త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ramchander Rao | కార్ఖానా ఖ‌రీదైన అర్బ‌న్ ప్రాంతం.. ప‌రిహారం పెంచాల్సిందే : ఎన్ రాంచందర్ రావు

Ramchander Rao | రాజీవ్ రహదారి విస్తరణ ప్రాజెక్టులో భూములు, ఇళ్లు, భవనాలు కోల్పోతున్న బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం న్యాయమైన పరిహారం అందించాలని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు డిమాండ్ చేశారు.

S

Hyderabad | Published On Aug 11, 2026, 2.47 pm IST

Ramchander Rao | కార్ఖానా ఖ‌రీదైన అర్బ‌న్ ప్రాంతం.. ప‌రిహారం పెంచాల్సిందే : ఎన్ రాంచందర్ రావు
Advertisement

Ramchander Rao | త్రినేత్ర‌.న్యూస్ : రాజీవ్ రహదారి విస్తరణ ప్రాజెక్టులో భూములు, ఇళ్లు, భవనాలు కోల్పోతున్న బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం న్యాయమైన పరిహారం అందించాలని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు డిమాండ్ చేశారు. కార్ఖానాలో బాధితులు నిర్వహించిన ఆందోళనలో ఆయన పాల్గొని వారికి బీజేపీ తరఫున సంఘీభావం తెలిపారు. రోడ్డు విస్తరణ కోసం భూములు, ఇళ్లు, భవనాలు కోల్పోతున్న ప్రజలు అభివృద్ధికి వ్యతిరేకం కాదని రాంచందర్ రావు స్పష్టం చేశారు. ప్రజా ప్రయోజనం కోసం చేపడుతున్న ఈ ప్రాజెక్టుకు అందరూ సహకరిస్తున్నారని, అయితే తమ ఆస్తులను త్యాగం చేస్తున్న ప్రజలకు సరైన విలువతో కూడిన న్యాయమైన పరిహారం అందాల్సిన అవసరం ఉందన్నారు.

తూంకుంట ప్రాంతంలో భూముల పరిహారాన్ని పెంచిన విధంగా, రాజీవ్ రహదారి విస్తరణలో ఆస్తులు కోల్పోతున్న కార్ఖానా ప్రాంత ప్రజలకు కూడా తగిన మేర పరిహారం పెంచాలని ఆయన కోరారు. తూంకుంటలో పెంచిన పరిహారం కంటే ఈ ప్రాంతం మరింత ఖరీదైన అర్బన్ ప్రాంతమని, అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ తక్కువ పరిహారం ఇవ్వడం సమంజసం కాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తూంకుంటలో ఏ మేరకు పరిహారం పెంచిందో, అదే విధంగా ఇక్కడ కూడా సముచితమైన శాతం మేర పరిహారం పెంచి బాధితులకు న్యాయం చేయాలని రాంచందర్ రావు డిమాండ్ చేశారు. ప్రజా ప్రయోజనం కోసం తమ భూములు, ఇళ్లు, ఆస్తులను త్యాగం చేస్తున్న బాధితుల త్యాగాన్ని ప్రభుత్వం గుర్తించాలని, వారికి న్యాయమైన పరిహారం అందించడం ద్వారా వారి పట్ల న్యాయం చేయాలని ఆయన అన్నారు. బాధితులు చేస్తున్న న్యాయమైన డిమాండ్‌కు భారతీయ జనతా పార్టీ పూర్తిగా మద్దతు ఇస్తుందని రాంచందర్ రావు స్పష్టం చేశారు.

Advertisement
Advertisement