెరిగిన వంట గ్యాస్ సిలిండర్ ధర.. మూడు నెలల్లో రెండోసారి
- ●Horoscope | జూన్ 7 రాశి ఫలాలు.. ఈ రాశివారికి ఊహించని ఖర్చులు, నష్టాలు !
- ●Kerala Monsoon Tourism | జూన్ వర్షాల్లో 'కేరళ' ట్రిప్.. ప్రకృతి ఒడిలో రీఫ్రెష్ అయ్యేందుకు బెస్ట్ డెస్టినేషన్!
- ●Caleb Rollerblading Hyderabad | హైదరాబాద్ 'స్టార్టప్' కల్చర్ అంటే ఇదీ.. కేబుల్ బ్రిడ్జిపై విదేశీయుడికి కారులో నుంచే బిజినెస్ పిచ్!
- ●Meghalaya New Secretariat | షిల్లాంగ్ రూపురేఖలు మార్చే భారీ ప్రాజెక్ట్: రూ.1,188 కోట్లతో మేఘాలయ నూతన సచివాలయం!
- ●Water Hyacinth Saree | చెత్త నుంచి అందమైన చీరలు: గుర్రపు డెక్కను వస్త్రంగా మార్చిన జార్ఖండ్ ఇంజనీర్!

LPG cylinder | మరోసారి పెరిగిన వంట గ్యాస్ సిలిండర్ ధర.. మూడు నెలల్లో రెండోసారి

Horoscope | జూన్ 7 రాశి ఫలాలు.. ఈ రాశివారికి ఊహించని ఖర్చులు, నష్టాలు !

Kerala Monsoon Tourism | జూన్ వర్షాల్లో 'కేరళ' ట్రిప్.. ప్రకృతి ఒడిలో రీఫ్రెష్ అయ్యేందుకు బెస్ట్ డెస్టినేషన్!

Caleb Rollerblading Hyderabad | హైదరాబాద్ 'స్టార్టప్' కల్చర్ అంటే ఇదీ.. కేబుల్ బ్రిడ్జిపై విదేశీయుడికి కారులో నుంచే బిజినెస్ పిచ్!




