త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rahul Gandhi | అనంత‌గిరి హిల్స్‌లో కాంగ్రెస్ పీఏసీ స‌మావేశం.. హాజ‌రైన రాహుల్‌

Rahul Gandhi | వికారాబాద్ జిల్లా అనంత‌గిరి హిల్స్‌లో జ‌రుగుతున్న కాంగ్రెస్ (Congress) రాజ‌కీయ వ్య‌వ‌హారాల క‌మిటీ (PAC) స‌మావేశం కొన‌సాగుతున్న‌ది. ఈ కార్యాక్ర‌మానికి పార్టీ అగ్ర‌నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు.

G

Telangana | Published On Mar 2, 2026, 12.37 pm IST

Rahul Gandhi | అనంత‌గిరి హిల్స్‌లో కాంగ్రెస్ పీఏసీ స‌మావేశం.. హాజ‌రైన రాహుల్‌
Advertisement

Rahul Gandhi | త్రినేత్ర‌.న్యూస్‌: వికారాబాద్ జిల్లా అనంత‌గిరి హిల్స్‌లో జ‌రుగుతున్న కాంగ్రెస్ (Congress) రాజ‌కీయ వ్య‌వ‌హారాల క‌మిటీ (PAC) స‌మావేశం కొన‌సాగుతున్న‌ది. ఈ కార్యాక్ర‌మానికి పార్టీ అగ్ర‌నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. పార్టీ బ‌లోపేతానికి క్షేత్ర‌స్థాయిలో తీసుకోవాల్సిన చ‌ర్య‌లు, పార్టీ కార్య‌క్ర‌మాల నిర్వ‌హణ త‌దిత‌ర అంశాల‌పై నేత‌ల‌తో రాహుల్ చ‌ర్చించారు.

గ‌త పది రోజులుగా కొన‌సాగుతున్న‌ తెలంగాణ, ఏపీ డీసీసీ అధ్యక్షుల శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమానికి రాహుల్ హాజ‌రుకానున్నారు. నేత‌ల‌కు దిశానిర్దేశం చేయ‌నున్నారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంపై సూచనలు చేస్తారు. ఈ కార్య‌క్ర‌మంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌, కేసీ వేణుగోపాల్‌, కాంగ్రెస్ రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇన్‌చార్జ్ మీనాక్షి న‌ట‌రాజ‌న్‌, పీసీసీ చీఫ్‌లు మ‌హేశ్ గౌండ్‌, ష‌ర్మిల‌, ముఖ్య‌నేత‌లు హాజ‌ర‌య్యారు. అంత‌కుముందు శంషాబాద్‌కు చేరుకున్న రాహుల్ గాంధీకి సీఎం రేవంత్‌, భువ‌న‌గిరి ఎంపీ కిర‌ణ్‌ కుమార్ రెడ్డి ఘ‌నంగా స్వాగ‌తం ప‌లికారు.

https://x.com/INCTelangana/status/2028350078604505528

మ‌రోవైపు రాహుల్ గాంధీని అడ్డుకుంటారనే నెపంతో వికారాబాద్‌లో ప‌లువురు నిరుద్యోగులతోపాటు, జాగృతి నాయ‌కుల‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల చ‌ర్య‌ను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) ఖండించారు. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న హామీని నిలబెట్టుకోలేని కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీ పర్యటనను అడ్డుకుంటారని నిరుద్యోగులను ఆదివారం రాత్రి అరెస్టు చేయడం దుర్మార్గమ‌న్నారు.

`తెలంగాణ జాగృతి యువజన విభాగం నాయకులతో పాటు పెద్ద సంఖ్యలో నిరుద్యోగులను ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేసింది.. మీ నాయకులను అడ్డుకుంటారని నిరుద్యోగులను అరెస్ట్ చేయడం దుర్మార్గం కాదా.. మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చండి.. జాబ్ క్యాలెండర్ ప్రకటించండి.. 2 లక్షల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభించండి.. అరెస్ట్ చేసిన నిరుద్యోగులను వెంటనే విడుదల చేయండి` అని క‌విత డిమాండ్ చేశారు.

https://x.com/RaoKavitha/status/2028309249999474968

 

Advertisement
Advertisement