Bhatti Vikramarka | పరిశుభ్రమైన గాలితోనే నిజమైన అభివృద్ధి: మల్లు భట్టి విక్రమార్క
Bhatti Vikramarka | పరిశుభ్రమైన గాలితోనే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని ఉప ముఖ్యమంత్రి (Deputy CM) మల్లు భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) అన్నారు. తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) స్పష్టమైన లక్ష్యంతో శాస్త్రీయ విధానాన్ని అనుసరిస్తుందని, రాష్ట్ర ప్రజలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని కల్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు.
Bhatti Vikramarka | త్రినేత్ర.న్యూస్ : పరిశుభ్రమైన గాలితోనే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని ఉప ముఖ్యమంత్రి (Deputy CM) మల్లు భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) అన్నారు. అందుకే ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) స్పష్టమైన లక్ష్యంతో శాస్త్రీయ విధానాన్ని అనుసరిస్తుందని, హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్ర ప్రజలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని కల్పించేందుకు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని మంత్రివర్గం ముందుకు వెళుతుందని చెప్పారు. రాష్ట్ర ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (MCRHRDI) లో “గాలి నాణ్యత సూచీ మరియు గాలి నాణ్యత నిర్వహణ” అంశంపై ఏర్పాటు చేసిన సదస్సుకు డిప్యూటీ సీఎం ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సదస్సు యొక్క స్పష్టమైన, ఉన్నత లక్ష్యం 'ఆరోగ్యవంతమైన తెలంగాణ కోసం స్వచ్ఛమైన గాలి' అని అన్నారు. నేడు తెలంగాణ దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలలో ఒకటని, హైదరాబాద్ ఐటీ, లైఫ్ సైన్సెస్, తయారీ, ఆవిష్కరణల కేంద్రంగా ఎదిగిందని, ఈ అభివృద్ధి మనకు గర్వకారణమని అన్నారు. అదే సమయంలో ఇది మనపై బాధ్యతను కూడా మోపుతుందని చెప్పారు. అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణను ఎదురెదురుగా నిలబెట్టలేమని అవి చేతులు కలిపి ముందుకు నడవాలని అభిప్రాయపడ్డారు.
సుస్థిర అభివృద్ధి ద్వారా మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక లక్ష్యాన్ని సాధించాలనే దృఢ సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తోందని డిప్యూటీ సీఎం చెప్పారు. అదే సమయంలో జలాశయాల పునరుద్ధరణ, సహజ వనరుల సంరక్షణ, గాలి నాణ్యత మెరుగుదలపై కూడా తమ ప్రభుత్వం పెద్దఎత్తున పెట్టుబడులు పెడుతోందని తెలిపారు. ఎందుకంటే శుభ్రమైన గాలి లేకుండా జరిగే అభివృద్ధి నిజమైన ప్రగతి కాదు, అది కేవలం ఆలస్యమైన నష్టం మాత్రమే అని వివరించారు. గాలి నాణ్యత ఒక పర్యావరణ సూచీ మాత్రమే కాదు, అది ప్రజారోగ్య సూచీ, అది ఉత్పాదకత సూచీ, ఆర్థిక సూచీ కూడా పేర్కొన్నారు.
జాతీయ, అంతర్జాతీయ నిపుణులను సదస్సు ఒక వేదికపైకి తీసుకొచ్చిందని, వారి అనుభవం, డేటా, ఆవిష్కరణలు మార్గదర్శకంగా నిలుస్తాయని భట్టి విక్రమార్క అన్నారు. జ్ఞానాన్ని విధానంగా మార్చుదాం, విధానాన్ని చర్యగా మార్చుదాం, చర్యను ఫలితంగా మార్చుదామని పిలుపునిచ్చారు. ఆర్థిక వృద్ధి, ఆవిష్కరణలు, శుభ్రమైన గాలి కలిసి ముందుకు సాగే తెలంగాణను నిర్మిద్దామని అన్నారు. అదే మన నిజమైన వారసత్వం అని పేర్కొన్నారు.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్





