త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Heavy Rains | బీ అల‌ర్ట్.. మ‌రికాసేప‌ట్లో హైద‌రాబాద్‌లో భారీ వ‌ర్షం..!

Heavy Rains | రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్( Hyderabad ) న‌గ‌రాన్ని మ‌రోసారి భారీ వ‌ర్షం( Heavy Rains ) ముంచెత్త‌నుంది. ఒక‌ట్రెండు గంట‌ల్లో న‌గ‌ర వ్యాప్తంగా భారీ వ‌ర్షం కురిసే అవ‌కాశం ఉంది.

S

Telangana | Published On Jun 13, 2026, 3.32 pm IST

Heavy Rains | బీ అల‌ర్ట్.. మ‌రికాసేప‌ట్లో హైద‌రాబాద్‌లో భారీ వ‌ర్షం..!
Advertisement

Heavy Rains | త్రినేత్ర‌.న్యూస్ : రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్( Hyderabad ) న‌గ‌రాన్ని మ‌రోసారి భారీ వ‌ర్షం( Heavy Rains ) ముంచెత్త‌నుంది. ఒక‌ట్రెండు గంట‌ల్లో న‌గ‌ర వ్యాప్తంగా భారీ వ‌ర్షం కురిసే అవ‌కాశం ఉంది. న‌గ‌ర శివారు ప్రాంతాలైన మొయినాబాద్, శంక‌ర్‌ప‌ల్లి, మోకిల‌, కొల్లూరు, తెల్లాపూర్, నాగుల‌ప‌ల్లి, న‌ల్ల‌గండ్ల‌, ప‌టాన్‌చెరు, బీహెచ్ఈఎల్‌, ఆర్సీపురం, అమీన్‌పూర్, కోకాపేట్‌, మ‌ణికొండ‌, హిమాయ‌త్‌సాగ‌ర్ ప్రాంతాల్లో భారీ వ‌ర్షం కురుస్తోంది. ఈ వ‌ర్షాలు న‌గ‌రాన్ని కూడా మ‌రికాసేప‌ట్లో ముంచెత్త‌నున్నాయి.

హైద‌రాబాద్ న‌గ‌ర వ్యాప్తంగా వాతావ‌ర‌ణం చ‌ల్ల‌బ‌డింది. ద‌ట్ట‌మైన మేఘాలు క‌మ్ముకున్నాయి. నిన్న‌, మొన్న‌టి మాదిరిగానే వాన దంచికొట్ట‌నుంది. బ‌ల‌మైన ఈదురుగాలులు కూడా వీచే అవ‌కాశం ఉంది. ఈ నేప‌థ్యంలో న‌గ‌ర ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని అధికారులు సూచిస్తున్నారు. భారీ వృక్షాల కింద‌, క‌రెంట్ స్తంభాల‌కు స‌మీపంలో ఉండొద్ద‌ని హెచ్చ‌రిస్తున్నారు.

Advertisement
Advertisement