Rajanna Sircilla | పీఎంశ్రీ అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి.. ఇన్‌చార్జి కలెక్టర్ గరిమ ఆదేశాలు..
Rajanna Sircilla | జిల్లాలో పీఎంశ్రీ కింద ఎంపిక అయిన స్కూళ్లలో మొదలు పెట్టిన అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఇన్‌చార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. పీఎంశ్రీ కింద ఎంపిక అయిన విద్యాలయాల్లో చేపట్టిన అభివృద్ధి పనులపై జిల్లా సమీకృత కార్యాలయంలో శుక్రవారం జిల్లా విద్యాధికారి, టీజీఈడబ్ల్యూఐడీసీ అధికారులతో ఇంచార్జి కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
Rajanna Sircilla | జిల్లాలో పీఎంశ్రీ కింద ఎంపిక అయిన స్కూళ్లలో మొదలు పెట్టిన అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఇన్‌చార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. పీఎంశ్రీ కింద ఎంపిక అయిన విద్యాలయాల్లో చేపట్టిన అభివృద్ధి పనులపై జిల్లా సమీకృత కార్యాలయంలో శుక్రవారం జిల్లా విద్యాధికారి, టీజీఈడబ్ల్యూఐడీసీ అధికారులతో ఇంచార్జి కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. పీఎంశ్రీ కింద జిల్లాలో మొత్తం 16 విద్యాలయాలు ఎంపిక అయ్యాయని, వాటిలో అదనపు తరగతి గదులు, కంప్యూటర్ ల్యాబ్‌లు, సైన్స్ ల్యాబ్‌లు, లైబ్రరీలు, వర్షం నీరు ఇంకుడు గుంతలు ఇతర నిర్మాణాలు ఉన్నాయని ఇంచార్జి కలెక్టర్ దృష్టికి అధికారులు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కలెక్టర్ పీఎంశ్రీ కింద ఎంపికైన విద్యాలయాల్లో ఒక ప్రణాళిక ప్రకారం అభివృద్ధి పనులు పూర్తి చేయాలని, విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు. ఆయా స్కూళ్లలో పనులను జిల్లా విద్యాధికారి పరిశీలించాలని ఆదేశించారు. కస్తూర్భాగాంధీ బాలిక విద్యాలయాల్లో చేపట్టిన పనులను పూర్తి చేయాలని సూచించారు. సమీక్షలో జిల్లా విద్యాధికారి జగన్ మోహన్ రెడ్డి, టీజీఈడబ్ల్యూఐడీసీ డీఈ సత్యనారాయణ రావు, ఏఈలు నాగరాజు, అశోక్ కుమార్, అధికారులు ఉన్నారు.
పునవాస పథకానికి ఇంటర్వ్యూలు
ఆర్థిక పునరావాస సహాయ పథకానికి సంబంధించి జిల్లాలోని ఆయా మండలాల నుంచి దరఖాస్తు చేసుకున్న దివ్యాంగులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. దివ్యాంగుల ఆర్థిక సహాయ పునరావాస పథకం కింద జిల్లాకు 14 యూనిట్లు మంజూరు కాగా ఒక్కో యూనిట్ విలువ రూ.50వేలు ఉంటుంది. ఇందులో వందశాతం రాయితీ వస్తుంది. జిల్లాలోని ఆయా మండలాలకు చెందిన 38 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో శుక్రవారం కలెక్టర్ ఇంటర్వ్యూలు నిర్వహించారు. 37 మంది దివ్యాంగులు హాజరుకాగా, వారికి సంబంధించిన సర్టిఫికెట్లు, అర్హతలు పరిశీలించి వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు. డీఆర్డీఓ గీత, డీడబ్ల్యూఓ లక్ష్మీరాజం, ఎస్సీ కార్పొరేషన్ అధికారి స్వప్న, ఏవో మెప్మా మీర్జా ఫసహత్ అలీ బేగ్ పాల్గొన్నారు.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






