త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Weather Update | రాష్ట్రంలో నేటి నుంచి 20 వ‌ర‌కు భారీ వ‌ర్షాలు.. త‌గ్గ‌నున్న గ‌రిష్ఠ ఉష్ణోగ్ర‌త‌లు

Weather Update | రాష్ట్రంలో ఎండ‌లు దంచికొడుతున్నాయి. ఉష్ణోగ్ర‌త‌లు 40 డిగ్రీలు దాటాయి. దీంతో తీవ్ర వేడి, ఉక్క‌పోత‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న ప్ర‌జ‌ల‌కు వాతావ‌ర‌ణ శాఖ (Weather Update) చ‌ల్ల‌ని క‌బురు అందించింది. రాష్ట్రంలో ఆదివారం నుంచి 20వ తేదీ వరకు భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని తెలిపింది.

G

Telangana | Published On Mar 15, 2026, 9.42 am IST

Weather Update | రాష్ట్రంలో నేటి నుంచి 20 వ‌ర‌కు భారీ వ‌ర్షాలు.. త‌గ్గ‌నున్న గ‌రిష్ఠ ఉష్ణోగ్ర‌త‌లు
Advertisement

Weather Update | త్రినేత్ర‌.న్యూస్‌: రాష్ట్రంలో ఎండ‌లు దంచికొడుతున్నాయి. ఉష్ణోగ్ర‌త‌లు 40 డిగ్రీలు దాటాయి. దీంతో తీవ్ర వేడి, ఉక్క‌పోత‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న ప్ర‌జ‌ల‌కు వాతావ‌ర‌ణ శాఖ (Weather Update) చ‌ల్ల‌ని క‌బురు అందించింది. రాష్ట్రంలో ఆదివారం నుంచి 20వ తేదీ వరకు భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని తెలిపింది. ఈనెల 15 నుంచి 17వర‌కు ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మెదక్‌, సిద్దిపేట, సంగారెడ్డి, వికారాబాద్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయ‌ని వెల్ల‌డిచింది.

ఈనెల 16 నుంచి 20 వ‌ర‌కు ప‌లు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, పిడుగులు, ఈదురు గాలులతో కూడిన వడగళ్ల వానలు పడే అవకాశముందని తెలిపింది. వ‌ర్షాల నేప‌థ్యంలో రానున్న‌ ఐదు రోజుల పాటు గరిష్ఠ ఉష్ణోగ్రతలు 3 నుంచి 4 డిగ్రీలు తగ్గే అవకాశముందని చెప్పింది.

Advertisement
Advertisement