Nampally Fire Incident | 20 గంటలుగా రెస్క్యూ ఆపరేషన్.. అయినా చిక్కని ఐదుగురి ఆచూకీ
Nampally Fire Incident | హైదరాబాద్ నాంపల్లిలోని ఓ ఫర్నీచర్ దుకాణంలో (Furniture Shop) ఘోర అగ్ని ప్రమాదం (Nampally Fire Accident) సంభవించిన విషయం తెలిసిందే. శనివారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో నాలుగంతస్తుల భవనంలోని సెల్లార్‌లో మంటలు చెలరేగాయి.
త్రినేత్ర.న్యూస్: హైదరాబాద్ నాంపల్లిలోని ఓ ఫర్నీచర్ దుకాణంలో (Furniture Shop) ఘోర అగ్ని ప్రమాదం (Nampally Fire Accident) సంభవించిన విషయం తెలిసిందే. శనివారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో నాలుగంతస్తుల భవనంలోని సెల్లార్‌లో మంటలు చెలరేగాయి. భారీగా మంటలు ఎగసిపడటంతో భవనం మొత్తం అగ్నికీలలు వ్యాపించాయి. ఈ ఘటనలో మొత్తం ఐదుగురి ఆచూకీ గల్లంతైంది. వారిలో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. 20 గంటలుగా సహాయక చర్యలు కొనసాగుతున్నప్పటికీ (Rescue Operation) వారి ఆచూకి తెలియలేదు. సహాయక బృందాలు నిర్విరామంగా శ్రమిస్తున్నప్పటికీ.. సెల్లార్‌లో కమ్ముకున్న దట్టమైన పొగలు రెస్క్యూ ఆపరేషన్‌కు అడ్డంకిగా మారాయి. ఈ నేపథ్యంలో సెల్లార్‌లో గుంత తవ్వి రెస్క్యూ బృందం లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నది. సుమారు 200 మంది సిబ్బందితో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
కాగా, తమవారి ఆచూకీ కోసం బంధువులు పడిగాపులు కాస్తున్నారు. వారి ఆచూకీ తెలపాలంటూ ఆందోళనకు దిగారు. గోడ పగులగొట్టి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో బాధితుల బంధువులు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకున్నది. భవన దృఢత్వంపై అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జేఎన్టీయూ ఇంజినీరింగ్ బృందం భవనాన్ని తనిఖీ చేసి నివేదిక ఇవ్వనున్నారు. మరికాసేపట్లో వారు ఘటనా స్థలానికి చేరుకోనున్నారు.
నాంపల్లి చిరాగ్‌అలీ లేన్‌లోని బచ్చాస్ ఫర్నిచర్ క్యాసిల్‌లో శనివారం మధ్యాహ్నం ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. ఫర్నీచర్ కావడంతో క్షణాల్లో మంటలు దుకాణం మొత్తం వ్యాపించాయి. భారీగా అగ్నికీలలు ఎగసిపడటంతో మంటలు బిల్డింగ్ మొత్తానికి అంటుకోవడంతో అంతా కాలిబూడిదయ్యాయి. ఆ సమయంలో భవనంలో ఉన్న వారంతా బయటకు వచ్చేశారు. అయితే బిల్డింగ్ వాచ్‌మెన్ యాదయ్య కుమారులు 10 ఏళ్ల ప్రణీత్, 7 ఏళ్ల అఖిల్ ఇద్దరు సెల్లార్‌లోనే చిక్కుకుపోయారు. వారిని కాపాడేందుకు కర్ణాటకకు చెందిన ఉస్మాన్ ఖాన్ ఆయన భార్య బేబి, అక్కడే పనిచేసే ఇంతియాజ్ సెల్లార్‌లోకి వెళ్లారు. క్షణాల్లోనే భవనం మొత్తం అగ్నికీలలు వ్యాపించడం దట్టమైన పొగ అలుముకుంది. దీంతో సెల్లార్‌లో ఉన్న వారంతా.. సెల్లార్ రెండో అంతస్తులోకి వెళ్లినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. వారిని కాపాడేందుకు రెండు రోబోలను పంపించారు. అయినా ఫలితం దక్కలేదు.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్





