Chamala Kirankumar Reddy | బీఆర్ఎస్ సోషల్ మీడియాకే పరిమితమైంది..
Chamala Kirankumar Reddy | రేవంత్ రెడ్డి ఏం తప్పులు మాట్లాడతారోనని బీఆర్ఎస్ నాయకులు ఎదురు చూస్తారని.. సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసి శునకానందం పొందాలనుకుంటారని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాకు మాత్రమే పరిమితమైందని ఎద్దేవా చేశారు. కేటీఆర్, హరీశ్‌రావు నీళ్ల పేరుతో ప్రజలను రెచ్చగొట్టి సెంటిమెంట్‌ను మరోసారి తెరపైకి తేవాలని చూస్తున్నారని ఆరోపించారు.
- నీళ్ల పేరుతో ప్రజలను రెచ్చగొట్టి సెంటిమెంట్‌ను తెరపైకి తేవాలని చూస్తున్నారు
- గోదావరి, బనకచర్లపై కేంద్రం వెనక్కి తగ్గడం వెనుక రేవంత్, ఉత్తమ్ కృషి ఉంది
- టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్‌గా అవకాశమిచ్చిన పార్టీ అధిష్టానానికి కృతజ్ఞతలు
- ఢిల్లీ ప్రెస్‌మీట్‌లో భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి
Chamala Kirankumar Reddy | త్రినేత్ర.న్యూస్: రేవంత్ రెడ్డి ఏం తప్పులు మాట్లాడతారోనని బీఆర్ఎస్ నాయకులు ఎదురు చూస్తారని.. సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసి శునకానందం పొందాలనుకుంటారని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాకు మాత్రమే పరిమితమైందని ఎద్దేవా చేశారు. కేటీఆర్, హరీశ్‌రావు నీళ్ల పేరుతో ప్రజలను రెచ్చగొట్టి సెంటిమెంట్‌ను మరోసారి తెరపైకి తేవాలని చూస్తున్నారని ఆరోపించారు. గోదావరి, బనకచర్లపై కేంద్రం వెనక్కి తగ్గడానికి కారణం రేవంత్, ఉత్తమ్‌ల కృషే అని చెప్పారు. ఢిల్లీలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్‌పై విమర్శలు చేశారు. తనను టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్‌గా నియమించినందుకు పార్టీ అధిష్టానానికి చామల కృతజ్ఞతలు తెలిపారు.
బీఆర్ఎస్ పదేళ్ల పాలనను ప్రజలు మర్చిపోలేదు. బీఆర్ఎస్ చేస్తున్న తప్పుడు ప్రచారాలను క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్ కార్యకర్తలు తిప్పికొట్టాలి. గోదావరి, బనకచర్లపై కేంద్రం వెనక్కి తగ్గడం వెనుక రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి కృషి ఉంది. బావ, బామ్మర్దులు దౌర్భాగ్యులు. చంద్రబాబు, రేవంత్ రెడ్డి ఒక్కటే అని విష ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్, బీజేపీ చెడు ప్రచారాన్ని తిప్పికొడతాం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డిపై బురదచల్లడం కేటీఆర్, హరీష్ రావు లక్ష్యం అని చామల విమర్శించారు.
బీఆర్ఎస్ హయాంలోనే పేపర్లు లీక్ అయ్యాయి..
కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురావడంలో బీఆర్ఎస్ ఫెయిల్ అయింది. కేసీఆర్ నిజాం నవాబులాగా పదేళ్లు పాలించారు. ప్రజలకు కష్టాలు వస్తే ఆనందం పొందే బుద్ది కేటీఆర్, హరీష్ రావు మానుకోవాలి. వరుసగా ఐదు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు బుద్ది చెప్పారు. సోషల్ మీడియాతో తెలంగాణ ప్రజల్లో విష బీజాన్ని నింపాలని కేటీఆర్, హరీష్ రావు చూస్తున్నారు. రేవంత్ రెడ్డి విద్యార్థులకు వ్యతిరేకం కాదు. విద్యా వ్యవస్థను రేవంత్ రెడ్డి గాడిలో పెడుతున్నారు. తెలంగాణలో పరీక్ష పేపర్లు బీఆర్ఎస్ హయాంలోనే లీక్ అయ్యాయి అని కిరణ్‌కుమార్‌రెడ్డి విమర్శలు గుప్పించారు.
టీపీసీసీ మీడియా కమిటీ ఛైర్మన్‌గా అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, లోక్‌సభ ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కె.సి.వేణుగోపాల్, ఎంపీ ప్రియాంక గాంధీ, పవన్ ఖేరా, సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌కు ధన్యవాదాలు చెప్పారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Bhatti Vikramarka | ఉద్యోగులందరికీ రూ.కోటి బీమా పథకం అమలు చేస్తున్నం
సెప్టెంబర్ 10, 2026

MLC Venkatrami Reddy | వీర్లపల్లి శంకర్ మీద ఏం చర్యలు తీసుకున్నరో చెప్పాలి
సెప్టెంబర్ 10, 2026

Supreme Court | ఆన్లైన్లో అనుచిత కంటెంట్ నుంచి పిల్లల్ని రక్షించండి.. కేంద్రానికి సుప్రీం నోటీసులు
సెప్టెంబర్ 10, 2026
తాజావార్తలు
- ●Nitin Gadkari | సిగ్గుగా ఉంది.. ప్రారంభోత్సవానికి నేను రాను : రహదారి నిర్మాణం ఆలస్యంపై గడ్కరీ అసహనం
- ●S.Madhusudhana Chary | పింక్ కలర్ చొక్కా వేసుకున్నా సభలో అడ్డుకున్నరు
- ●MLC Venkatrami Reddy | వీర్లపల్లి శంకర్ మీద ఏం చర్యలు తీసుకున్నరో చెప్పాలి
- ●Supreme Court | ఆన్లైన్లో అనుచిత కంటెంట్ నుంచి పిల్లల్ని రక్షించండి.. కేంద్రానికి సుప్రీం నోటీసులు
- ●KCR Fake Tweet Controversy | రేవంత్ రెడ్డే సంధ్యారావు.. సంధ్యారావే రేవంత్ రెడ్డి
- ●Jayam Ravi | వెంకటేశ్వరస్వామిగా జయం రవి - మంచు మనోజ్ సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ

Nitin Gadkari | సిగ్గుగా ఉంది.. ప్రారంభోత్సవానికి నేను రాను : రహదారి నిర్మాణం ఆలస్యంపై గడ్కరీ అసహనం

S.Madhusudhana Chary | పింక్ కలర్ చొక్కా వేసుకున్నా సభలో అడ్డుకున్నరు

MLC Venkatrami Reddy | వీర్లపల్లి శంకర్ మీద ఏం చర్యలు తీసుకున్నరో చెప్పాలి

Supreme Court | ఆన్లైన్లో అనుచిత కంటెంట్ నుంచి పిల్లల్ని రక్షించండి.. కేంద్రానికి సుప్రీం నోటీసులు



