త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TG Weather | తెలంగాణలో రాగల ఐదురోజులు వర్షాలు.. హెచ్చరించిన వాతావరణశాఖ..!

TG Weather | తెలంగాణలో రాగల ఐదురోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏపీ తీరం వెంట సగటు సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని పేర్కొంది.

P

Telangana | Published On Mar 13, 2026, 5.52 pm IST

TG Weather | తెలంగాణలో రాగల ఐదురోజులు వర్షాలు.. హెచ్చరించిన వాతావరణశాఖ..!
Advertisement

TG Weather | తెలంగాణలో రాగల ఐదురోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏపీ తీరం వెంట సగటు సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని పేర్కొంది. ఈ క్రమంలో రాబోయే రెండురోజుల్లో ఉష్ణోగ్రతల్లో ఎలాంటి మార్పులు ఉండవని తెలిపింది. ఈ నెల 15న ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, ఆసిఫాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.

ఈ మేరకు ఆయా జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది. 16న ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, హైదరాబాద్‌, వరంగల్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌ జిల్లాల్లో అక్కడక్కడ ఈదురుగాలులతో కూడిన వానలు కురుస్తాయని పేర్కొంది. 17న ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిర్మల్‌, భూపాలపల్లి, ములుగు, సూర్యాపేట, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, నాగర్‌ కర్నూల్‌ జిల్లాల్లో వర్షాలు పడే సూచనలున్నాయని చెప్పింది. ఈ నెల 18, 19 తేదీల్లో పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడుతాయని వివరించింది.

Advertisement
Advertisement