త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

RS Praveen Kumar | కేటీఆర్, హరీశ్ రావులపై పెట్రోల్ పోసి చంపుతామన్నారు

RS Praveen Kumar | ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేని ప్రభుత్వం అదే విషయాన్ని ప్రశ్నిస్తున్న సోషల్ మీడియాపై రూల్స్ కు విరుద్ధంగా కేసులు పెడుతున్నారు. పాలక పక్షంలో ఎవ్వరెన్ని దూషణలు చేసినా సహిస్తున్న పాలనా యంత్రాంగం కేవలం ప్రతిపక్షాలపైనే చర్యలకు పూనుకుంటున్నది. కేటీఆర్, హరీశ్ రావులపై పెట్రోల్ పోసి చంపుతామని బెదిరించిన మైనంపల్లి హనుమంతరావు, ఆయన కుమారుడిపైన కనీసం ఒక్క కేసు కూడా నమోదు చేయలేని రాష్ట్ర పోలీసులు కేవలం సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన పనులు మాత్రమే చేస్తున్నారు. చట్ట ప్రకారం నడుచుకోవడం ఎప్పుడో మరిచిపోయారు --- బీఆర్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌

P

Telangana | Published On Apr 24, 2026, 3.05 pm IST

RS Praveen Kumar | కేటీఆర్, హరీశ్ రావులపై పెట్రోల్ పోసి చంపుతామన్నారు
Advertisement
  • తెలుగు స్క్రైబ్ కు యాంటి టెర్రర్ లా కింద నోటీసులు 

  • కౌంటర్ ఇంటెలిజెన్స్ లాంటి సంస్థలను బయటపెడుతున్నారు 

  • పోలీసులూ..చట్ట ప్రకారం నడుచుకోండి

  • రేవంత్ రెడ్డి ఏం చెబితే అది చేసేస్తారా

RS Praveen Kumar | ఆర్టీసీ (TGRTC) కార్మికుడు శంకర్ ది ఆత్మహత్య కాదని అది ప్రభుత్వం చేసిన  హత్యగానే భావిస్తున్నామని బీఆర్‌ఎస్‌ (BRS) ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో ఆయన మీడియా శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన ఆర్టీసీ కార్మికుల సమ్మె, క్రిశాంక్ అరెస్టు, సోషల్ మీడియా సంస్థలకు నోటీసులు..వంటి అనేక అంశాలపై మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే..

ఆర్టీసీ కార్మికులకు టెంట్ ఇవ్వకూడదా

ఆర్టీసీ కార్మికులకు టెంట్ హౌస్ ఇవ్వకూడదని తాండూరు (Thanduru) పోలీసులు ఇచ్చిన నోటీసు భయానకంగా ఉన్నాయి. పరిస్థితి చూస్తుంటే ఆర్టీసీ కార్మికుల వార్తలు రాస్తున్న విలేకరులపై సైతం కేసులు నమోదు చేస్తారేమో. ముఖ్యమంత్రి (CMO)  దగ్గర హోంశాఖ పెట్టుకోవడం, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి (Minister Ponguleti Srinivas Reddy) రెవెన్యూశాఖ ఇవ్వడం వెనుక అనేక కుట్రలు దాగి ఉన్నాయి . పరువుకు నష్టం కలిగేలా తెలుగు స్క్రైబ్ (Telugu Scribe) అనే సంస్థ కంటెంట్ పోస్ట్ చేస్తుందని తప్పుడు ఆరోపణలు చేస్తూ.. వారికి నోటీసులు ఇచ్చారు. తెలంగాణ ప్రజలకు వ్యతిరేకంగా తెలుగు స్క్రైబ్ కంటెంట్ పోస్ట్ చేస్తున్నదని ఇంటెలిజెన్స్ అధికారి నోటీస్ ఇచ్చారు.

ఆ అధికారి పేరు చెప్పలేకపోతున్నా

ఆ అధికారి పేరు చెప్పలేక పోతున్నా. ఎందుకంటే.. 26 యేండ్ల పాటు నేను ఐపీఎస్‌ (IPS) అధికారిగా పని చేశా. నా బ్యాచ్ మెంట్స్ నిన్న డీజీలు (DG)గా పదోన్నతులు పొందారు. టెర్రరిస్టులపై పెట్టే కేసును తెలుగు స్క్రైబ్  (Telugu Scribe) పై పెట్టేందుకు సిద్ధమయ్యారు. పరిస్థితి చూస్తుంటే రాను రాను జర్నలిస్టులపై కేసులు పెడతారేమో. కొణతం దిలీ‌ప్‌పై నిర్మల్ (NIRMAL) జిల్లాలో అనేక కేసులు పెట్టారు.  సీఐ సెల్‌ అనేది టెర్రరిస్ట్  (Terrorist) లాంటి కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిని గుర్తించి వారిపై టెర్రరిస్ట్ కేసులు నమోదు చేసే సంస్థ. అలాంటి సంస్థ నుంచి తెలుగు స్క్రైబ్ కు నోటీసులు ఇచ్చారు. తెలుగు స్క్రైబ్ చేసిన తప్పేందో చెప్పాలి. బీఆర్‌ఎస్‌ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్, ఆయన సతీమణిపై అక్రమ కేసులు నమోదు చేస్తున్నారు.

జర్నలిస్టులకు యాంటి టెర్రర్ చట్టం ప్రకారం నోటీసులా?

కౌంటర్ ఇంటిలిజెన్స్ లాంటి సీక్రెట్ సంస్థలను స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే (CM Revanth Reddy) బయటపెడుతున్నాడు. సీక్రెట్ సంస్థలను బయటపెట్టకూడదు. సీక్రెట్ సంస్థలను బయట పెడుతున్న రేవంత్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలి. యాంటి టెర్రర్ లా క్రింద ఇచ్చే నోటీసులు తెలుగు స్క్రై‌బ్‌ (Telugu Scribe) కి ఇచ్చారు. యాంటి టెర్రర్ లా నోటీసులు ఇచ్చి జైల్లో పెట్టిన వారిలో వరవరరావు (VaraVara Rao) తో పాటు అనేక మంది ఉన్నారు. పోలీస్ అధికారులకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. చట్టానికి లోబడి మాత్రమే పనిచేయండి. చట్టానికి లోబడి పని చేస్తాం అని ప్రమాణం చేసే మీరు ఈ బాధ్యతలు చేపట్టిన విషయం మరిచిపోకూడదు. జర్నలిస్టులకు యాంటి టెర్రర్‌ లా కింద నోటీసులు ఇవ్వడం సరికాదు.

హబీబుల్లా ఖాన్ ను చూసైనా నేర్చుకోండి

సోషల్ మీడియాపై అడ్డగోలుగా కేసులు పెడుతున్న పోలీసులు.. ఇదే పోలీసు అధికారిపై  మాటల్లో చెప్పరాని విధంగా బూతులు తిట్టిన జగ్గారెడ్డి(JaggaReddy) పై ఎందుకు చర్యలు తీసుకోలేదు. కేటీఆర్ (KTR), హరీశ్ రావు (Harish Rao) లాంటి వారిని పెట్రోల్ పోసి చంపుతాం అని మాట్లాడిన మైనంపల్లి హనుమంతురావు, ఆయన కుమారుడిపై ఎందుకు చర్యలు తీసుకోలేదు. కేవలం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న మన్నె క్రిశాంక్ (Manne krishank) పై కేసులు పెడుతున్నారు. పోలీస్ అధికారులు చట్టానికి లోబడే పని చేయాలి కానీ రేవంత్ రెడ్డి ఎలా చెప్తే అలా చేయొద్దు.  మంత్రి పొంగులేటి కుమారుడి అక్రమాలపై ధైర్యంగా కేసు పెట్టిన సీఐ హబీబుల్లాఖాన్‌ను చూసైనా  ఐపీఎస్లు  నేర్చుకోవాలి.

సుప్రీం కోర్టు (Supreme court of India) ఆదేశాలూ పాటించరా

కార్పొరేషన్ మాజీ చైర్మన్ పాటిమీది జగన్మోహన్ రావు మాట్లాడుతూ అడ్డమైన హామీలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. సోషల్ మీడియా వచ్చే వార్తల ఆధారంగా కేసు నమోదు చేయొద్దని సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ.. Hate స్పీచ్ బిల్లు తెచ్చి ప్రశ్నించే గొంతుకలను నోరు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. యాంటి టెర్రర్ చట్టాన్ని సామాన్య ప్రజలపై పెడుతున్నారని  ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకే ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న మన్నె క్రిశాంక్‌పై కేసులు పెట్టారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరి చూస్తుంటే ప్రజాస్వామ్యానికే పెను ప్రమాదం రాబోతోందంటూ  జగన్మోహన్ రావు ఆందోళన వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement