CM Revanth Reddy | ఆ రాజకీయ కారణం ఏంటో మోదీయే చెప్పాలి : రేవంత్‌రెడ్డి
CM Revanth Reddy | తెలంగాణ బీజేపీ నేతల తీరుపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. యూఎస్ పర్యటన విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారన్నారు. అంబేద్కర్ సచివాలయంలో సోమవారం ముఖ్యమంత్రి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్రం, బీజేపీ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
CM Revanth Reddy | తెలంగాణ బీజేపీ నేతల తీరుపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. యూఎస్ పర్యటన విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారన్నారు. అంబేద్కర్ సచివాలయంలో సోమవారం ముఖ్యమంత్రి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్రం, బీజేపీ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైజింగ్ 2047 విధానాన్ని తీసుకొని వికసిత్ భారత్ 2047లో భాగంగా 100వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకునే నాటికి దేశ ఆర్థిక వ్యవస్థ 30 ట్రిలియన్ డాలర్ల ఎకానమీకి మార్చాలని కేంద్రం ఏ లక్ష్యంతో పని చేస్తుందో. రాష్ట్రాల కలయికనే కేంద్ర ప్రభుత్వం, భారతదేశ సార్వభౌమాధికారానికి ప్రజాస్వామ్యం ఇచ్చిన స్ఫూర్తి. విదేశీ పర్యటనల ద్వారా, ముఖ్యంగా తెలంగాణ రైజింగ్‌కు సంబంధించి, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలి. విద్య, క్రీడలు, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా తెలంగాణ రాష్ట్ర పురోభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలన్న లక్ష్యంతో ఒక ప్రణాళికబద్ధంగా కార్యాచరణ తీసుకొని ముందుకెళ్తున్నాం' అన్నారు సీఎం రేవంత్.
వ్యక్తిగత ఆరోపణలు చేశారు..
'ఇందులో భాగంగానే విదేశీ పర్యటన తీసుకొని విదేశాంగ మంత్రిత్వశాఖను ముఖ్యమంత్రి కార్యాలయం రాష్ట్ర ప్రభుత్వం సంప్రదించింది. గతంలోనూ ఇదే విధంగా జరిగింది. ఇప్పుడూ అదే ప్రయత్నం చేశాం. దురదృష్టవశాత్తు కేంద్ర ప్రభుత్వం ఇంగ్లాండ్‌కు అనుమతిచ్చి.. అమెరికా పర్యటనను తిరస్కరించింది. కేంద్రం వైఖరిని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పార్టీ శ్రేణులు.. ఈ దేశంలో విద్య, క్రీడలు, పెట్టుబడుల విధానాలను ప్రోత్సహించడం ద్వారా యువతకు అత్యంత మేలు జరుగుతుందని భావించిన వారు కేంద్ర ప్రభుత్వ వైఖరిని తప్పుపట్టడం జరిగింది. ఈ సందర్భంగా విదేశాంగశాఖ నా పర్యటనను తిరస్కరించడమే కాకుండా కేంద్రంలో అధికారంలో ఉన్న రాజకీయ పార్టీకి సంబంధించి నాయకులు కూడా నా పర్యటనకు సంబంధించి తప్పుదోవ పట్టించే విధంగా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వ్యక్తిగతంగా ఆరోపణలు చేసేవిధంగా భారతీయ జనతా పార్టీ నేతలు మాట్లాడారు. ఆ పార్టీ నాయకుల గురించి నేను మాట్లాడదలచుకోలేదు. ఎందుకంటే వారికి ఆ స్థాయి లేదు. బీజేపీ నేతలు విచక్షణ కోల్పోయి ప్రభుత్వంపై, అధికారిక పర్యటనపై అవాస్తవాలను చెప్పడమే కాకుండా ఆరోపణలు చేసి తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు' అని సీఎం మండిపడ్డారు.
అప్లికేషన్‌లో వివరాలన్నీ ఉన్నయ్..
'బీజేపీ నేతల విషయంలో స్పందించదలచుకోలేదు. ఇది రెండు ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులకు బంధించిన అంశం. రాజకీయ అంశాల జోలికి వెళ్లకుండా.. ప్రభుత్వాలు నిర్వహించాల్సిన బాధ్యతలను కేంద్రానికి గుర్తు చేయదలచుకున్న. మేం అప్లికేషన్ పెట్టినప్పుడు స్పష్టంగా పేర్కొన్నాం. ఈ రోజు వివరాలు ఇవ్వలేదు.. అసంపూర్ణ వివరాలు ఉన్నయ్.. సీఎం పర్యటనలో దాపరికం ఉందనే రకంగా మాట్లాడడం జరిగింది. విదేశాంగశాఖకు మేం ఇచ్చిన దరఖాస్తులో వివరాలు అన్నింటిని పేర్కొన్నాం. ఇందులో స్పష్టంగా విద్య, క్రీడలు, పెట్టుబడులకు సంబంధించిన పర్పస్ ఆఫ్ విజిట్ గురించి కేంద్రానికి స్పష్టంగా దరఖాస్తు చేయడం జరిగింది. తెలంగాణ రైజింగ్ 2047 ప్రణాళికతో ముందుకెళ్తున్నామని కేంద్రానికి చెప్పాం. విదేశాంగ శాఖ రాజకీయపరమైన నిర్ణయాలతోనే తిరస్కరిస్తున్నామని చెప్పారు.
గుజరాత్ సీఎంకు అనుమతిస్తరు..
'రాజకీయ కారణం ఏంటో ప్రధాని మోదీ చెప్పాలి. మోదీ ఎన్నో దేశాల పర్యటనకు వెళ్లారు. గుజరాత్ నుంచి భూపేంద్ర పటేల్ ఆగస్టు 17 నుంచి 24 వరకు ఈ నెలలో యూఎస్, కెనడలో విదేశీ పర్యటనకు వెళ్లారు. వైబ్రెంట్ గుజరాత్ పాలసీ డాక్యుమెంట్‌ను ప్రమోట్, రోడ్‌షోలు చేసేందుకు గుజరాత్ ముఖ్యమంత్రికి మీరు అనుమతిచ్చారు. నరేంద్ర మోదీ స్వరాష్ట్రమైన గుజరాత్ ముఖ్యమంత్రికి 20247 పెట్టుబడులు ఆకర్షించేందుకు అనుమతి ఇస్తారు. కెనడా, అమెరికా దేశాల్లో పర్యటిస్తడు.. పెట్టుబడులు పెట్టేవారితో కలుస్తడు. గుజరాత్‌లో పెట్టుబడులు పెట్టమని ఆహ్వానిస్తడు. అదే తెలంగాణలో తెలంగాణ రైజింగ్ 2027 పాలసీలో భాగంగా విద్య, క్రీడలు, పెట్టుబడుల కోసం తెలంగాణ ముఖ్యమంత్రి పర్యటన చేస్తానంటే అమెరికా పర్యటనను తిరస్కరిస్తరు. నేను సూటిగా ఒక ప్రశ్న కేంద్ర ప్రభుత్వాన్ని అడుగదలచుకున్నాను. విషయం లేదు.. విషయాలు అందించలేదంటే మరి ఎందుకు ఇంగ్లండ్‌కు అనుమతిచ్చారు? అమెరికా, ఇంగ్లండ్ రెండింటికీ ఒకే విధానం, అంశాలను తీసుకొని పర్యటనకు సిద్ధమయ్యాం' అని తెలిపారు సీఎం.
తెలంగాణకు మంచి యూనివర్సిటీలు తేవాలన్నది లక్ష్యం..
'ఇంగ్లండ్‌లో ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ వెళ్లడం జరిగింది. యూనివర్సిటీ హైదరాబాద్‌కు బృందాన్ని పంపి.. పరిస్థితులను పరిశీలించేందుకు హామీ ఇచ్చారు. కేంబ్రిడ్జి యూనివర్సిటీకి వెళ్లాను. ఎంసీహెచ్ఆర్‌డీలో షార్ట్‌టర్మ్ కార్యక్రమాలు నిర్వహించే విషయంలో పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. క్యాంపస్‌ను పెట్టేందుకు కూడా పరిశీలస్తామన్నారు. హైదరాబాద్‌లో యూనివర్సిటీ ఆఫ్ లండన్ క్యాంపస్ ఏర్పాటుకు అంగీకరించారు. సంబంధిత అధికారులను కలిశారు. ఎకనామిక్స్ వాళ్లతో మాట్లాడితే హైదరాబాద్‌కు టీమ్‌ని పంపిస్తామన్నారు. లండన్ బిజినెస్ స్కూల్‌తో మాట్లాడితే షార్ట్‌టర్మ్ కోర్సులు ప్రారంభించేందుకు హామీ ఇచ్చారు. అలాగే, అమెరికాలో హార్వర్డ్ యూనివర్సిటీ క్యాంపస్ బోస్టన్, ఎంఐటీ క్యాంపస్, వర్జినీయా టెక్ యూనివర్సిటీని కలిసి ఆఫ్‌ష్యూర్ క్యాంపస్, షార్ట్‌టర్మ్ కోర్సులను ప్రారంభించేందుకు ఒప్పందం చేసుకుంటున్నం. ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రిగా మంచి యూనివర్సిటీలను తెలంగాణకు తీసుకురావలనేది మా ప్రభుత్వం లక్ష్యం' అని రేవంత్‌రెడ్డి తెలిపారు.
వేలల్లో చదువుకుంటరు..
'ఒకప్పుడు గాంధీ, అంబేద్కర్ ఇంగ్లండ్‌లో చదువుకున్నారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో చదువుకోవడం అంబేద్కర్ ఈ దేశానికే దార్శనికుడిగా మారిండు. ఈ దేశానికి దాస్య శృంఖలాల నుంచి మహాత్ము విముక్తి కల్పించగలిగిండు. ఒక మంచి యూనివర్సిటీ, ప్రపంచస్థాయి అవగాహన, పరిజ్ఞానం కలిగిన విద్యాలయాల్లో చదువుకుంటే ఆ చదువు, జ్ఞానం.. మన ప్రాంతం, రాష్ట్రం, దేశాన్ని అభివృద్ధి పథం వైపు నడిపించేందుకు ఉపయోగపడుతుందని భావించి.. పేదలు, మధ్యతరగతి, దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు, ఇతర ఆర్థికంగా వెనుకబడిన సమాజం విదేశాల్లో చదువుకోలంటే కోట్ల రూపాయల ఖర్చవుతుంది కాబట్టి కొద్ది మంది మాత్రమే అక్కడికి వెళ్లి చదువుకునే పరిస్థితులు, ఆర్థిక వెసులుబాటు ఉంటుంది. మనం ఇవాళ ఫారిన్ స్కాలర్‌షిప్‌లు ఇచ్చి ప్రోత్సహించినా అది సరిపోవడం లేదు కాబట్టి ఆ యూనివర్సిటీలను, క్రీడా మైదానాలను ఇక్కడికి తీసుకురావాలని, ఇక్కడికి వస్తే పదుల్లో విదేశాలకు వెళ్లేవారు.. వేలల్లో మన దగ్గర చదువుకునేందుకు అవకాశం ఉంటుంది. మంచి క్రీడాకారులను తయారు చేయడానికి అవకాశం ఉంటుంది' అని సీఎం రేవంత్‌రెడ్డి వివరించారు.
సంబంధిత వార్తలు

DK Aruna | 15,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ఒకే విడతలో విడుదల చేయాలి: డీకే అరుణ
ఆగస్టు 24, 2026

Payal Shankar | విద్యార్థుల తల్లిదండ్రుల ఆవేదన రేవంత్‌కు కనిపిస్తలేదా?: ఎమ్మెల్యే పాయల్ శంకర్
ఆగస్టు 24, 2026

Police Constables Wedding | ఔను వాళ్లిద్దరు ఇష్టపడ్డారు..! చర్చనీయాంశమైన ఇద్దరు మహిళా కానిస్టేబుళ్ల పెళ్లి..!
ఆగస్టు 24, 2026
తాజావార్తలు
- ●Aditi Rao Hydari | ఓటీటీలోకి అదితిరావ్ హైదరీ బోల్డ్ మూవీ - నలుగురు హీరోయిన్లు - నాలుగు కథలు
- ●Ethanol | చక్కెర ధర పెరుగుదలను ఇథనాల్‌తో ముడిపెట్టొద్దు: నిపుణులు
- ●Gyanesh Kumar | భారత EVMలకు ఇంటర్నెట్, బ్లూటూత్ కనెక్టివిటీ ఉండదు : సీఈసీ జ్ఞానేశ్ కుమార్
- ●Bhu Bharati Portal | భూభారతిలో రిజిస్ట్రేషన్ కాని భూములివే.. 22A జాబితా నుంచి మీ ల్యాండ్ తొలగించుకోండిలా!
- ●స్కిల్స్ వర్సిటీ వర్సెస్ పాలిటెక్నిక్: 'జీవో 97'తో విద్యార్థులకు లాభమా? నష్టమా?
- ●DK Aruna | 15,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ఒకే విడతలో విడుదల చేయాలి: డీకే అరుణ

Aditi Rao Hydari | ఓటీటీలోకి అదితిరావ్ హైదరీ బోల్డ్ మూవీ - నలుగురు హీరోయిన్లు - నాలుగు కథలు

Ethanol | చక్కెర ధర పెరుగుదలను ఇథనాల్‌తో ముడిపెట్టొద్దు: నిపుణులు

Gyanesh Kumar | భారత EVMలకు ఇంటర్నెట్, బ్లూటూత్ కనెక్టివిటీ ఉండదు : సీఈసీ జ్ఞానేశ్ కుమార్

Bhu Bharati Portal | భూభారతిలో రిజిస్ట్రేషన్ కాని భూములివే.. 22A జాబితా నుంచి మీ ల్యాండ్ తొలగించుకోండిలా!



