త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

NSUI Venkata Swamy | బ‌ల్మూరి వెంక‌ట్ నన్ను వివ‌క్ష‌కు గురి చేస్తున్న‌డు

NSUI Venkata Swamy | ఎమ్మెల్సీ బ‌ల్మూరి వెంక‌ట్ త‌న‌ను, త‌న క‌మిటీని వివ‌క్ష‌కు గురిచేస్తున్నాడ‌ని ఎన్ఎస్‌యూఐ రాష్ట్ర అధ్య‌క్షుడు య‌డ‌వ‌ల్లి వెంక‌ట‌స్వామి ఆరోపించారు.

S

Telangana | Published On Sep 24, 2026, 3.41 pm IST

NSUI Venkata Swamy | బ‌ల్మూరి వెంక‌ట్ నన్ను వివ‌క్ష‌కు గురి చేస్తున్న‌డు
Advertisement
  • కాంగ్రెస్‌ అధిష్టానానికి ఫిర్యాదు చేసిన ఎన్ఎస్‌యూఐ రాష్ట్ర అధ్య‌క్షుడు య‌డ‌వ‌ల్లి వెంక‌ట‌స్వామి

NSUI Venkata Swamy | త్రినేత్ర న్యూస్: ఎమ్మెల్సీ బ‌ల్మూరి వెంక‌ట్ త‌న‌ను, త‌న క‌మిటీని వివ‌క్ష‌కు గురిచేస్తున్నాడ‌ని ఎన్ఎస్‌యూఐ రాష్ట్ర అధ్య‌క్షుడు య‌డ‌వ‌ల్లి వెంక‌ట‌స్వామి ఆరోపించారు. సోష‌ల్ మీడియాలో త‌న‌కు వ్య‌తిరేకంగా పోస్టులు పెట్టిస్తున్నార‌ని వాపోయారు. విద్యార్థి నాయ‌కుల‌ను త‌న‌పైకి ఉసిగొలుపుతున్నార‌న్నారు. ఈమేర‌కు గురువారం కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదు చేసిన‌ట్లు తెలిపారు.

అగ్రకుల దొర అహంకారంతో ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ నన్ను, నా కమిటీని నిరంతరం వివక్షకు గురిచేస్తున్నాడు. NSUIలో తన పెత్తనమే సాగాలనే సంకుచిత మనస్తత్వంతో అగ్రకుల విద్యార్థి నాయకులను ఉసిగొలుపుతున్నారు. గాంధీ భవన్లో నన్ను తొలగించాలని చేపట్టిన నిరసన ప్రదర్శనతో మొదలుకొని, కొందరు దళితులను నాకు వ్యతిరేకంగా నిలబెట్టి తన రాజకీయ పబ్బం గడప‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నారు. మీడియాలో, సోషల్ మీడియాలో నాకు వ్యతిరేకంగా కథానాలు ప్రచారం చేయడం వంటి ఎన్నెన్నో కుతంత్రాలకు తెర తీశాడు అంటూ ఆరోప‌ణ‌లు చేశారు.

Advertisement
Advertisement