Excise Constable Sowmya | ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి కోటి ఆర్థిక సాయం.. ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం
Excise Constable Sowmya | విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఎక్సైజ్ కానిస్టేబుల్ గాజుల సౌమ్య (Excise Constable Sowmya) కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సహాయం ప్రకటించింది. రూ.కోటి నగదుతోపాటు ఆమె కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నట్లు తెలిపింది.
- అన్ని విధాలా అండగా ప్రభుత్వం
- ఎక్సైజ్ సిబ్బందికి ఆయుధాలు: మంత్రి జూపల్లి
Excise Constable Sowmya | త్రినేత్ర.న్యూస్: విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఎక్సైజ్ కానిస్టేబుల్ గాజుల సౌమ్య (Excise Constable Sowmya) కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సహాయం ప్రకటించింది. రూ.కోటి నగదుతోపాటు ఆమె కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నట్లు తెలిపింది. ఈ మేరకు మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao) వెల్లడించారు. సౌమ్య విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని చెప్పారు. ఆమె కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా.. ఎక్సైజ్ విధి నిర్వహణలో ఉన్న పోలీసులకు ఆయుధాలు ఇవ్వనున్నామని తెలిపారు.
దెబ్బతిన్న కిడ్నీ, ప్లీహం
జనవరి 23న రాత్రి నిజామాబాద్ పట్టణ శివారులో గంజాయి రవాణాను అడ్డుకునేందుకు ఎక్సైజ్ సీఐ స్వప్న, కానిస్టేబుల్ సౌమ్య, ఇతర సిబ్బందితో కలిసి వెళ్లారు. ఈ నేపథ్యంలోనే కారులో వస్తున్న స్మగ్లరు వీరిని గమనించి తప్పించుకునే ప్రయత్నం చేశారు. సీఐ స్వప్న, సౌమ్య వారి కారును అడ్డుకునేందుకు యత్నించగా.. దుండగులు నేరుగా వీరిపైకే కారును పోనిచ్చారు. అయితే స్వప్న తప్పించుకోగా.. సౌమ్యపైకి కారు ఎక్కించారు. తిరిగి రివర్స్ చేస్తున్న సమయంలో సౌమ్యపైకి మరోసారి ఎక్కించడంతో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. తోటి సిబ్బంది వెంటనే ఆమెను పట్టణంలోని ఓ ప్రైవేటు దవాఖానకు తరలించారు. అయితే కిడ్నీ, ప్లీహం దెబ్బతినడంతో వాటిని తొలగించారు.
నిమ్స్ డైరెక్టర్ ప్రకటించిన కొన్ని గంటలకే..
ఈ క్రమంలో పరిస్థితి విషమిస్తుండటంతో అదే నెల 25 హైదరాబాద్‌లోని నిమ్స్ దవాఖాకు తరలించారు. వివిధ విభాగాల వైద్య నిపుణులు అత్యాధునిక చికిత్స అందించినప్పటికీ ఆమె ప్రాణాలను కాపాడలేకపోయారు. శనివారం సాయంత్రం సౌమ్య ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని నిమ్స్ డైరెక్టర్ బీరప్ప హెల్త్ బులెటిన్ విడుదల చేసిన కొన్ని గంటలకు ఆమె తుదిశ్వాస విడిచారు.
ఇప్పటివరకు ముగ్గురు అరెస్ట్
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గత శుక్రవారం రాత్రి గంజాయి తరలిస్తున్న స్మగ్లర్లు తాము ప్రయాణిస్తున్న కారుతో ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్యను ఢీకొట్టిన కేసులో ఇప్పటి వరకు ముగ్గురిని అరెస్టు చేశారు. వారిలో మతిన్, సఫియుద్దీన్, సయ్యద్ సోహైల్ ఉన్నారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






