త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ramchandar Rao Arrest | బీజేపీ అసెంబ్లీ ముట్ట‌డి తీవ్ర ఉద్రిక్త‌త‌.. రాంచంద‌ర్‌రావు అరెస్ట్‌

Ramchandar Rao Arrest | ఫీజు రీయింబర్స్‌మెంట్ బ‌కాయిల‌పై బీజేపీ చేప‌ట్టిన‌ అసెంబ్లీ ముట్ట‌డి తీవ్ర ఉద్రిక్త‌త‌ల‌కు దారి తీసింది. సోమ‌వారం అసెంబ్లీ స‌మావేశాలు జ‌రుగుతున్న స‌మ‌యంలో యువ‌మోర్చా, బీజేపీ నాయ‌కులు పెద్దఎత్తున త‌ర‌లివ‌చ్చారు.

S

Telangana | Published On Sep 7, 2026, 2.38 pm IST

Ramchandar Rao Arrest | బీజేపీ అసెంబ్లీ ముట్ట‌డి తీవ్ర ఉద్రిక్త‌త‌.. రాంచంద‌ర్‌రావు అరెస్ట్‌
Advertisement

Ramchandar Rao Arrest | త్రినేత్ర‌.న్యూస్‌: ఫీజు రీయింబర్స్‌మెంట్ బ‌కాయిల‌పై బీజేపీ చేప‌ట్టిన‌ అసెంబ్లీ ముట్ట‌డి తీవ్ర ఉద్రిక్త‌త‌ల‌కు దారి తీసింది. సోమ‌వారం అసెంబ్లీ స‌మావేశాలు జ‌రుగుతున్న స‌మ‌యంలో యువ‌మోర్చా, బీజేపీ నాయ‌కులు పెద్దఎత్తున త‌ర‌లివ‌చ్చారు. దీంతో ముందు జాగ్ర‌త్త‌గా పోలీసులు వారిని ఎక్క‌డికక్క‌డే అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. ఈ సంద‌ర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడిని పోలీసులు అరెస్టు చేసి గోల్కొండ పోలీస్ స్టేష‌న్‌కు త‌ర‌లించారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం పోరాడితే అరెస్ట్ చేస్తున్నారని ఈ సంద‌ర్భంగా రాంచంద‌ర్‌రావు మండిప‌డ్డారు.

ఫీజు బ‌కాయిలు ఇచ్చేవ‌ర‌కు పోరాటం..

ఈ సంద‌ర్భంగా గోల్కొండ పీస్‌లో రాంచంద‌ర్‌రావు మాట్లాడారు. ధర్నా చౌక్ లో విద్యార్థుల ధ‌ర్నాకు డీసీపీ మా ప‌ర్మిష‌న్‌ను నిరాక‌రించారు. అందుకే అసెంబ్లీ ముట్ట‌డి పెట్టుకున్నాం. చాలా మంది బీజేపీ నాయ‌కుల‌ను అరెస్టు చేశారు. చాలా మందికి గాయాల‌య్యాయి. ఇద్ద‌రుముగ్గురు హాస్పిట‌ల్‌లో ఉన్నారు. కార్పొరేట‌ర్‌ స‌ర‌ళ ఐసీయూలో ఉన్నారు. యువ‌మోర్చా, బీజేపీ నాయ‌కుల‌ను అడ్డుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. దీన్ని ఖండిస్తున్నాం. ఫీజు బ‌కాయిలపై అనేక రోజులుగా డిమాండ్ చేస్తున్నాం. 8 ల‌క్ష‌ల మంది విద్యార్థుల సంత‌కాలు సేక‌రించాం. సీఎంకు అవి ఇద్దామంటే ఆయ‌న టైం ఇవ్వ‌లేదు. ధ‌ర్నాకు ప‌ర్మిష‌న్ అడిగితే అనుమ‌తి ఇవ్వ‌లే. రాష్ట్రంలో పోలీసు రాజ్యం న‌డుస్తుంది. ప్ర‌జాస్వామ్య ప‌ద్ధ‌తిలో పోరాటం చేస్తుంటే అనుమ‌తి ఎందుకు ఇవ్వ‌ట్లేదు.

దాదాపు 600 మంది అరెస్టు అయ్యారు. గోల్కొండ పీస్‌లో దాదాపు 55 మందిమి ఉన్నాం. ఈ అరెస్టును ఖండిస్తున్నాం. కాంగ్రెస్ పాల‌న‌కు వ్య‌తిరేకంగా పోరాటం చేస్తాం. ఫీజు బ‌కాయిలు వాళ్లు ఒప్పుకునే వ‌ర‌కు పోరాటం కొన‌సాగిస్తం. ప్ర‌భుత్వ తీరును, అణ‌చివేత ధోర‌ణిని తీవ్రంగా ఖండిస్తున్నాం అని రాంచంద‌ర్‌రావు పేర్కొన్నారు.

Advertisement
Advertisement