Joginapally Santhosh Kumar | వెంకటాపూర్‌లో గ్రీన్ ఇండియా ఛాలెంజ్.. 2000 వేల మొక్కలు నాటిన సంతోష్‌కుమార్
Joginapally Santhosh Kumar | పర్యావరణ పరిరక్షణ, హరితహారాన్ని పెంపొందించడమే ప్రథమ లక్ష్యమని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకులు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్ అన్నారు. ఈ బృహత్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని వెంకటాపూర్‌లో సర్పంచ్ కనకయ్య, చెప్యాల రాజేశ్వర్‌రావు ఆధ్వర్యంలో ప్రజలందరితో కలిసి 2000 వేల మొక్కలు నాటినట్లు తెలిపారు.
Joginapally Santhosh Kumar | త్రినేత్ర.న్యూస్: పర్యావరణ పరిరక్షణ, హరితహారాన్ని పెంపొందించడమే ప్రథమ లక్ష్యమని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకులు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్ అన్నారు. ఈ బృహత్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని వెంకటాపూర్‌లో సర్పంచ్ కనకయ్య, చెప్యాల రాజేశ్వర్‌రావు ఆధ్వర్యంలో ప్రజలందరితో కలిసి 2000 వేల మొక్కలు నాటినట్లు తెలిపారు. కోట్లాది మొక్కలు నాటి ఆకు పచ్చని తెలంగాణ దిశగా పని చేయడమే తమ ధ్యేయమన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

రాష్టంలో గ్రీనరి శాతం పెంచేలా ప్రతి ఒక్కరిని ఏకం చేసి మహా యజ్ఞంలా ముందుకు తీసుకెళ్తున్నామన్నారు. జీవవైవిధ్యాన్ని కాపాడటంతో పాటు భూగర్భ జలాలను పెంచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఒక్కరు మూడు మొక్కలు నాటుతూ మరో ముగ్గురితో నాటించేలా ప్రోత్సహించాలని కోరారు. పర్యావరణ స్పృహను పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

అనంతరం సర్పంచ్ కనకయ్య మాట్లాడారు. గ్రామ ప్రజలందరి చేతుల మీదిగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా జోగినపల్లి సంతోష్ కుమార్ చేతుల మీదిగా మొక్కలు నాటడం చాలా ఆనందంగా ఉంది. పర్యావరణ పరిరక్షణకు సంతోష్ కుమార్ చేస్తున్న కృషి ఎంతో గొప్పది. కేసీఆర్‌ను స్ఫూర్తిగా తీసుకొని గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా కోట్లాది మొక్కలు నాటుతున్నారు. రేపటి తరాల కోసం ఆలోచించే సంతోష్ కుమార్‌కు కృతజ్ఞతలు. ఆయన బాటలోనే మేం నడుస్తాం అని కనకయ్య పేర్కొన్నారు.


ఈ బృహత్ కార్యక్రమంలో గజ్వెల్ నియోజకవర్గ ఇంచార్జ్ ఒంటెరు ప్రతాపరెడ్డి, ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి, ఎంపీపీ పాండు గౌడ్, జడ్పీటీసీ రాంచంద్రం, ఉప సర్పంచ్ పుట్ట మనసా ప్రకాష్, ఎంపీటీసీల ఫోరమ్ అధ్యక్షుడు కృష్ణ యాదవ్, స్థానిక నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Bhatti Vikramarka | పెట్టుబడులకు గమ్యస్థానం తెలంగాణ.. కొత్త ఆలోచనలతో రండి.. ప్రభుత్వంతో కలిసి నడవండి: భట్టి విక్రమార్క
ఆగస్టు 7, 2026

BJP Ramchandar Rao | తెలంగాణకు గొప్ప చేనేత వారసత్వం ఉంది.. కార్మికుల సమస్యల కోసం బీజేపీ పోరాడుతుంది
ఆగస్టు 7, 2026

Harish Rao | నేతన్న బతికితేనే.. మన చేనేత బతుకుతుంది: హరీశ్ రావు
ఆగస్టు 7, 2026
తాజావార్తలు
- ●Bhatti Vikramarka | పెట్టుబడులకు గమ్యస్థానం తెలంగాణ.. కొత్త ఆలోచనలతో రండి.. ప్రభుత్వంతో కలిసి నడవండి: భట్టి విక్రమార్క
- ●Vijay-Stalin Junior War | సమస్య పరిష్కారం కోసం పొరుగు రాష్ట్రానికి వెళ్తే తప్పేంటి..? సీఎం విజయ్ Vs జూనియర్ స్టాలిన్
- ●BJP Ramchandar Rao | తెలంగాణకు గొప్ప చేనేత వారసత్వం ఉంది.. కార్మికుల సమస్యల కోసం బీజేపీ పోరాడుతుంది
- ●Rahul Gandhi | బీజేపీలో మీకు ఇష్టమైన నాయకుడు ఎవరు?.. ఇదీ రాహుల్ గాంధీ సమాధానం.. వీడియో
- ●Stocks | ఎరోస్పేస్ రంగంలో దూసుకెళ్తున్న 3 కంపెనీలు.. భారీ రాబడులపై కన్నేసిన పెట్టుబడిదారులు..
- ●Assault | భార్యపై కోపంతో.. నాలుగేండ్ల కూతురిపై లైంగికదాడి..

Bhatti Vikramarka | పెట్టుబడులకు గమ్యస్థానం తెలంగాణ.. కొత్త ఆలోచనలతో రండి.. ప్రభుత్వంతో కలిసి నడవండి: భట్టి విక్రమార్క

Vijay-Stalin Junior War | సమస్య పరిష్కారం కోసం పొరుగు రాష్ట్రానికి వెళ్తే తప్పేంటి..? సీఎం విజయ్ Vs జూనియర్ స్టాలిన్

BJP Ramchandar Rao | తెలంగాణకు గొప్ప చేనేత వారసత్వం ఉంది.. కార్మికుల సమస్యల కోసం బీజేపీ పోరాడుతుంది

Rahul Gandhi | బీజేపీలో మీకు ఇష్టమైన నాయకుడు ఎవరు?.. ఇదీ రాహుల్ గాంధీ సమాధానం.. వీడియో



