Rain Update | రాష్ట్రంలో మూడు రోజులు మోస్తరు వర్షాలు.. జైనాధ్‌లో అత్యధిక ఉష్ణోగ్రత
Rain Update | రాష్ట్రంలో మూడు రోజులపాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం (IMD Hyderabad) తెలిపింది. శని, ఆది, సోమవారాల్లో పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వాన పడుతుందని వెల్లడించింది.
Rain Update | త్రినేత్ర.న్యూస్: రాష్ట్రంలో మూడు రోజులపాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం (IMD Hyderabad) తెలిపింది. శని, ఆది, సోమవారాల్లో పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వాన పడుతుందని వెల్లడించింది. గాలి గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీస్తుందని చెప్పింది.
శనివారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, జనగామ, సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో పలు చోట్ల కురిసే సూచనలు ఉన్నట్లు పేర్కొంది. ఇక ఆదివారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల,
నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, జనగాం, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ వాన కురిసేఅవకాశం ఉంది. అదేవిధంగా సోమవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల,
జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో వర్షం పడుతుందని తెలిపింది.
శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా జైనధ్‌లో (Jainath) రాష్ట్రంలోనే అత్యధికంగా 40.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయింది. నల్గొండ జిల్లా నేరేడుగొమ్ములో 40.1, ములుగు జిల్లా మంగపేటలో 39.7 డిగ్రీలు, భద్రాచలంలో 37.6, మహబూబ్‌నగర్‌లో 38, ఖమ్మం 36.8, నల్లగొండ 36.5, హకీంపేట, దుండిగల్‌లో 35.1, హనుమకొండలో 35, హయత్‌నగర్‌లో 34 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



