Niranjan Reddy | ఉన్న నీళ్లను వదిలిపెట్టి వరుణ యాగమా..?
Niranjan Reddy | రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ ఈ నెల 10న వరుణ యాగం (Varuna Yagam) నిర్వహించాలన్న సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయంపై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. ఉన్న నీళ్లను వదిలిపెట్టి వరుణ యాగం చేయడం విడ్డూరంగా ఉందని ఆయన మండిపడ్డారు.
శ్రీశైలంలో 160 టీఎంసీల నీళ్లు ఉంటే..
45 టీఎంసీలు ఉన్నాయని ప్రభుత్వం చెబుతుంది..
రేవంత్, ఉత్తమ్.. ఇద్దరూ పాలమూరుకు శనే
జూరాలకు వరద పోటెత్తింది..
ఆ నీళ్లను ఎత్తిపోస్తే తప్పేంటి..?
కేఎల్ఐ మూడు మోటార్లు ఆన్ చేయాల్సిందే
11న నార్లాపూర్ రిజర్వాయర్ వద్ద బీఆర్ఎస్ ఆందోళన
మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
Niranjan Reddy | త్రినేత్ర.న్యూస్ : రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ ఈ నెల 10న వరుణ యాగం (Varuna Yagam) నిర్వహించాలన్న సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయంపై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. ఉన్న నీళ్లను వదిలిపెట్టి వరుణ యాగం చేయడం విడ్డూరంగా ఉందని ఆయన మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో శుక్రవారం నిరంజన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
బాధ, దుఃఖంతో ఈ మీడియా సమావేశంలో మాట్లాడుతున్నాను. ఎగువన కురుస్తున్న వర్షాలకు కృష్ణాలో వరద వస్తుంది. జూరాలకు నుంచి 2 లక్షల 30 వేల క్యూసెక్కుల నీళ్లు శ్రీశైలం ప్రాజెక్టుకు వస్తున్నాయి. 160 టీఎంసీల నీళ్ళు శ్రీశైలంలో ఉన్నాయి. ఉన్న నీళ్లను వదిలిపెట్టి, ఆకాశం నుంచి వచ్చే నీళ్ల కోసం వరుణ యాగం చేయడం విడ్డూరంగా ఉందన్నారు నిరంజన్ రెడ్డి.
కృష్ణాలో నీళ్లు పొంగిపొర్లుతుంటే పంటలు వేసుకోవద్దా..?
కాలువల ద్వారా నీళ్లు ఇవ్వొద్దని ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బాధ్యతతో ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడాల్సింది పోయి... నీళ్ళు ఇవ్వొద్దని అధికారులకు ఆదేశాలు ఇవ్వడం ఏంటి. కృష్ణాలో నీళ్లు పొంగిపొర్లుతుంటే పంటలు వెయ్యకండనే కార్యక్రమం ప్రభుత్వం పెట్టుకుంది. 160 టీఎంసీలు శ్రీశైలంలోనే ఉంటే, 45 టీఎంసీలు మాత్రమే ఉన్నాయనడం ఏంటి..? ఉత్తమ్ కుమార్ రెడ్డి చుట్టూ ఉన్న అధికారులు ఆంధ్రా ప్రాంతానికి చెందిన వాళ్ళు అందుకే అలా మాట్లాడుతున్నారు. ఆంధ్రా ప్రాంతానికి చెందిన అధికారుల సలహాలు సూచనల ఫలితాలు ఇప్పుడు మనం చూస్తున్నామని నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.
నీళ్ళు ఆపే దమ్ము ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఉందా..!
ప్రభుత్వానికి ఇష్టమైన వార్తలు రాయించి రైతాంగాన్ని మోసం చేస్తున్నారు. నాగార్జున సాగర్ నుంచి కుడి కాలువ నీళ్ళు ఆపే దమ్ము ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఉందా..! పాలమూరు అల్లుడైన ఉత్తమ్ కుమార్ రెడ్డి పాలమూరుకు ఒక శని. పాలమూరు బిడ్డ అని చెప్పుకునే రేవంత్ రెడ్డి పాలమూరుకు ఒక శని. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నర ఏండ్లు అవుతుంది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో తట్టెడు మట్టి తీయలేదు అని నిరంజన్ రెడ్డి ధ్వజమెత్తారు.
ఉన్న నీళ్లను మనం వాడుకుంటే తప్పేంది..!
రేవంత్ రెడ్డిని బిఆర్ఎస్ ఒక్కటే డిమాండ్ చేస్తుంది. పాలమూరుకు నీళ్ళు ఇచ్చే ఆలోచన ఉందా.. బళ్లెంతో పొడిచే ఆలోచన ఉందా చెప్పాలి. గతంలో కృష్ణాలో అతి తక్కువ నీళ్లను రేవంత్ రెడ్డి ప్రభుత్వం వాడుకుంది. ఎగువన వచ్చే వరదను ఆపుకునే అవకాశం కర్ణాటక రాష్ట్రానికి లేదు. 120 టీఎంసీల సామర్థ్యం గల ఆల్మట్టి ఎప్పుడో నిండిపోయింది. 30 టీఎంసీల సామర్థ్యం గల నారాయణపూర్ ఎప్పుడో నిండిపోయింది. జూరాలకు వరద పోటెత్తింది ఉన్న నీళ్లను మనం వాడుకుంటే తప్పేంది..! ముఖ్యమంత్రి, మంత్రి ఎందుకు నిర్లక్ష్యంగా ఉంటున్నారని ప్రశ్నించారు.
ఏదుల నిండితే వట్టెం నింపుకోవచ్చు..
నార్లపూర్ రిజర్వాయర్ నింపకుండా ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది. కేఎల్ఐ ద్వారా ఏదుల రిజర్వాయర్ నింపొచ్చు.. ఏదుల నిండితే వట్టెం నింపుకోవచ్చు. తక్షణమే కేఎల్ఐ రిజర్వాయర్ నింపాలని బిఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. వరి పంట తగ్గాలనే ఉద్దేశ్యంతోనే ఈ ప్రభుత్వం రైతులకు నీళ్ళు ఇవ్వడం లేదు. ఉద్దేశపూర్వకంగానే రైతులకు ఈ ప్రభుత్వం నీళ్ళు ఇవ్వడం లేదని మాజీ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆదిత్యా నాథ్ దాస్ తెలంగాణ ప్రయోజనాలను పట్టించుకోవడం లేదు
కేఎల్ఐ మూడు పంపులను వెంటనే ప్రారంభించాలని బిఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. ఈ నెల 11న కేటీఆర్ పాలమూరు రాబోతున్నారు. వేల సంఖ్యలో హైదరాబాద్ నుంచి పాలమూరుకు బిఆర్ఎస్ శ్రేణులు బయలుదేరుతారు. అక్కడే మా కార్యచరణ ప్రకటిస్తాం. రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి పాలమూరు ప్రజలకు క్షమాపణలు చెప్పే పరిస్థితి తెచ్చుకోకండి. తెలంగాణ ప్రయోజనాలను ఆంధ్రా ప్రాంతానికి చెందిన నీటి పారుదల శాఖ అధికారులు ఆలోచన చేయడం లేదు. ఆంధ్రా ప్రాంతానికి చెందిన అధికారి ఆదిత్యా నాథ్ దాస్ తెలంగాణ ప్రయోజనాలను పట్టించుకోవడం లేదు అని నిరంజన్ రెడ్డి మండిపడ్డారు.
ఈ ప్రెస్‌మీట్‌లో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, డాక్టర్ మెతుకు ఆనంద్, బీరం హర్షవర్ధన్ రెడ్డి, బీఆర్ఎస్ నేత భాస్కర్ రావు పాల్గొన్నారు.
సంబంధిత వార్తలు

Chamala Kirankumar Reddy | బీఆర్ఎస్ సోషల్ మీడియాకే పరిమితమైంది..
ఆగస్టు 7, 2026

Joginapally Santhosh Kumar | వెంకటాపూర్‌లో గ్రీన్ ఇండియా ఛాలెంజ్.. 2000 వేల మొక్కలు నాటిన సంతోష్‌కుమార్
ఆగస్టు 7, 2026

Bhatti Vikramarka | పెట్టుబడులకు గమ్యస్థానం తెలంగాణ.. కొత్త ఆలోచనలతో రండి.. ప్రభుత్వంతో కలిసి నడవండి: భట్టి విక్రమార్క
ఆగస్టు 7, 2026
తాజావార్తలు
- ●Hyderabad | ఆటో డ్రైవర్ హత్య.. హైడ్రా సహాయంతో సరూర్‌నగర్ చెరువులో కత్తి వెలికితీత
- ●Bhagyashri Borse | రాకా మ్యూజిక్ డైరెక్టర్‌తో భాగ్యశ్రీ బోర్సే స్టెప్పులు - ఒక్క పాటకు రెమ్యూనరేషన్ అన్ని కోట్లా?
- ●Chamala Kirankumar Reddy | బీఆర్ఎస్ సోషల్ మీడియాకే పరిమితమైంది..
- ●Gen Z | జెన్‌జీపై అంత శ్రద్ధ ఉంటే.. అమిత్ షాచేత రాజీనామా చేయించండి.. మోహన్ భగవత్ వ్యాఖ్యలపై కాంగ్రెస్
- ●Drumstick | దానిమ్మ కంటే మునగ కాయలే బెటర్.. ఆ మగాడి టర్నోవర్ ఏడాదికి రూ. 1.15 కోట్లు..!
- ●JSW MG | ఒక్కసారి చార్జింగ్ చేస్తే 1100 కిలోమీటర్ల మైలేజ్.. భారత్‌లో ఎంజీ మోటార్స్ కొత్త ఎలక్ట్రిక్ కారు..

Hyderabad | ఆటో డ్రైవర్ హత్య.. హైడ్రా సహాయంతో సరూర్‌నగర్ చెరువులో కత్తి వెలికితీత

Bhagyashri Borse | రాకా మ్యూజిక్ డైరెక్టర్‌తో భాగ్యశ్రీ బోర్సే స్టెప్పులు - ఒక్క పాటకు రెమ్యూనరేషన్ అన్ని కోట్లా?

Chamala Kirankumar Reddy | బీఆర్ఎస్ సోషల్ మీడియాకే పరిమితమైంది..

Gen Z | జెన్‌జీపై అంత శ్రద్ధ ఉంటే.. అమిత్ షాచేత రాజీనామా చేయించండి.. మోహన్ భగవత్ వ్యాఖ్యలపై కాంగ్రెస్



