త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rains | చ‌ల్ల‌ని క‌బురు.. మ‌రో వారం రోజులు వాన‌లే వాన‌లు..!

Rains | మండుటెండ‌ల‌కు ఉక్కిరిబిక్కిరి అవుతున్న తెలంగాణ ప్ర‌జ‌ల‌కు వాతావ‌ర‌ణ శాఖ చ‌ల్ల‌ని క‌బురు అందించింది. మ‌రో వారం రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా తేలిక‌పాటి నుంచి మోస్త‌రు వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం సోమ‌వారం వెల్ల‌డించింది.

S

Telangana | Published On Apr 20, 2026, 6.17 pm IST

Rains | చ‌ల్ల‌ని క‌బురు.. మ‌రో వారం రోజులు వాన‌లే వాన‌లు..!
Advertisement

Rains | త్రినేత్ర‌.న్యూస్ : మండుటెండ‌ల‌కు ఉక్కిరిబిక్కిరి అవుతున్న తెలంగాణ ప్ర‌జ‌ల‌కు వాతావ‌ర‌ణ శాఖ చ‌ల్ల‌ని క‌బురు అందించింది. మ‌రో వారం రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా తేలిక‌పాటి నుంచి మోస్త‌రు వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం సోమ‌వారం వెల్ల‌డించింది. భారీ ఈదురుగాలులు వీచే అవ‌కాశం ఉంద‌న్నారు. ఈ నేప‌థ్యంలో రైతులు అప్ర‌మ‌త్తం కావాల‌న్నారు. వ‌ర్షాల నుంచి త‌మ పంట‌ల‌ను కాపాడుకునేందుకు రైతులు చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు.

వ‌చ్చే వారం రోజుల పాటు సాయంత్రం స‌మ‌యానికి ఒక‌ట్రెండు డిగ్రీల మేర ఉష్ణోగ్ర‌త‌లు త‌గ్గే అవ‌కాశం ఉంది. 20 జిల్లాల్లో 40 డిగ్రీల నుంచి 44 డిగ్రీల సెల్సియ‌స్ వర‌కు ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదయ్యే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది.

మంగ‌ళ‌వారం నాడు భ‌ద్రాద్రి కొత్త‌గూడెం, ఖ‌మ్మం, మ‌హ‌బూబాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల‌కు ఆరెంజ్ అల‌ర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాలో 40 నుంచి 50 కిలోమీట‌ర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవ‌కాశం ఉంది. తీవ్ర‌మైన ఉరుముల‌తో కూడిన వ‌ర్షం కురిసే అవ‌కాశం ఉంద‌ని అధికారులు వెల్ల‌డించారు. ఇక ప‌లు ప్రాంతాల్లో తేలిక‌పాటి నుంచి మోస్త‌రు వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంది.

ఇక రాబోయే మూడు నుంచి నాలుగు రోజుల పాటు ప‌లు జిల్లాల‌కు ఎల్లో అల‌ర్ట్ జారీ చేశారు. ఆదిలాబాద్, హ‌నుమ‌కొండ‌, హైద‌రాబాద్, జ‌న‌గామ‌, గ‌ద్వాల‌, కామారెడ్డి, ఆసిఫాబాద్, మ‌హ‌బూబాబాద్, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్, మంచిర్యాల‌, మెద‌క్, మ‌ల్కాజ్‌గిరి, నాగ‌ర్‌క‌ర్నూల్‌, న‌ల్ల‌గొండ‌, నారాయ‌ణ‌పేట‌, నిర్మ‌ల్, నిజామాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట‌, సూర్యాపేట‌, వికారాబాద్, వ‌న‌ప‌ర్తి, వ‌రంగ‌ల్‌, యాదాద్రి జిల్లాల‌కు ఎల్లో అల‌ర్ట్ జారీ చేశారు.

Advertisement
Advertisement