Special Trains | సికింద్రాబాద్ మీదుగా బిలాస్‌పూర్-యలహంక మధ్య ప్రత్యేక రైళ్లు..
Special Trains | వేసవి సెలవుల నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. బిలాస్‌పూర్–యలహంక మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.
Special Trains | వేసవి సెలవుల నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. బిలాస్‌పూర్–యలహంక మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. రైలు నంబర్ 08261 బిలాస్‌పూర్–యలహంక ప్రత్యేక రైలు జూన్ 3 నుంచి జూలై 1 వరకు ప్రతి బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు బిలాస్‌పూర్ నుంచి బయలుదేరి, మరుసటి రోజు గురువారం సాయంత్రం 7 గంటలకు యలహంక చేరుకుంటుందని తెలిపింది.
అలాగే, రైలు నంబర్ 08262 యలహంక–బిలాస్‌పూర్ ప్రత్యేక రైలు జూన్ 4 నుంచి జూలై 2 వరకు ప్రతి గురువారం రాత్రి 9.30 గంటలకు యలహంక నుంచి బయలుదేరి, శనివారం తెల్లవారుజామున 3.30 గంటలకు బిలాస్‌పూర్ చేరుకుంటుందని పేర్కొంది. ఆయా ప్రత్యేక రైళ్లు రెండుమార్గాల్లో భటాపారా, రాయ్‌పూర్, దుర్గ్, రాజ్‌నంద్‌గావ్, డోంగర్‌గఢ్, గొండియా, వడ్సా, చందా ఫోర్ట్, బల్హర్షా, సిర్పూర్ కాగజ్‌నగర్, మంచిర్యాల, కాజీపేట్, చర్లపల్లి, సికింద్రాబాద్, లింగంపల్లి, వికారాబాద్, తాండూర్, యాదగిరి, కృష్ణ, రాయచూర్, మంత్రాలయం రోడ్, గుంతకల్, గూటి, అనంతపురం, ధర్మవరం స్టేషన్లలో ఆగనున్నాయి. రైలులో త్రీటైర్ ఏసీ, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉన్నాయని, అడ్వాన్స్‌డ్ టికెట్లు బుక్ చేసుకోవచ్చని దక్షిణ మధ్య రైల్వే వివరించింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

DK Shivakumar | కర్నాటకలో కొలువుదీరిన కొత్త సర్కారు.. విద్య, ఉద్యోగం, రైతులపై డీకే ఫోకస్..!
జూన్ 3, 2026

Raghunandan Rao | రేవంత్ నాయకత్వంలో కాంగ్రెస్‌కు ఇవే చివరి ఎన్నికలు: ఎంపీ రఘునందన్ రావు
జూన్ 3, 2026

Foreigners’ Registration | ఆ పత్రాలు సమర్పించాల్సిందే.. ఇమ్మిగ్రేషన్ చట్టంపై పోలీసుల వార్నింగ్..!
జూన్ 3, 2026
తాజావార్తలు
- ●Peddi Review | పెద్ది రివ్యూ - రామ్‌చరణ్ ఆట అదిరింది.. కానీ కిక్కు మిస్సయ్యింది - జాన్వీ కపూర్ మైనస్!
- ●Mumbai Water Crisis | ముంబై మహా నగరానికి ముంచుకొస్తున్న నీటి గండం? దారుణంగా పడిపోయిన నీటి మట్టాలు
- ●Kevin Kunta | రామ్ చరణ్ బాడీగార్డ్ కెవిన్ కుంట ఎవరు? 'పెద్ది' ఈవెంట్లో జాన్వీ కపూర్‌ను ఎలా కాపాడాడు?
- ●DK Shivakumar | కర్నాటకలో కొలువుదీరిన కొత్త సర్కారు.. విద్య, ఉద్యోగం, రైతులపై డీకే ఫోకస్..!
- ●Raghunandan Rao | రేవంత్ నాయకత్వంలో కాంగ్రెస్‌కు ఇవే చివరి ఎన్నికలు: ఎంపీ రఘునందన్ రావు
- ●Foreigners’ Registration | ఆ పత్రాలు సమర్పించాల్సిందే.. ఇమ్మిగ్రేషన్ చట్టంపై పోలీసుల వార్నింగ్..!

Peddi Review | పెద్ది రివ్యూ - రామ్‌చరణ్ ఆట అదిరింది.. కానీ కిక్కు మిస్సయ్యింది - జాన్వీ కపూర్ మైనస్!

Mumbai Water Crisis | ముంబై మహా నగరానికి ముంచుకొస్తున్న నీటి గండం? దారుణంగా పడిపోయిన నీటి మట్టాలు

Kevin Kunta | రామ్ చరణ్ బాడీగార్డ్ కెవిన్ కుంట ఎవరు? 'పెద్ది' ఈవెంట్లో జాన్వీ కపూర్‌ను ఎలా కాపాడాడు?

DK Shivakumar | కర్నాటకలో కొలువుదీరిన కొత్త సర్కారు.. విద్య, ఉద్యోగం, రైతులపై డీకే ఫోకస్..!



