Chanagani Dayakar | రేవంత్ రెండోసారి ముఖ్యమంత్రి అయితరు
Chanagani Dayakar | తెలంగాణ ప్రజలు పెయిడ్, పిచ్చి సర్వేలను నమ్మరని.. ప్రజల దీవెనలతోనే రేవంత్‌రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రి అవుతారని టీపీసీసీ జనరల్ సెక్రటరీ చనగాని దయాకర్ వ్యాఖ్యానించారు. ఒకవేళ సర్వేలు బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉన్నప్పడు కేటీఆర్ పాదయాత్ర ఎందుకు అని ప్రశ్నించారు.
- సర్వేలు బీఆర్ఎస్‌కు అనుకూలంగా ఉన్నప్పుడు కేటీఆర్ పాదయాత్ర ఎందుకు?
- కేసీఆర్ బస్సు యాత్ర ఎందుకు?
- 2028లో వారి చెంప చెల్లుమనేలా ప్రజలు తీర్పు ఇస్తరు
- టీపీసీసీ జనరల్ సెక్రటరీ చనగాని దయాకర్ వ్యాఖ్యలు
Chanagani Dayakar | త్రినేత్ర.న్యూస్: తెలంగాణ ప్రజలు పెయిడ్, పిచ్చి సర్వేలను నమ్మరని.. ప్రజల దీవెనలతోనే రేవంత్‌రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రి అవుతారని టీపీసీసీ జనరల్ సెక్రటరీ చనగాని దయాకర్ వ్యాఖ్యానించారు. కేటీఆర్, హరీశ్‌రావు రాజకీయ సన్యాసానికి సిద్ధమా అని సవాల్ విసిరారు. ఒకవేళ సర్వేలు బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉన్నప్పడు కేటీఆర్ పాదయాత్ర ఎందుకు? కేసీఆర్ బస్ యాత్ర ఎందుకు అని ప్రశ్నించారు. ఈ మేరకు శనివారం ఆయన ఓ వీడియో సందేశంలో మాట్లాడారు.
అధికారంలోకి రావడానికి బీఆర్ఎస్ కుట్రలు చేస్తోంది..
సర్వేలను తెలంగాణ ప్రజలు నమ్మరు. బోగస్ సర్వేల వెనుక కేటీఆర్ హస్తం ఉంది. రేవంత్ రెడ్డి రెండో సారి ముఖ్యమంత్రి అవుతారు. కేటీఆర్, హరీష్ రావు రాజకీయ సన్యాసానికి సిద్ధమా? తెలంగాణ ప్రజలు పిచ్చి సర్వేలను, పెయిడ్ సర్వేలను తిప్పి కొట్టారు. ప్రజా పాలనతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యం అవుతుంది. పదేళ్లు దోచుకున్న పైసలతోనే తెలంగాణ రాష్ట్రంలో మరొకసారి అధికారంలోకి రావాలని బీఆర్ఎస్ కుట్రపూరిత ఆలోచనలు చేస్తుంది అని చనగాని దయాకర్ ఆరోపించారు.
గుర్తుంచుకోండి..
బీఆర్ఎస్ నాయకుల ప్రమేయంతోనే సీ ప్యాక్ సర్వే అనేది వచ్చింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కేకే సర్వే ఏమైంది.. సర్వేలకు అందని విధంగా కాంగ్రెస్‌కు 50వేల పైగా మెజారిటీ వచ్చింది. సర్వేల ద్వారా కాంగ్రెస్ విజయాన్ని ఆపలేరు. ఆరు గ్యారంటీలతో ముందుకు వెళ్తున్నం. కాంగ్రెస్ విజయాన్ని ఏ శక్తి ఆపలేదు. ప్రజలు తెలివైనవాళ్లు. 2028లో కూడా కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావుకు చెంప చెల్లుమనేలా ప్రజలు తీర్పు ఇస్తారు. ఇది వారు గుర్తుంచుకోవాలి అని చనగాని పేర్కొన్నారు.
తాజావార్తలు
- ●Peto's Paradox | ఏనుగులు, తిమింగలాలకు క్యాన్సర్ ఎందుకు రాదంటే.. సైంటిస్టులనే ఆశ్చర్యపరుస్తున్న జన్యు రహస్యాలివే!
- ●Maheshkumar Goud | మీనాక్షిని బలి చేశారు
- ●Rajnath Singh | యుద్ధంలో సాంకేతిక వినియోగం చాలా పెరిగింది.. ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకైనా సిద్ధంగా ఉండాలి : రాజ్‌నాథ్ సింగ్
- ●Jeevan Reddy | రేవంత్ కుట్ర ఫలితమే.. తెలంగాణలో కరువు : జీవన్ రెడ్డి
- ●NDDB | ఎన్డీడీబీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌తో చంద్రశేఖర్‌రెడ్డి, అమిత్‌రెడ్డి భేటీ
- ●Nayanthara | పూజా హెగ్డే హారర్ సినిమాలో గెస్ట్‌గా లేడీ సూపర్ స్టార్

Peto's Paradox | ఏనుగులు, తిమింగలాలకు క్యాన్సర్ ఎందుకు రాదంటే.. సైంటిస్టులనే ఆశ్చర్యపరుస్తున్న జన్యు రహస్యాలివే!

Maheshkumar Goud | మీనాక్షిని బలి చేశారు

Rajnath Singh | యుద్ధంలో సాంకేతిక వినియోగం చాలా పెరిగింది.. ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకైనా సిద్ధంగా ఉండాలి : రాజ్‌నాథ్ సింగ్

Jeevan Reddy | రేవంత్ కుట్ర ఫలితమే.. తెలంగాణలో కరువు : జీవన్ రెడ్డి




