Ramchander Rao | ఉద్యోగులకు బెనిఫిట్స్ ఇవ్వరు కానీ.. మీ పత్రికకు వెయ్యికోట్లు ఎట్లిస్తరు!
Ramchander Rao | ఉద్యోగులకు బెనిఫిట్స్ ఇచ్చేందుకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వ వద్ద డబ్బులు లేవు కానీ.. కాంగ్రెస్ పత్రికకు ఇచ్చేందుకు వెయ్యికోట్లు ఉన్నాయా? అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామంచందర్‌రావు ధ్వజమెత్తారు. హైదరాబాద్ ధర్నా చౌక్‌లో ఉద్యోగులకు మద్దతుగా బీజేపీ పార్టీ సోమవారం నిరసన దీక్ష చేపట్టింది.
- ఏం ముఖం పెట్టికొని రాహుల్ తెలంగాణకు వచ్చారు
- కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల్లో ఒకటి అమలు కాలేదు
- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచందర్‌రావు
Ramchander Rao | ఉద్యోగులకు బెనిఫిట్స్ ఇచ్చేందుకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వ వద్ద డబ్బులు లేవు కానీ.. కాంగ్రెస్ పత్రికకు ఇచ్చేందుకు వెయ్యికోట్లు ఉన్నాయా? అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామంచందర్‌రావు ధ్వజమెత్తారు. హైదరాబాద్ ధర్నా చౌక్‌లో ఉద్యోగులకు మద్దతుగా బీజేపీ పార్టీ సోమవారం నిరసన దీక్ష చేపట్టింది. ఈ సందర్భంగా రామచందర్‌రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణలో రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక గడ్డపార, మంత్రులు పారలు పట్టుకొని ఎక్కడ పేదవాళ్ల ఇండ్లను కూలగొట్టాలనే ఆలోచనతోనే బయలుదేరారని విమర్శించారు. రేవంత్ ముఖ్యమంత్రి అయ్యాక మొదలుపెట్టింది హైడ్రాతో పేరుతో ఇండ్లను కూలగొట్టడమేనని.. ఆ తర్వాత మూసీ పక్కన ఉన్న ఇండ్లను కూలగొట్టడం మొదలుపెట్టారని ఆరోపించారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో గుడులను సైతం కూలగొడుతున్నరని మండిపడ్డారు. ఖమ్మం జిల్లా వెలుమగట్లలో 600 కుటుంబాలు పక్కా ఇండ్లు కట్టుకొని నివాసం ఉంటే వాటిని కూలగొట్టారన్నారు. ఈ ప్రభుత్వం కేవలం కూలగొట్టడాలు.. లేకపోతే ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులను తీసుకువచ్చిందన్నారు. అధికారంలోకి రాకముందు ప్రభుత్వ ఉద్యోగులను, రిటైర్డ్ ఉద్యోగులను పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటామని, ఎలాంటి కష్టం లేకుండా చూసుకుంటున్నామని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలో ఇప్పటి వరకు పెన్షనర్స్‌కు, పదవీ విరమణ ఉద్యోగులకు ఒక్క పైసా కూడా రిటైర్‌మెంట్ బెనిఫిట్ ఇవ్వలేకపోయారన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు సమయానికి జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొందన్నారు. ఏదైనా అంటే బహిరంగంగానే డబ్బులు లేవు నేనేం చేయాలంటూ ఉద్యోగులను అంటున్నారని.. మీకు ఉద్యోగులకు జీతాలు, పెన్షనర్లకు పెన్షన్, రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్ ఇచ్చేందుకు డబ్బులు లేవని కాంగ్రెస్ అంటోందని కానీ.. 'నేషనల్ హెరాల్డ్' పత్రికకు కట్టబెట్టడానికి మాత్రం రూ.1000 కోట్లు ఎక్కడినుంచి వచ్చాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రశ్నించారు.
రాష్ట్రంలోని పేదలు, ఉద్యోగుల కంటే మీ పార్టీ పత్రికే మీకు ఎక్కువైందా? రాహుల్ గాంధీకి వెయ్యి కోట్లు ఇస్తారు గానీ.. ప్రభుత్వ ఉద్యోగులకు పైసా ఇవ్వలేని దుస్థితి కాంగ్రెస్ ప్రభుత్వందంటూ మండిపడ్డారు. రాహుల్ గాంధీ ఏం మొఖం పెట్టుకొని వికారాబాద్ వచ్చారని నిలదీశారు. ఎన్నికల సమయంలో గొప్పగా చేవెళ్ల డిక్లరేషన్ పేరు చెప్పి ఎస్సీలను మోసం చేశారని, కామారెడ్డి డిక్లరేషన్ పేరు చెప్పి బీసీలకు అన్యాయం చేశారని ఆరోపించారు. వరంగల్ డిక్లరేషన్ అని రైతులకు అన్యాయం చేశారన్నారు. రైతులకు రైతు భరోసా లేదని, రెండున్నరేళ్లలో రైతుల అకౌంట్లలో ఎంత వరకు రైతు భరోసా చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. చెప్పిన ఆరు గ్యారంటీలు ఒక్కటైనా అమలైందా? అంటూ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ఇచ్చిన మాట తప్పారని.. రాహుల్ వస్తారని ప్రశ్నించారు.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



