Dharmapuri Arvind | అప్పుడు రేవంత్ రెడ్డి పత్తాలాడుతుండే..
Dharmapuri Arvind | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఫైర్ అయ్యారు. ఆయనవి శుష్కవాగ్దానాలేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ లో కమిటెడ్ గా పనిచేస్తున్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డినో, శ్రీధర్ బాబునో ముఖ్యమంత్రిని చేస్తే సరిపోయేదని.. రేవంత్ రెడ్డికి ఓ మంత్రి పదవి ఇస్తే సరిపోయేదని అభిప్రాయం వ్యక్తం చేశారు.
సీఎం స్థాయికి పనికి రాడు
పత్తలాట ఆడినట్టు
నోటికొచ్చినట్టు మాట్లాడ్తడు
రేవంత్ రెడ్డికి సీఎం స్ట్రేచరే లేదు
2029లో అధ్వాన్నంగా ఓడిపోతరు
కోమటిరెడ్డిని సీఎం చేసేదుండె
కేసీ వేణుగోపాల్ కోసం పైసలు పెట్టిండు
పత్తాలాటలో వాగినట్టు..
ఇష్టమున్నట్టు వాగ్దానాలు చేస్తడు
ముఖ్యమంత్రి రేవంత్ పై
ఎంపీ ధర్మపురి అర్వింద్ ఫైర్
Dharmapuri Arvind | త్రినేత్ర.న్యూస్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఫైర్ అయ్యారు. ఆయనవి శుష్కవాగ్దానాలేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ లో కమిటెడ్ గా పనిచేస్తున్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డినో, శ్రీధర్ బాబునో ముఖ్యమంత్రిని చేస్తే సరిపోయేదని.. రేవంత్ రెడ్డికి ఓ మంత్రి పదవి ఇస్తే సరిపోయేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి సీఎం స్థాయికి పనికి రాడని వ్యాఖ్యానించారు. నిజామాబాద్ జిల్లా బీజేపీ కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆయన ఇంకా ఏమన్నారంటే...
ముఖ్యమంత్రి స్థాయికి పనికి రాడు
అసలు.. సీఎం రేవంత్ రెడ్డికి ఓ స్ట్రెచర్ లేదు.. మన్ను లేదు.. ముఖ్యమంత్రి స్థాయికి పనికిరాడు. కాంగ్రెస్ వాళ్లు ఎన్ని దేవుండ్ల మీద ఒట్టేసిండు. దేవుండ్లకే మోసం చేసిండు. రేవంత్ రెడ్డి నోరు ఉన్నదని కయ్య కయ్య అరుస్తడు. ఇంతకు ముందు పత్తాలాడుతుండె. ఏమన్నంటే పత్తాలాటనే. ఈయన పత్తాలాట టీమ్ లో అన్ని పార్టీలోళ్లు ఉంటరు. వాళ్లెవరెవరో నాకు తెలుసు. ఆ టేబుల్ మీద ఆయన కయ్య కయ్య అర్సుకుంట పెద్ద చాటర్ బాక్స్. ఇప్పుడు కూడా ఇఫ్టం ఉన్నట్టు వాగ్దానాలు చేసిండు.
కోమటిరెడ్డిని సీఎం చేసేదుండె
రేవంత్ రెడ్డిని ఎందుకు ముఖ్యమంత్రి చేసుకున్నారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి జెన్యూన్ పర్సన్.ఉన్నది ఉన్నట్టు మనస్ఫూర్తిగా మాట్లాడుతాడు.. పని అయితే అయితదని చెప్తడు. లేదంటే లేదు అని చెప్తడు. ఎందుకు కాదో చెప్తడు. చెప్పిన మాట ఇంప్లిమెంట్ చేస్తడు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని వ్యక్తిని ముఖ్యమంత్రిని చేసుకునేది ఉండే. రేవంత్ రెడ్డి లాంటోళ్లకు ఓ ఉప ముఖ్యమంత్రి పడేస్తే అయిపోతుండే. ఒక జెన్యూన్ లీడర్‌ను సీఎంగా చేసుకునేది ఉండే. 2029లో కాంగ్రెస్ అధ్వాన్నంగా ఓడిపోతది చరిత్రలో లేనంతగా.. 1985 చాలా అధ్వాన్నంగా ఓడిపోయారు, 1994లో ఇంకా అధ్వాన్నంగా ఓడిపోయారు. 2029లో రేవంత్ నాయకత్వంలో చాలా అధ్వాన్నంగా ఓడిపోతారు. 2034 దాకా ముఖ్యమంత్రిగా ఉంటానని కలలు కంటున్నడు. 2029లో నీ (రేవంత్) లాగులో తొండలు ఎట్ట జొర్రకొడుతారంటే. నువ్వు లాగు విప్పి పారిపోతవు
అక్కడ పైసలు పెట్టిండు.. ఆఖరికి లొట్టపీసైంది
రాహుల్ గాంధీ 2039 దాకా ప్రధాని కాడు అని రేవంత్ రెడ్డే ఒప్పేసుకున్నాడు. 2034 దాకా ఆయనే సీఎంగా ఉండి.. ఆ తర్వాత నేషనల్ పాలిటిక్స్‌లోకి వెళ్లి ఆ తర్వాత రాహుల్ గాంధీని ప్రధాని చేస్తాడట. అంటే ఈయన నేషనల్ పాలిటిక్స్ లోకి పోయే వరకు రాహుల్ గాంధీ ప్రధాని కాడనే అర్థం కదా. ఏం గాంధీలు ఉన్నరాయా మీరు? ఈయననే స్కెచ్ వేసుకుంటుండు. పైసలు బాగా సంపాదించి, తెలంగాణను లూటీ చేద్దామనుంటకున్నడు. ఆ కేరళలో కేసీ వేణుగోపాల్‌ను ముఖ్యమంత్రి చేద్దామని పోయిండు.. అక్కడ వేరే ఆయనను సీఎంగా చేసిండ్రు. కేసీ వేణుగోపాల్ కోసం ఈ పొట్టోడు టింగ్ టింగ్ మని పోయిండు.పైసలు పెట్టిండు. చానెల్ పెట్టిండు. చివరకు లొట్టపీస్ అయింది.
సువేందు అధికారి...అయితడా?
మొన్న ప్రధాని మోదీ గారు మేర్ సే హీ జోడో అన్నారు. ఇద్దరి మధ్య ఏమన్న ఉన్నదో నాకేతై తెల్వదు.. బీజేపీలో నేను చాలా చిన్న కార్యకర్తను. ఏమన్న లింకు ఉందో నాకేతై తెల్వదు. అట్లాంటిది ఏమైనా ఉందా..? సువేందు అధికారి.. అందుకే చెప్పిన కాంగ్రెసోళ్లకు సలహా.. మా నాన్న చాలా సేవ చేశారు పార్టీకి. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, శ్రీధర్ బాబు లాంటోళ్లను జీవితాంతం కాంగ్రెస్‌లో ఉన్నోళ్లను సీఎంగా చేసుకున్నా సరే. రేవంత్ రెడ్డికి ఓ మంత్రి పదవి పడేస్తే అయిపోవు. ఎప్పుడు జారుకుంటడో తెల్వదు.
పత్తాలాటలో వాగినట్టు వాగకు
మూడు బుల్లెట్ ట్రైన్ కారిడార్స్ తెచ్చినట్టు రేవంత్ రెడ్డి చెప్పుకుంటుండు. ఇది పెద్ద జోక్. ఈ ప్రాజెక్టు 2020లో స్టార్ట్ అయింది. 2021లో రిపోర్టు కంప్లీట్ అయింది.ఈన లొట్టపీసు ఏడున్నడు? అప్పుడు దుబ్బాకలో డిపాజిట్ పీకింది.జీహెచ్ఎంసీలో డిపాజిట్ పీకింది.హుజురాబాద్‌లో కూడా డిపాజిట్ పీకడంతో గాయబ్ ఉండే మనిషి. ఈయనట రైల్ కారిడార్ తెచ్చిండట. రైల్ కారిడార్ స్పెల్లింగ్ తెలుసా అని ఆయనను జర్నలిస్టులు అడగాలి. 2021లో అయిపోయింది ప్రణాళిక. ఇప్పుడు వచ్చినాయ్ ఇవన్నీ. పుణె టూ హైదరాబాద్, హైదరాబాద్ టూ బెంగళూరు, హైదరాబాద్ టూ చెన్నై..
కూలగొట్టుడే కానీ..కట్టింది ఒక్కటి లేదు
ఇంకోటి రేవంత్. దీంట్లో అన్నిట్లా చదువు సంధ్య ఉంటది. రీసెర్చ్ ఉంటది. అది తమరికి ఎక్కదు. మూసీ ప్రక్షాళన చేస్తా. కారిడార్ చేస్తా అంటవు. నువ్వు కూలగొట్టుడు ఉన్నది కానీ ఒక్కటి కట్టింది లేదు. కూలగొట్టిన ఇండ్లన్నీ యేడికి షిప్ట్ చేస్తవు.వట్టి మాటలు.నాలుగు రూపాయాలు ఏసుకుపోవుడు. 10 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉండాలి. రెండు సిటీల మధ్య దూరం. 300 నుంచి 700 కిలోమీటర్ల దూరం. సిటీ జీడీపీ. రెండు సిటీల మధ్య ప్రయాణికులు ఏసీ రైలు, విమానాల్లో ప్రయాణ వివరాలు. ఆ కారిడార్లలో 50 శాతం కంటే ఎక్కువగా ఏసీ రైళ్లల్లో ప్రయాణిస్తే. దీని వెనుక ఇదంతా రీసెర్చ్ ఉంటది. ఇది పత్తాలాట కాదు.పత్తలాట ఆడే ప్లేస్ కాదు. నెక్ట్స్ టైమ్ వాగేటప్పుడు పత్తలాట టేబుల్ మీద వాగినట్టు వాగకు.
కుటుంబం తప్ప చిత్తశుద్ధి లేదు
రేవంత్ రెడ్డి... నేను దేశభక్తుడిని.. ప్రధాన మంత్రి గారిని ఇంప్రెస్ చేసుకోవాల్నో.. మా హోం మినిస్టర్ గారిని ఇంప్రెస్ చేసుకోవాల్నో.. అని బయట మాట్లాడుతాడు. కానీ ఈయన ఫస్ట్ పైలా రేవంత్.. బాద్ మే కొండల్.. ఉస్ కే బాద్ మే కృష్ణా.. లాస్ట్ మే తిరుపతి. రేవంత్ రెడ్డి కుటుంబం, కొండల్ రెడ్డి కుటుంబం, కృష్ణారెడ్డి కుటుంబం, తిరుపతి రెడ్డి కుటుంబం మీద తప్ప ఏ కుటుంబం మీద చిత్తశుద్ధి లేదు ఈ తెలంగాణలో రేవంత్ రెడ్డికి. డైలాగులు తప్ప సార్‌వి ఏం ఉండవి. ఇక ఫ్యూచర్ సిటీ అట. డిసెంబర్ 9న ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్ అని చేసిండు. సోనియా గాంధీని పిలిచిండు.. వాళ్లు కూడా నమ్మలేదు.. రాలేదు. ఇక కేసీఆర్ కరీంనగర్‌ను డల్లాస్, వరంగల్‌ను వాషింగ్టన్, హైదరాబాద్‌ను న్యూయార్క్ పాతబస్తీని ఇస్తాంబుల్ చేస్త అంటే ప్రజలందరూ కలిసి ఫామ్ హౌస్‌లో కూర్చోబెట్టారు. ఈయన టోక్యో, న్యూయార్క్, లండన్‌లు కలిపి ఒకటే ఫ్యూచర్ సిటీని చేస్తాడట. ఉన్న పట్టణాలను అప్‌గ్రేడ్ చేస్తామంటేనే కేసీఆర్‌ను నమ్మలేదు. లేని పట్టణం క్రియేట్ చేస్తాడట.. ఫ్యూచర్ సిటీ అట. అందుకే సోనియా గాంధీ రాలేదు. ఫ్యూచర్ సిటీ మీద ఈయన చేసిన రీసెర్చ్ ఏంది..? ప్యూచర్ సిటీ ప్లానింగ్‌కు ఉన్న ఏజెన్సీలు ఏంది..? నీ దగ్గర ఎటువంటి ప్రణాళిక ఉంది..? ఎన్ని సంవత్సరాల్లో కడుతారు..? ఎంత బడ్జెట్..? యేనుంచి తెస్తరు..
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



