త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Revanth Reddy | యాద‌గిరిగుట్ట‌లో వేద పాఠ‌శాల‌.. సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాప‌న‌

Revanth Reddy | యాద‌గిరిగుట్ట (Yadagirigutta) టెపుల్ సిటీలో ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) శంకుస్థాప‌న చేశారు. వేద మంత్రోచ్ఛారణల నడుమ కంచికామకోటి పీఠాధిపతి జగద్గురు శంకర విజయేంద్ర సరస్వతి స్వామితో కలిసి సీఎం రేవంత్ వేద పాఠశాల (Veda Patashala) నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

G

Telangana | Published On May 23, 2026, 10.15 am IST

Revanth Reddy | యాద‌గిరిగుట్ట‌లో వేద పాఠ‌శాల‌.. సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాప‌న‌
Advertisement

Revanth Reddy | త్రినేత్ర‌.న్యూస్‌: యాద‌గిరిగుట్ట (Yadagirigutta) టెపుల్ సిటీలో ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) శంకుస్థాప‌న చేశారు. వేద మంత్రోచ్ఛారణల నడుమ కంచికామకోటి పీఠాధిపతి జగద్గురు శంకర విజయేంద్ర సరస్వతి స్వామితో కలిసి సీఎం రేవంత్ వేద పాఠశాల (Veda Patashala) నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆలయ కొండపైన కల్యాణ మండపం, ప్రధానాలయ వాయువ్య దిశలో మెట్లమార్గం నిర్మాణాలు, కొండ కింద నుంచి కొండపైకి వెళ్లే మెట్ల మార్గం పైకప్పు నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేయనున్నారు. మొత్తం రూ.99.55 కోట్లతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శ్రీకారం చుట్టనున్నారు. అంత‌కుముందు మంత్రులు కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి, కొండా సురేఖ‌, అడ్లూరి ల‌క్ష్మ‌ణ్‌, ప్ర‌భుత్వ విప్ బీర్ల ఐల‌య్య‌తో క‌లిసి యాదగిరిగుట్ట క్షేత్రాన్ని సందర్శించారు. శ్రీ ల‌క్ష్మీన‌ర‌సింహ స్వామివారికి ప్ర‌త్యేక పూజ‌లు చేశారు.

శంకుస్థాపనల వివరాలు..

  • రూ.43.80 కోట్లతో వేద పాఠశాలకు శంకుస్థాపన
  • రూ.9.87 కోట్లతో కొండపై స్వామివారి నిత్య కల్యాణ మండపం నిర్మాణానికి శంకుస్థాపన
  • రూ.1.41 కోట్లతో వైకుంఠ ద్వారం నుంచి కొండపైకి వెళ్లే మెట్ల మార్గానికి పై కప్పు నిర్మాణానికి శంకుస్థాపన
  • రూ.1.35 కోట్లతో రథశాల వైపు మాడవీధులకు మెట్ల నిర్మాణానికి శంకుస్థాపన
  • రూ.43.12 కోట్లతో డార్మిటరీ హాల్స్, దీక్షాపరుల సదనం నిర్మాణానికి శంకుస్థాపన.

 

Advertisement
Advertisement