Harish Rao | రాహుల్‌జీ.. మిగతా వారితో రాజీనామా చేయించి ప్రజా తీర్పును కోరండి
Harish Rao | దానం నాగేందర్ అనర్హతను సమర్థిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు.. రాజ్యాంగ పరిరక్షణ గురించి పదే పదే మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరిని ప్రశ్నిస్తోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు వ్యాఖ్యానించారు.
- “సంవిధాన్ బచావో” మాటలను ఆచరణలో చూపించాల్సిన సమయమొచ్చింది
- సుప్రీంకోర్టు తీర్పు కాంగ్రెస్ ద్వంద్వ వైఖరిని ప్రశ్నిస్తోంది
- మాజీ మంత్రి హరీశ్‌రావు
Harish Rao | త్రినేత్ర న్యూస్: దానం నాగేందర్ అనర్హతను సమర్థిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు.. రాజ్యాంగ పరిరక్షణ గురించి పదే పదే మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరిని ప్రశ్నిస్తోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా “సంవిధాన్ బచావో” అంటూ రాజ్యాంగ పరిరక్షణ గురించి మాట్లాడుతున్నారని.. ఇప్పుడు ఆ మాటలను ఆచరణలో చూపించాల్సిన సమయం వచ్చిందన్నారు. మిగతా ఎనిమిది మంది ఎమ్మెల్యేలను రాజీనామా చేయించి ప్రజా తీర్పును కోరాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు.
అది రాజకీయ నినాదమా? రాజ్యాంగ నిబద్ధతా?
దానం నాగేందర్ అనర్హతపై సుప్రీంకోర్టు తీర్పు కాంగ్రెస్ ద్వంద్వ వైఖరికి చెంపపెట్టు. రాజ్యాంగంపై రాహుల్ గాంధీకి నిజమైన నిబద్ధత ఉంటే.. కాంగ్రెస్‌లోకి పార్టీ ఫిరాయించిన మిగతా ఎమ్మెల్యేలతో కూడా రాజీనామా చేయించి, ప్రజల తీర్పు కోరాలని ఆయన డిమాండ్ చేయాలి. ఢిల్లీలో రాజ్యాంగ నైతికత గురించి మాట్లాడుతున్న రాహుల్ గాంధీ.. తెలంగాణలో తమ పార్టీ అనుసరిస్తున్న ఫిరాయింపుల రాజకీయాలపై ఎందుకు మౌనం వహిస్తున్నారు? “సంవిధాన్ బచావో” అనేది కేవలం రాజకీయ నినాదమా? లేక నిజమైన రాజ్యాంగ నిబద్ధతా? రాహుల్ గాంధీ స్పష్టం చేయాలి.
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి తిరిగి ప్రజాక్షేత్రంలోకి పంపాలి అని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.
తాజావార్తలు
- ●Abhijeet Dipke | జ్ఞానేష్ కుమార్ అతిపెద్ద దేశద్రోహి.. ఆయన వెంటనే రాజీనామా చేయాలి : అభిజీత్ దిప్కే
- ●Danam Nagender | 'దానం' పదోసారి పోటీ..! ఈ ఉప ఎన్నిక కలిసొచ్చేనా..?
- ●IIT IIM Graduates Mushroom Farming | అమెరికాలో లగ్జరీ జాబ్ వదిలేశారు.. పుట్టగొడుగుల సాగుతో కోట్లు ఆర్జిస్తున్న ఐఐటీ, ఐఐఎం టెకీలు
- ●NSUI Venkata Swamy | బల్మూరి వెంకట్ నన్ను వివక్షకు గురి చేస్తున్నడు
- ●AI Job Cuts | 15 ఏళ్ల ఐటీ అనుభవం.. ఒక్క క్షణంలో గాల్లోకి: ఏఐ దెబ్బకు ఉద్యోగం కోల్పోయిన భారతీయ టెకీ
- ●Net Worth | రూ.1 కోటి ఉంటే బ్యాంకులో ఎంత నగదు ఉంచాలి? ఈ లెక్క తెలుసుకోండి..

Abhijeet Dipke | జ్ఞానేష్ కుమార్ అతిపెద్ద దేశద్రోహి.. ఆయన వెంటనే రాజీనామా చేయాలి : అభిజీత్ దిప్కే

Danam Nagender | 'దానం' పదోసారి పోటీ..! ఈ ఉప ఎన్నిక కలిసొచ్చేనా..?

IIT IIM Graduates Mushroom Farming | అమెరికాలో లగ్జరీ జాబ్ వదిలేశారు.. పుట్టగొడుగుల సాగుతో కోట్లు ఆర్జిస్తున్న ఐఐటీ, ఐఐఎం టెకీలు

NSUI Venkata Swamy | బల్మూరి వెంకట్ నన్ను వివక్షకు గురి చేస్తున్నడు





