త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Dasoju Sravan Kumar | రేవంత్‌రెడ్డి ఓ తుగ్ల‌క్‌: దాసోజు శ్ర‌వ‌ణ్‌

Dasoju Sravan Kumar | తెలంగాణ (Telangana) రాష్ట్ర ముఖ్య‌మంత్రి (CM) రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ఓ తుగ్ల‌క్‌గా మారి నిర్ణ‌యాలు తీసుకుంటున్నార‌ని బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్సీ (MLC) దాసోజు శ్ర‌వ‌ణ్ కుమార్ (Dasoju Sravan Kumar) మండిప‌డ్డారు.

A

Telangana | Published On Jan 13, 2026, 2.08 pm IST

Dasoju Sravan Kumar | రేవంత్‌రెడ్డి ఓ తుగ్ల‌క్‌: దాసోజు శ్ర‌వ‌ణ్‌
Advertisement

రిటైర్డ్ ఉద్యోగుల‌కు ఎందుకు ఆటో క్రెడిట్ చేయ‌ట్లేదు
దోచుకోవ‌డం కోస‌మే రేవంత్ సీఎం అయ్యారా?
చ‌లాన్ల కంటే ముందు రోడ్ల‌పై గుంత‌లు పూడ్చాలి
చ‌ట్టంపై అవ‌గాహ‌న లేకుండా సీఎం వ్యాఖ్య‌లు
విలేక‌రుల స‌మావేశంలో మండిప‌డిన ఎమ్మెల్సీ

Dasoju Sravan Kumar | తెలంగాణ (Telangana) రాష్ట్ర ముఖ్య‌మంత్రి (CM) రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ఓ తుగ్ల‌క్‌గా మారి నిర్ణ‌యాలు తీసుకుంటున్నార‌ని బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్సీ (MLC) దాసోజు శ్ర‌వ‌ణ్ కుమార్ (Dasoju Sravan Kumar) మండిప‌డ్డారు. దోచుకోవ‌డం కోస‌మే రేవంత్ సీఎం అయ్యారా అని ప్ర‌శ్నించారు. క‌నీసం చ‌ట్టంపై అవ‌గాహ‌న‌ లేకుండానే రేవంత్ నోటికొచ్చిన‌ట్లు మాట్లాడుతున్నార‌ని ధ్వ‌జ‌మెత్తారు. తెలంగాణ భ‌వ‌న్ (Telangana Bhavan) లో నిర్వ‌హించిన విలేక‌రుల స‌మావేశంలో శ్ర‌వ‌ణ్ మాట్లాడుతూ ట్రాఫిక్ చ‌లాన్లు నేరుగా పోలీసుల అకౌంట్లోకి వెళ్లే విధంగా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సీఎం చేసిన వ్యాఖ్య‌ల‌పై తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. రేవంత్‌కు క‌నీసం రాజ్యాంగ స్ఫూర్తి లేద‌ని, అవ‌గాహ‌న లేద‌ని ఆరోపించారు. రేవంత్‌రెడ్డిది అజ్ఞాన‌మా, అహంకార‌మా అనేది అర్థం కావ‌డం లేద‌న్నారు. రేవంత్ విచ్చ‌ల‌విడి అవినీతి, దోపిడీకి పాల్ప‌డుతున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు. నిబంధ‌న‌ల‌ను అడుగ‌డుగునా తుంగలో తొక్కుతూ గ్రూప్ 1 ప‌రీక్ష‌లు నిర్వ‌హించి, విద్యార్థులు, నిరుద్యోగుల జీవితాల‌ను బ‌లి ఇచ్చార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

ట్రాఫిక్ చ‌లాన్ల‌పై రేవంత్ చేసిన వ్యాఖ్య‌ల‌పై ఆయ‌న‌కు అయిదు పేజీల లేఖ‌ను రాసిన‌ట్లు దాసోజు తెలిపారు. చ‌లాన్లు వేసే ముందు రోడ్ల‌పై ఉన్న గుంత‌ల‌ను పూడ్చాల‌ని హిత‌వు ప‌లికారు. రేవంత్ మూర్ఖ‌త్వంగా, చ‌ట్టంపై అవ‌గాహ‌న లేకుండా మాట్లాడుతున్నార‌ని ధ్వ‌జ‌మెత్తారు. సీఎం నోటి నుంచి ఒక్క ప‌దం బ‌య‌ట‌కు వ‌చ్చినా, దానికి చ‌ట్ట‌బ‌ద్ధ‌త ఉంటుంద‌ని చెప్పారు. లేనిప‌క్షంలో ప్ర‌భుత్వం జోక‌ర్‌గా మిగిలిపోతుంద‌న్నారు. రేవంత్ ఏమైనా దేశానికి రాజా? ఇష్టం వ‌చ్చిన‌ట్లు మాట్లాడితే కుదురుతుందా? అని మండిప‌డ్డారు. అస‌లు ముఖ్య‌మంత్రి ఎవ‌రితోనైనా మాట్లాడి నిర్ణ‌యాలు తీసుకుంటున్నారా లేక నోటికి ఏది వ‌స్తే అది మాట్లాడుతున్నారా అని ప్ర‌శ్నించారు. ప్ర‌జ‌ల బ్యాంకు ఖాతాల‌ను దోచుకుతినాల‌ని రేవంత్ చూస్తున్నార‌ని ఆరోపించారు.

ప్ర‌భుత్వ సొమ్మును పేద‌ల‌కు ఇవ్వాల‌ని రాహుల్‌గాంధీ అంటుంటే రేవంత్‌రెడ్డి పేద‌ల డ‌బ్బు దోచుకోవాల‌ని చూస్తున్నార‌ని విమ‌ర్శించారు. రేవంత్ మాట‌లు కాంగ్రెస్ పార్టీ విధాన‌మా స్ప‌ష్టం చేయాల‌ని డిమాండ్ చేశారు. ప్ర‌జ‌ల హ‌క్కుల‌ను ప్ర‌భుత్వం హ‌రిస్తోందని, వ్య‌క్తిగ‌త‌, ఆస్తి హ‌క్కుల ఉల్లంఘ‌న‌కు పాల్ప‌డుతున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇష్టం వ‌చ్చిన‌ట్లు అకౌంట్ల నుంచి డ‌బ్బులు వ‌సూలు చేసే అధికారం రేవంత్‌రెడ్డికి లేద‌ని స్ప‌ష్టం చేశారు. అడ్వ‌కేట్ జ‌న‌ర‌ల్‌తో ఈ విష‌యం చ‌ర్చించారా అని ప్ర‌శ్నించారు. పించ‌న్లు, రిటైర్డ్ ఉద్యోగుల‌కు రేవంత్ స‌ర్కార్ ఎందుకు ఆటో క్రెడిట్ చేయ‌డం లేద‌ని ఎద్దేవా చేశారు.

రాష్ట్రంలో అనుముల రాజ్యాంగం న‌డుస్తోంద‌ని మండిప‌డ్డారు. ట్రాఫిక్ చ‌లాన్ల‌తో మొద‌లుపెట్టి న‌ల్లా బిల్లులు, ఇంటి ప‌న్ను బిల్లులు మొత్తం ఆటో డెబిట్ చేస్తారేమో అని అనుమానం వ్య‌క్తం చేశారు. అన్నింటికి చ‌లాన్లు వేస్తున్న‌ప్పుడు నోరు జారితే సైతం చ‌లాన్లు ఉండాల‌ని అన్నారు. రేవంత్‌రెడ్డి తిట్టిన ప్ర‌తిసారి ఎవ‌రు ఆటో డెబిట్ చేస్తార‌ని ప్ర‌శ్నించారు. రేవంత్ వాడుతున్న కార్ల‌పై మూడు చ‌లాన్లు ఉన్నాయ‌ని చెప్పారు. న‌గ‌రంలో ట్రాఫిక్ నియంత్ర‌ణ‌కు అంద‌రితో చ‌ర్చించి నిర్ణ‌యాలు తీసుకోవాల‌ని హిత‌వు ప‌లికారు. ధ‌ర్మ‌క‌ర్త‌గా ఉండాల్సిన సీఎం రాక్ష‌సుడిగా ప్ర‌జ‌ల‌ను పీడిస్తున్నాడ‌ని దుయ్య‌బ‌ట్టారు. రేవంత్‌రెడ్డి ట్రాఫిక్ చ‌లాన్ల‌పై చట్టం చేయ‌ర‌ని, ఒక‌వేళ చేసినా కోర్టులు దానిని కొట్టివేస్తామ‌ని వివ‌రించారు. విలేక‌రుల స‌మావేశంలో బీఆర్ఎస్ నాయ‌కులు ఉపేంద్ర‌చారి, కురువ విజ‌య్‌కుమార్ పాల్గొన్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement