Krishank | ఇందిరమ్మ చీరలను ఎలుకలు కొరుకుతున్నయ్.. 10 నెలల నుంచి ఎందుకు పంచలే?
Krishank | కంటోన్మెంట్‌లోని వర్క్‌షాప్‌లో ఉన్న చీరలు ఎలుకల పాలవుతున్నాయని.. 10 నెలల నుంచి వాటిని ఎందుకు పంచలేదని బీఆర్ఎస్ నాయకులు మన్నే క్రిశాంక్ ప్రశ్నించారు. 2025, నవంబర్‌లో కోటి ఇందిరమ్మ చీరలు పంపిణీ చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిందన్నారు. ఇవాళ 2026, ఆగస్టులో ఉన్నామని.. ఇప్పటివరకు చీరలు ఎందుకు పంచలేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
- కంటోన్మెంట్‌లో వేల మంది మహిళలకు చీరలు ఎందుకివ్వలే?
- ప్రజా ధనం వృథా అవుతోంది
- బీఆర్ఎస్ నాయకులు మన్నే క్రిశాంక్ నిలదీత
Krishank | త్రినేత్ర.న్యూస్: కంటోన్మెంట్‌లోని వర్క్‌షాప్‌లో ఉన్న చీరలు ఎలుకల పాలవుతున్నాయని.. 10 నెలల నుంచి వాటిని ఎందుకు పంచలేదని బీఆర్ఎస్ నాయకులు మన్నే క్రిశాంక్ ప్రశ్నించారు. 2025, నవంబర్‌లో కోటి ఇందిరమ్మ చీరలు పంపిణీ చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిందన్నారు. ఇవాళ 2026, ఆగస్టులో ఉన్నామని.. ఇప్పటివరకు చీరలు ఎందుకు పంచలేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వర్క్‌షాప్‌లో ఉన్న చీరలను శుక్రవారం పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజా ధనం వృథా చేయడం సరికాదన్నారు.

పంచాల్సిన ఇందిరమ్మ చీరలు ఇక్కడ ఎందుకు పెట్టారు? అవి తుప్పు పడుతున్నాయి. రాష్ట్రంలోని మహిళలకు పంచుతామని ప్రకటించారు. ఇయ్యాళ 2026, ఆగస్టులో ఉన్నాం. కంటోన్మెంట్‌లో ఉన్న వేల మంది మహిళలకు ఇందిరమ్మ చీరలు ఇవ్వలేదు. ఆనాడు కేసీఆర్ ప్రభుత్వంలో దసరా పండుగ రోజుకు ముందే బతుకమ్మ పండగ సమయంలో రాష్ట్రంలో ఉన్న అందరూ మహిళలకు పంపిణీ చేశారు అని ఆయన గుర్తు చేశారు.
ఇవాళ ఇందిరమ్మ చీరలను మహిళా గ్రూపులకే ఇస్తమన్నరు. మహిళలందరికీ ఇవ్వలేమని చెప్పారు. కానీ ఇవాళ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. కంటోన్మెంట్‌లో మహిళలకు చీరలు ఇవ్వకుండా నెలల నుంచి ఇందిరమ్మ చీరలను తెచ్చి వర్క్‌షాప్‌లో పెట్టారు. కొన్ని వేల చీరలు ఇక్కడ ఉన్నయ్. ఎలుకలు కూడా వాటిని కొట్టేస్తున్నయ్.
రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఇవ్వకుండా ఇక్కడ ఎందుకు పెట్టారని బీఆర్ఎస్ తరఫున మేం అడుగుతున్నం. మహిళలు ఒద్దంటున్నరా? మహిళలు తీసుకుంటలేరా? లేదంటే మీరే పంపిణీ చేస్తలేరా? కొన్ని నెలల నుంచి వర్క్‌షాప్‌లో పెట్టడానికి కారణం ఏంటిది? దీని మీద కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రజా ధనం వృధా అవుతుంది. ఇక్కడ ఎందుకు పెట్టిండ్రు. ఇది నిజంగా షాకింగ్ అనిపిస్తుంది అని క్రిశాంక్ మండిపడ్డారు.
తాజావార్తలు
- ●Mallu Ravi | కేటీఆర్‌పై వెంటనే క్రిమినల్ కేసు నమోదు చేసి ఎవిడెన్స్ సేకరించండి
- ●Bandi Sanjay | ఆ ముగ్గురు మంత్రులు వసూళ్లలో బిజీ..
- ●Veerapalli Shankar | కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు: కాంగ్రెస్ ఎమ్మెల్యే వీరపల్లి శంకర్‌పై పోలీసులకు ఫిర్యాదు
- ●Nivetha Thomas | ’శ్రీమతి’గా నివేదా థామస్.. ఫస్ట్‌లుక్ అదిరిపోయింది!
- ●NSE IPO | ఈ నెలలోనే ఎన్ఎస్ఈ ఐపీవో..? భారీ ఆఫర్..
- ●Ramachander Rao | రాజకీయ నాటకాలకు వేదికగా అసెంబ్లీ : రామచందర్ రావు

Mallu Ravi | కేటీఆర్‌పై వెంటనే క్రిమినల్ కేసు నమోదు చేసి ఎవిడెన్స్ సేకరించండి

Bandi Sanjay | ఆ ముగ్గురు మంత్రులు వసూళ్లలో బిజీ..

Veerapalli Shankar | కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు: కాంగ్రెస్ ఎమ్మెల్యే వీరపల్లి శంకర్‌పై పోలీసులకు ఫిర్యాదు

Nivetha Thomas | ’శ్రీమతి’గా నివేదా థామస్.. ఫస్ట్‌లుక్ అదిరిపోయింది!





