Harish Rao | రెండున్నరేండ్లుగా స్కీంలు లేవు.. రేవంత్ స్కాంలు ఉన్నయ్: హరీశ్ రావు
Harish Rao | అన్ని జిల్లాలు తిరుగుతున్న రేవంత్ రెడ్డికి (Revanth Reddy) ఉమ్మడి మెదక్‌కు వచ్చేందుకు ముఖం లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్‌ఎల్పీ ఉప నేత హరీశ్ రావు (Harish Rao ) విమర్శించారు. ఇక్కడ హరీశ్ రావు ఉన్నడని భయపడుతున్నడని ఎద్దేవా చేశారు.
Harish Rao | త్రినేత్ర.న్యూస్: అన్ని జిల్లాలు తిరుగుతున్న రేవంత్ రెడ్డికి (Revanth Reddy) ఉమ్మడి మెదక్‌కు వచ్చేందుకు ముఖం లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్‌ఎల్పీ ఉప నేత హరీశ్ రావు (Harish Rao ) విమర్శించారు. ఇక్కడ హరీశ్ రావు ఉన్నడని భయపడుతున్నడని ఎద్దేవా చేశారు. హామీలు, గ్యారెంటీలు గారడీలపై మెదక్ ప్రజలు నిలదీస్తారని ఇటు వైపు చూడటం లేదని మండిపడ్డారు. రెండున్నరేండ్లలో ఒక్క పని చేయని దద్దమ్మ సర్కారు ఇదని ధ్వజమెత్తారు. స్కీంలు లేవు గానీ, రేవంతు స్కాంలు ఉన్నాయని విమర్శించారు. మున్సిపాలిటీల్లో ఫాగింగ్ లేదు గానీ, అంతా ఫ్రాడింగ్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిస్తేనే ఇండ్ల పట్టాలైనా, నీళ్లైనా బరాబర్ వస్తాయన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా దుబ్బాకలో హరీశ్ రావు భారీ ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. `రేవంత్ రెడ్డి ఏమైనా జేబుల నుంచి ఇస్తున్నడా. ఈ ఎన్నికలు మీకు చాలా ముఖ్యం. ఇవి రేవంతు రెడ్డికో, కేసీఆర్‌కో ముఖ్యం కావు. ఎందుకంటే హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి వాటి అమలు మరిచిపోయాడు. మహాలక్ష్మి అన్నడు, రైతు భరోసా అన్నడు, పంట బోనస్ అన్నడు, స్కూటీలు అన్నడు, తులం బంగారం అన్నడు.. ఇట్లా 420 హామీలు ఇచ్చిండు. రెండున్నరేండ్లలో ఒక్క హామీ అమలు కాలేదు.
భార్యకు ఫ్రీ.. భర్తకు డబుల్ టికెట్..
అయిన ఒక్క బస్సు పథకంలో భార్యకు ఫ్రీ, భర్తకు డబుల్ టికెట్ కొడుతున్నడు. ఈ ఎన్నిక తప్పితే రేవంతు రెడ్డి మల్లా రెండేండ్ల వరకు దొరకడు. పొద్దున లేస్తే కేసీఆర్‌ను, నన్ను తిడుతడు.
లేకుంటే కేటీఆర్ ఇంగ్లిష్ గురించి తిడుతడు. రేవంతు రెడ్డి పాలనలో నీళ్ల గోస, కరెంటు గోస, ఎరువులకు గోస, యాసంగి వచ్చినా రైతు బంధు ఇప్పటికీ దిక్కులేదు. కొత్తగా ఏం ఇవ్వలేదు, ఉన్నవి బంద్ పెట్టిండు.
అంతరిక్షం పోయినా రేవంత్ నోటి మురికి పోదు..
తెలంగాణ తెచ్చిన కేసీఆర్‌ను పట్టుకొని అడ్డగోలుగా తిడుతడు. కేసీఆర్‌ను తిడుతే అవ్వాతాతల కడుపు నిండుతదా?. బొగ్గును పాలతో కడిగితే.. బొగ్గు నలుపు పాలకు అంటుతుంది. కానీ బొగ్గు తెల్లగా కాదు. అలాగే రేవంత్ రెడ్డి.. హార్వర్డు పోయినా, అంతరిక్షం పోయినా ఆయన మకిలి వాటికే అంటుంది తప్ప, రేవంత్ నోటి మురికి పోదు. బూతులు మాట్లాడుతున్న రేవంత్ రెడ్డికి పోలింగ్ బూతులో బుద్ధి చెప్పాలి.
సురుకు పెట్టాలె..
దుబ్బాకలో బడి, గుడి, ఆసుపత్రి కట్టింది కేసీఆర్. రోడ్లు వేసింది కేసీఆర్. ఏ బీజేపీ వాడు, కాంగ్రెసోడు చేసిండు. వాడిపోయిన కమలం పువ్వు గురించి నేను ఎక్కువ మాట్లాడ. రేవంతు రెడ్డికి సురుకు పెట్టాలె. అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన రేవంతుకు బుద్ధి చెప్పాలె. దుబ్బాకలో గులాబీ జెండా రెపరెపలాడాలి.` అని హరీశ్ రావు అన్నారు.
తాజావార్తలు
- ●Global Passport Index 2026 | గ్లోబల్ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో 125వ స్థానానికి పడిపోయిన భారత్.. ఏయే దేశాలకు వీసా-ఫ్రీగా వెళ్లొచ్చంటే?
- ●Mother Helps Son Crack JEE | బెడ్‌పై కొడుకు.. క్లాస్‌లో తల్లి: జేఈఈ అడ్వాన్స్డ్ క్రాక్ చేసి ఐఐటీ ఢిల్లీకి ఎంపికైన గుంజన్
- ●Gold Ramcharitmanas Missing | అయోధ్య రామమందిరంలో రూ.5 కోట్ల విలువైన బంగారు రామచరితమానస్ ఏమైంది?
- ●Vakiti Srihari | పాడి రైతుల కష్టాలు నాకెరికే.. ఇక 15 రోజులకోసారి బిల్లులు చెల్లిస్తం
- ●New Ration Cards | 48 గంటల్లోనే కొత్త రేషన్ కార్డులు జారీ : మంత్రి పొన్నం
- ●Ponnam Prabhakar | ఉపాధి ఉన్న దగ్గరే ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తం

Global Passport Index 2026 | గ్లోబల్ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో 125వ స్థానానికి పడిపోయిన భారత్.. ఏయే దేశాలకు వీసా-ఫ్రీగా వెళ్లొచ్చంటే?

Mother Helps Son Crack JEE | బెడ్‌పై కొడుకు.. క్లాస్‌లో తల్లి: జేఈఈ అడ్వాన్స్డ్ క్రాక్ చేసి ఐఐటీ ఢిల్లీకి ఎంపికైన గుంజన్

Gold Ramcharitmanas Missing | అయోధ్య రామమందిరంలో రూ.5 కోట్ల విలువైన బంగారు రామచరితమానస్ ఏమైంది?

Vakiti Srihari | పాడి రైతుల కష్టాలు నాకెరికే.. ఇక 15 రోజులకోసారి బిల్లులు చెల్లిస్తం






