RS Praveen Kumar | బండి సంజయ్ కొడుకు కేసును సీబీఐతో విచారణ చేయించాలి.. రేవంత్ సర్కారును డిమాండ్ చేసిన ఆర్ఎస్ ప్రవీణ్..!
RS Praveen Kumar | గత 15 రోజుల నుంచి తెలంగాణలో శాంతి భద్రతలు క్షీణించాయని, పోలీసు శాఖ తూతూ మంత్రంగా పని చేస్తోందని బీఆర్ఎస్ నేత ఆర్ ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో ఆయన శనివారం మీడియా సమావేశం నిర్వహించారు.
RS Praveen Kumar | గత 15 రోజుల నుంచి తెలంగాణలో శాంతి భద్రతలు క్షీణించాయని, పోలీసు శాఖ తూతూ మంత్రంగా పని చేస్తోందని బీఆర్ఎస్ నేత ఆర్ ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో ఆయన శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. జూబ్లిహిల్స్ ప్రశాసన్ నగర్‌లో మాజీ ఐపీఎస్ అధికారి భార్యను హత్య చేస్తే ఇప్పటి వరకు నిందితులను పట్టుకోలేదని అన్నారు. కరీంనగర్‌లో పీఎంజే గోల్డ్ షాప్‌లో ఐదుగురు వ్యక్తులు చొరబడి నగలు ఎత్తుకెళ్లినా ఇప్పటి వరకు దొంగలను పట్టుకోలేదన్నారు.
బాధగా ఉంది..
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పుత్ర రత్నం లీలలు బయట పెడుతున్నందుకు బాధగా ఉందన్నారు. మాల్కాజిగిరి పోలీస్ కమిషనర్ ఒంటరిగా వెళ్తే 40 మంది ఆకతాయిలు వేధించారని చెప్పారు. బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్‌పై పెట్ బషీరాబాద్ పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారని తెలిపారు. నిన్న సాయంత్రం కరీంనగర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఒక ఎఫ్‌ఐఆర్ నమోదైందని, బండి సాయి భగీరథ్ మైనర్ బాలికపై ఫిర్యాదు చేశారని మండిపడ్డారు. మైనర్ బాలికపై నిర్మల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైందని, 17 ఏళ్ల బాలికకు బండి సాయి భగీరథ్ భయపడతారా అని ప్రశ్నించారు. మహేంద్ర యూనివర్సిటీలో యాంటీ ర్యాగింగ్ కింద బండి సాయి భగీరథ్‌పై రెండు కేసులు నమోదయ్యాయని గుర్తు చేశారు.
స్టేట్‌మెంట్ ఎందుకు రికార్డ్ చేయలేదు?
మైనర్ బాలిక కుటుంబం డబ్బు ఉన్న కుటుంబమని అన్నారు. మైనర్ బాలిక తల్లి పెట్ బషీరాబాద్‌లో ఫిర్యాదు చేస్తే పోలీసులు వెంటనే కేసు నమోదు చేయలేదని ఆరోపించారు. మైనర్ బాలిక తల్లి 8 గంటలు పోలీస్ స్టేషన్‌లో ఉన్నారని చెప్పారు. బండి సంజయ్ కుమారుడికి, బోధన్ మాజీ ఎమ్మెల్యే కుమారుడికి ఒక న్యాయమా అని ప్రశ్నించారు. 183 బీఎన్ఎస్ఎస్ కింద ఎందుకు మైనర్ బాలిక తల్లి స్టేట్మెంట్ రికార్డు చేయలేదని ప్రశ్నించారు. రేపు హైదరాబాద్ పర్యటనలో మోదీ పక్కన బండి సంజయ్ కూర్చుంటున్నారని, బండి సాయి భగీరథ్ మైనర్ బాలికను చాటింగ్ ద్వారా వేధించారని తెలిపారు. ఇప్పటి వరకు మూడు సార్లు అత్యాచార యత్నం చేశారని.. నూతన సంవత్సరం సందర్భంగా మత్తు మందు కలిపి మైనర్ బాలికపై అత్యాచారం చేశారని ఆరోపించారు.
ఆ ముగ్గురికి అవినాభావ సంబంధం..
బండి సంజయ్, రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డికి అవినాభావ సంబంధం ఉందని, పోలీసులు పట్టించుకోవడం లేదని వ్యాఖ్యానించారు. మైనర్ బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించారని తెలిపారు. బీజేపీలో ఉన్న మాజీ జర్నలిస్టు మైనర్ బాలిక తల్లిదండ్రులతో మాట్లాడి కేసు విత్‌డ్రా చేసుకోవాలని చెప్పారని ఆరోపించారు. బండి సంజయ్ ఒత్తిడి మేరకు మైనర్ బాలిక, తల్లిదండ్రులపై నిర్మల్‌లో కేసు నమోదు చేశారని చెప్పారు. స్టేషన్ బెయిల్ పొందే విధంగా పోలీసులు సెక్షన్లు పెట్టారన్నారు. బండి సంజయ్ తన కుమారుడిని వెనకేసుకు వచ్చారని, అమ్మాయిల జీవితాలతో బండి సంజయ్ కుమారుడు ఆటలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ భేటీ బచావో క్యాంపెయిన్ శుష్క వాగ్ధానమని విమర్శించారు. బీజేపీలో ఉన్న మహిళా నేతలు దీనిపై మాట్లాడాలని డిమాండ్ చేశారు.
రేవంత్ చెప్పగానే సెక్షన్ల తగ్గింపు..
బండి సంజయ్ కుమారుడు మైనర్ బాలిక వాళ్ళ అమ్మాయితో ఛాటింగ్ చేసి కేసు విత్ డ్రా చేసుకోవాలని కోరారని, రేవంత్ రెడ్డి చెప్పగానే సెక్షన్లు తగ్గించారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ప్రతి దానికి సిట్ వేస్తారని, ఇప్పుడు ఈ అంశంపై రేవంత్ రెడ్డి సిట్ వేయాలని సవాల్ విసిరారు. యూపీలో ఉన్నావ్‌లో అమ్మాయిపై బీజేపీ ఎమ్మెల్యే అత్యాచారం చేశారని, యూపీలో అమ్మాయి తండ్రి లాకప్ డెత్‌కు గురయ్యారని గుర్తు చేశారు. బండి సాయి భగీరధ్ కేసులో మైనర్ బాలిక తల్లిదండ్రులకు ప్రాణహాని ఉందని, దీనిపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ లో కేసు పెట్టమని ఐడియా ఇచ్చింది పోలీసులేనని తమకు అనుమానం ఉందని, బండి సంజయ్ కొడుకును భాధితుడిగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు.
కేంద్రమంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలి
బండి సంజయ్ ను కేంద్ర హోం శాఖా సహాయ మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. పవిత్రమైన నార్త్ బ్లాక్ లో బండి సంజయ్ కూర్చుంటున్నారని, మేజిస్ట్రేట్ ముందు మైనర్ బాలిక స్టేట్మెంట్ రికార్డు చేయించాలని డిమాండ్ చేశారు. బండి సంజయ్ గంజాయి గ్యాంగ్‌ను పంపి దాడులు చేయిస్తారని, బండి సంజయ్ కుమారుడు సాయి భగీరధ్‌పై పీడీ యాక్ట్ పెట్టి అరెస్టు చేయాలన్నారు. బండి తన కుమారుడిని పెట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో అప్పగించాలని, కేంద్ర మంత్రి కుమారుడిపై హానీ ట్రాప్ అస్త్రం అంటూ బీజేపీ సోషల్ మీడియాలో మైనర్ బాలిక కుటుంబంపై దుష్ప్రచారం చేస్తుందని ఆరోపించారు. బీజేపీ వాట్సాప్ యూనివర్సిటీ అసత్య కట్టుకథలు అల్లుతోందన్నారు. బండి సంజయ్ కొడుకు శుద్ధపూస అని చెప్పాలని బీజేపీ సోషల్ మీడియా ప్రయత్నం చేస్తోదన్నారు.
జేమ్స్ బాండ్ కాదు..
హనీ ట్రాప్ అనేది దేశ భద్రత గూడాచారుల మీద చేసేదని, బండి సంజయ్ కొడుకు జేమ్స్ బాండ్ జీరో జీరో కాదని.. ఖైదీ నెంబర్ 786 అంటూ విమర్శించారు. బండి సంజయ్ కుమారుడు ఘటనపై ప్రధాన మంత్రి మోడీ మాట్లాడాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ టూ టౌన్,పెట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లలో ఉండే సీసీ టీవీ ఫుటేజ్‌ని సేకరించాలని, బండి సంజయ్,రేవంత్ రెడ్డి ఇద్దరూ ఫ్రెండ్స్ అంటూ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



