త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

RS Praveen Kumar | అడ్లూరి లక్షణ్ కథలు బంజెయ్ : ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్‌

RS Praveen Kumar | దళిత బిడ్డనైన త‌న‌ను హ‌రీశ్‌రావు ఏదో అన్నార‌ని అడ్లూరి ల‌క్ష్మ‌ణ్‌కుమార్ అంటున్నార‌ని.. ఇక‌పై మంత్రి అలాంటి క‌థ‌లు బంద్ చేయాల‌ని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చారు. తెలంగాణ భ‌వ‌న్‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడారు.

P

Telangana | Published On Jul 3, 2026, 7.59 pm IST

RS Praveen Kumar | అడ్లూరి లక్షణ్ కథలు బంజెయ్ : ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్‌
Advertisement

RS Praveen Kumar | దళిత బిడ్డనైన త‌న‌ను హ‌రీశ్‌రావు ఏదో అన్నార‌ని అడ్లూరి ల‌క్ష్మ‌ణ్‌కుమార్ అంటున్నార‌ని.. ఇక‌పై మంత్రి అలాంటి క‌థ‌లు బంద్ చేయాల‌ని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చారు. తెలంగాణ భ‌వ‌న్‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడారు. గన్ పార్క్ వద్దకు త‌మ‌ను అనుమతిస్తే మంత్రుల బండారం బయటపడేద‌న్నారు. జూపల్లి కృష్ణారావుకు ఏం పని లేదు కాబట్టే సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌కు వ‌స్తున్నార‌ని, జూపల్లి కృష్ణారావు తెలంగాణ భవన్‌కు వస్తారేమో అనుకున్నామ‌న్నారు. ప్రెస్ క్లబ్ వచ్చి ఉత్తర ప్రగల్భాలు పలుకుతున్నార‌ని విమ‌ర్శించారు. జూపల్లిలా గాలికి తిరిగే వాళ్లం తాము కాద‌ని.. తాము నిన్న సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌కు వ‌స్తామ‌ని మంత్రులు గన్ పార్క్ వద్దకు వెళ్లార‌న్నారు. గన్‌పార్క్ వద్దకు త‌మ నాయ‌కులు హరీశ్‌రావు, కేటీఆర్ రాకుండా అరెస్ట్ చేశార‌న్నారు. ఎవరి చెవిలోనైనా పూలు పెట్టండి అంతేగాని ప్రవీణ్ కుమార్ చెవిలో పెటొద్ద‌న్నారు. పొన్నం ప్రభాకర్‌కు అడ్లూరి లక్షణ్‌కు త‌న గురించి బాగా తెలుసున‌న్నారు.

తాను క‌రీంన‌గ‌ర్ ఎస్పీగా ప‌ని చేసిన స‌మ‌యంలో పొన్నం, అడ్లూరి ఏం చేశారో త‌న‌కు తెలుసున‌న్నారు. గన్ పార్క్ వద్దకు మమ్మల్ని రాకుండా అరెస్ట్ చేసింది మీరే క‌దా అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇద్ద‌రు మంత్రులు హ‌రీశ్‌రావుపై ఆడిపోసుకున్నార‌ని, పేద‌ల గురించి మాట్లాడితే త‌ట్టుకోలేక‌పోతున్నార‌ని ధ్వ‌జ‌మెత్తారు. జీవో 17 నెంబర్‌పై సంక్షేమ శాఖ మంత్రులుగా సంతకం చేశారా లేదా అంటూ ప్ర‌శ్నించారు. తాడు బొంగరం ఎవరికి ఉందో లేదో జీవో 17పై సంతకం చేశారో లేదో పొన్నం ప్రభాకర్ చెబితే తెలుస్తుంద‌న్నారు. ఎన్ఎస్‌యూఐ లీడ‌ర్‌గా అప్పుడు, మంత్రిగా ఇప్పుడు పొన్నంకు మెచ్యూరిటీ ఉందో లేదో ఆయ‌న‌కే తెలియాల‌న్నారు. గురుకుల సెక్రటరీగా తాను తొమ్మిదేళ్లు ప‌ని చేసిన అనుభ‌వం ఉంద‌ని తెలిపారు. ఆరు నెల‌లు ఇంటిని వ‌దిలేసి పేద విద్యార్థుల కోసం కృషి చేశాన‌న్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, షఫీ ఉల్లా, మల్లయ్య భట్, గురుకులాల్లో పని చేయాలని కేసీఆర్ అన్నార‌ని చెప్పారు.

మఫత్ లాల్ బట్టలు కావాలని పేద విద్యార్థులు ఎవరు అడగలేద‌ని, పారదర్శకంగానే గురుకుల టెండర్ జరిగిందని మంత్రి లక్ష్మణ్ కుమార్ అంటున్నార‌ని.. పారదర్శకంగానే గురుకుల టెండర్‌లో భారీ కుంభకోణం జ‌రిగింద‌ని ఆరోపించారు. జీవో 17 రద్దు చేసేంత వరకు 2 వేల కోట్ల కుంభకోణం పై నిరంతరం పోరాడుతూనే ఉంటామ‌ని తేల్చి చెప్పారు. నేరం జరిగినప్పుడు చూస్తున్న ప్రతివాడు నేరస్తుడేన‌ని, భ‌ట్టి విక్రమార్క మల్లు, పొన్నం, అడ్లూరి ముఖ్యమంత్రి కాపాడే ప్రయత్నం చేస్తే వారే నేరస్థులు అవుతార‌న్నారు. అంకెకు సంఖ్యకు తేడా తెలియని వ్యక్తి మంత్రి అడ్లూరి లక్షణ్ కుమార్ అని, జూపల్లి కృష్ణారావుకు పనిపాట లేకుండా సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వెళ్తున్నార‌ని విమ‌ర్శించారు.

మంత్రుల్లా మేము ఆవారా గాళ్లం కాద‌ని, త‌మ‌కు అనేక పనులు ఉన్నాయ‌న్నారు. సచివాలయంలో ఫైల్స్ పెండింగ్ ఉంటే చూసుకోవాల‌ని.. లేకపోతే ఇంట్లో పండుకోండి జూపల్లి కృష్ణారావు అంటూ ఘాటుగా వ్యాఖ్య‌లు చేశారు ప్ర‌వీణ్‌కుమార్‌. త‌న‌పై విచారణ చేసుకోవాల‌ని మంత్రులకు బ‌హిరంగ స‌వాల్ చేస్తున్నాన‌న్నారు. మంత్రులకు దమ్ముంటే సంక్షేమ భవన్‌లో కూర్చొని విచారణ చేయాల‌న్నారు. అవినీతిపై మంత్రులు జైలుకు వెళ్ల‌డం ఖాయ‌మ‌న్నారు. తొలుత రేవంత్‌రెడ్డి 18 నెల‌లు సంక్షేమ మంత్రిగా ఉన్నార‌ని, త‌న త‌ప్పులు ఎక్క‌డ దొరుకుతాయోన‌ని భూత‌ద్దంలో పెట్టి వెతికార‌ని.. అయినా ఏం చేయాలేకపోయార‌న్నారు. విచారణలో ఆయనకు తాను తయారు చేసిన డాక్టర్లు, ఇంజినీర్లు, సైంటిస్ట్‌లు క‌నిపిస్తార‌న్నారు.

Advertisement
Advertisement