Road Accidents | రాష్ట్రంలో 5 శాతం పెరిగిన ప్రమాదాలు.. కొద్దిగా తగ్గిన మరణాలు
Road Accidents | రాష్ట్రంలో గతంతో పోల్చితే రోడ్లు కొంత విశాలంగా మారాయి. దీంతో రహదారులపై వాహనాల వేగమూ (Over Speed) పెరిగింది. స్పీడ్ వేరిగితే వాహనంపై అదుపుకోల్పోవడం పరిపాటే. దీనికి కాస్త నిర్లక్ష్యం, ఏమరపాటు, డ్రైవింగ్ చేసేప్పుడు సెల్ వినియోగం, ఎదుటి వాహనాలను గమనించకపోవడంతో వాహనదారులు ప్రమాదాల (Road Accidents) బారినపడుతున్నారు.
త్రినేత్ర.న్యూస్: రాష్ట్రంలో గతంతో పోల్చితే రోడ్లు కొంత విశాలంగా మారాయి. దీంతో రహదారులపై వాహనాల వేగమూ (Over Speed) పెరిగింది. స్పీడ్ వేరిగితే వాహనంపై అదుపుకోల్పోవడం పరిపాటే. దీనికి కాస్త నిర్లక్ష్యం, ఏమరపాటు, డ్రైవింగ్ చేసేప్పుడు సెల్ వినియోగం, ఎదుటి వాహనాలను గమనించకపోవడంతో వాహనదారులు ప్రమాదాల (Road Accidents) బారినపడుతున్నారు. ఈ క్రమంలో గతేడాది వాహన ప్రమాదాలు గతంతో పోల్చిచేతే 5.6 శాతం అధికమయ్యాయి. అయితే మరణాల సంఖ్య మాత్రం కొద్దిగా తగ్గడం గమనార్హం. హైదరాబాద్‌లోని (Hyderabad) అమీర్‌పేట, ఖైరతాబాద్, హిమాయత్‌నగర్ వంటి అత్యంత రద్దీ ఉండే ప్రాంతాల్లో ప్రమాదాలు జరిగినప్పటకీ.. ప్రాణాపాయం జరిగింది మాత్రం కొన్ని ఘటనల్లోనే. ట్రాఫిక్ సిగ్నళ్లతో స్పీడ్ తగ్గడం, విపరీతమైన వాహనాల రద్దీ వల్ల సగటు వేగం 23 కిలోమీటర్లు దాటకపోవడం, వాహనదారులు హెల్మెట్, సీట్‌బెల్ట్ ధరించడం వంటి నిబంధనలు పాటించడం వంటి కారణాల వల్ల ప్రమాద తీవ్రత తగ్గింది.
అయితే సైబరాబాద్(Cyberabad), రాచకొండ (Rachakonda) పోలీస్ కమిషనరేట్ల పరిధిలో ఉండే ప్రాంతాల్లో ప్రమాదాలు, మరణాల సంఖ్య అధికంగా నమోదవుతున్నది. మితిమీరిన వేగమే దీనికి కారణం. నగర శివారు ప్రాంతాల్లో రోడ్లు విశాలంగా ఉండటం, ట్రాఫిక్ రద్దీ అంతగా ఉండకపోవడంతో వాహనదారులు ఓవర్ స్పీడ్‌లో వెళ్లి ప్రమాదాల బారినపడుతున్నారు. ఇక వరంగల్ (Warangal), సంగారెడ్డి (Sangareddy) కమిషనరేట్‌ల పరిధిలో ప్రమాదాల సంఖ్య తక్కువైనా, మరణాలు అధికంగా ఉంటున్నాయి. దీనికి అతివేగమే కారణం.
సగటున 74 ప్రమాదాలు
రాష్ట్రంలో రోజుకు సగటున 74 ప్రమాదాలు, 20 మరణాలు చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో గణాంకాల ప్రకారం గత ఏడాదితో పోలిస్తే 5 శాతం ప్రమాదాలు పెరిగినా.. అంతే స్థాయిలో మరణాలు కూడా తగ్గాయి. హైదరాబాద్ కమిషనరేట్ ప్రమాదాల్లో మూడో స్థానం, మరణాల్లో ఐదో స్థానంలో ఉంది. రాష్ట్రంలోనే అత్యధిక ప్రమాదాలు, మరణాలు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో నమోదయ్యాయి. హైదరాబాద్‌తో పోల్చుకుంటే వరంగల్ కమిషనరేట్ పరిధిలో సగానికంటే తక్కువ ప్రమాదాలు జరిగినా.. మరణాలు మాత్రం 50 శాతం అధికంగా నమోదయ్యాయి. మొత్తంగా రాష్ట్రంలో అంతకుముందు ఏడాదితో పోల్చుకుంటే 2025లో 1,366 ప్రమాద ఘటనలు పెరగగా.. మరణాలు మాత్రం 404 తగ్గడం విశేషం.
హైదరాబాద్‌లో వాహనాల సరాసరి వేగం ఇది..
రాష్ట్ర జనాభాలో దాదాపు సగం మంది హైదరాబాద్‌లోని ఉంటున్నారు. ట్రాఫిక్ రద్దీ కూడా అదేవిధంగా ఉంటుంది. నగర రోడ్లపై రోజురోజుకు వాహనాల సంఖ్య పెరుగుతున్నప్పటికీ.. ట్రాఫిక్ చిక్కులు 2024తో పోలిస్తే 2025లో కొంత మెరుగుపడ్డాయి. కంజెక్షన్ 1.6 పర్సెంటేజ్ పాయింట్స్ తగ్గింది. అలాగే సరాసరి వేగం సాధారణ సమయంలో గంటకు 18.4 కి.మీ, రద్దీ వేళల్లో 16.1గా ఉన్నట్లు అంతర్జాతీయ సంస్థ టామ్ టామ్ గణాంకాలు వెల్లడించాయి. స్విట్జర్లాండ్‌కు చెందిన ఈ సంస్థ స్లో మూవింగ్ ట్రాఫిక్ ఇండెక్స్‌ను విడుదల చేసింది. 2024లో అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్ 18వ ర్యాంక్‌లో ఉండగా.. గతేడాది 47వ స్థానానికి వెళ్లింది. ఎంత తక్కువ ర్యాంక్‌లో ఉంటే అంత ఎక్కువ ట్రాఫిక్ చిక్కులు ఉన్నట్టన్నమాట. నగర రోడ్లపై ఓ వాహనం 10 కిలోమీటర్లు వెళ్లాలంటే సరాసరిన 32.37 నిమిషాలు పడుతున్నదని తెలిపింది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్





