Republic Day | హైదరాబాద్ ఇమేజ్ పెంచేలా తెలంగాణ రైజింగ్ డాక్యుమెంట్ : గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
Republic Day | హైదరాబాద్ ఇమేజ్ పెంచేలా తెలంగాణ రైజింగ్ డాక్యుమెంట్ ఉందని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తెలిపారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
Republic Day | హైదరాబాద్ ఇమేజ్ పెంచేలా తెలంగాణ రైజింగ్ డాక్యుమెంట్ ఉందని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తెలిపారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. సైనికులు, పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. వేడుకల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీఎస్ రామకృష్ణారావు, డీజీపీ హాజరయ్యారు. అనంతరం గవర్నర్ మాట్లాడుతూ.. రాజ్యాంగం మనకు స్వేచ్ఛ, సమానత్వం ప్రసాదించిందన్నారు. భిన్నత్వంలో ఏకత్వం మన ప్రత్యేకతని, ప్రజాప్రభుత్వం ఇటీవలే రైజింగ్ తెలంగాణ డాక్యుమెంట్ ఆవిష్కరించిందని తెలిపారు. రైజింగ్ తెలంగాణ 2047లో సరికొత్త లక్ష్యాలను నిర్దేశించుకుందని.. హైదరాబాద్ ఇమేజ్‌ను పెంచేలా తెలంగాణ రైజింగ్ డాక్యుమెంట్ ఉందన్నారు.
మూడు కీలక రంగాలకు ప్రత్యేకమైన మూడు జోన్లను ఏర్పాటు చేస్తోందని, ఏటా డిసెంబర్ 9న తెలంగాణ తల్లి ఆవిష్కరణ దినోత్సవం జరుపుకుంటున్నామన్నారు. మేడారం అభివృద్ధి కోసం రూ.251 కోట్లు కేటాయించామని, రైతులకు 24గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇస్తున్నట్లు తెలిపారు. గతేడాది నిర్వహించిన బతుకమ్మ వేడుకలకు గిన్నిస్‌బుక్‌లో చోటు దక్కిందని, 26లక్షల మంది రైతులకు రూ.2లక్షల వరకు రుణమాఫీ చేశామన్నారు. సన్నవడ్లపై క్వింటాల్‌కు రూ.500 చొప్పున బోనస్ చెల్లిస్తున్నట్లు పేర్కొన్నారు. ధాన్యానికి బోనస్‌గా రైతులకు రూ.1,780కోట్లు చెల్లించామని, ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని చెప్పారు. భూ వివాదాలు పరిష్కరించేలా భూభారతి చట్టం తీసుకువచ్చామని, గ్రూప్-1, 2, 3 ఉద్యోగాలు భర్తీని పూర్తి చేశామన్నారు.
ప్రజా ప్రభుత్వం ఇప్పటి వరకు 62వేల ఉద్యోగాలు భర్తీ చేసిందని, యువతలో నైపుణ్యాలు పెంచేందుకు ఈ ప్రభుత్వం కృషి చేస్తోందని, ఐటీఐలను అడ్వాన్స్ టెక్నికల్ సెంటర్లుగా మార్చామన్నారు. తెలంగాణను గ్లోబల్ స్కిల్ హబ్‌గా మార్చాలని నిర్ణయించామని.. విద్యార్థులకు సమాన అవకాశాల కోసమే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌ను నిర్మించామని పేర్కొన్నారు. మహిళలను వ్యాపారవేత్తలుగా మార్చేందుకు కార్యాచణ చేపట్టామని.. బ్యాంకుల ద్వారా మహిళలకు రూ.40వేల కోట్లు సమకూర్చామని పేర్కొన్నారు. మహిళలను పెట్రోల్ బంకు, ఆర్టీసీ అద్దె బస్సులకు యజమానులుగా చేశామని, మహిళలు ఇప్పటికే రూ.200కోట్ల ఉచిత బస్సు ప్రయాణాలు చేశారన్నారు. విద్య, వైద్యాన్ని ఈ ప్రభుత్వం ప్రాధాన్యతగా తీసుకుందన్నారు.
27 ఎకరాల్లో రూ.2వేలకోట్లతో కొత్త ఉస్మానియా ఆస్పత్తిగా నిర్మిస్తున్నామని, రేషన్‌కార్డుదారులకు సన్నబియ్యం అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ తెలిపారు. రాష్ట్రంలో 1.30కోట్ల కుటుంబాలకు ఉచితంగా సన్నబియ్యం ఇస్తున్నామని, తెలంగాణలో 3.35కోట్ల మందికి సన్నబియ్యం అందిస్తున్నామన్నారు. పేదలకు సొంతింటి కల వేర్చేందుకు ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తున్నామని, ప్రతి నియోజకవర్గానికి 4.50లక్షల ఇందిరమ్మ మంజూరు చేశామన్నారు. చేనేత కార్మికులకు రూ.5లక్షల బీమా పథకాన్ని అమలు చేస్తున్నామని, నగరంలో కాలుష్యాన్ని తగ్గించేందుకు చర్యలు చేపట్టామన్నారు. హిల్ట్ పాలసీ ద్వారా కాలుష్య పరిశ్రమలను సిటీ వెలుపలకు తరలిస్తామని వివరించారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్





