త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Vakiti Srihari | నాణ్యమైన ఆహారం అందించడమే లక్ష్యం : మంత్రి వాకిటి శ్రీ‌హ‌రి

Vakiti Srihari | ప్రజలకు నాణ్యమైన, పరిశుభ్రమైన చేపల ఆహారాన్ని అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని పశుసంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్య, యువజన సర్వీసులు, క్రీడల శాఖల మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. చేపల్లో అధిక ప్రొటీన్లు, పోషక విలువలు ఉంటాయని.. ఆరోగ్యకరమైన ఆహారంలో చేప‌ల‌ను తీసుకోవ‌డం పెంచాల‌ని సూచించారు.

P

Telangana | Published On Jul 31, 2026, 6.53 pm IST

Vakiti Srihari | నాణ్యమైన ఆహారం అందించడమే లక్ష్యం : మంత్రి వాకిటి శ్రీ‌హ‌రి
Advertisement

Vakiti Srihari | ప్రజలకు నాణ్యమైన, పరిశుభ్రమైన చేపల ఆహారాన్ని అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని పశుసంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్య, యువజన సర్వీసులు, క్రీడల శాఖల మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. చేపల్లో అధిక ప్రొటీన్లు, పోషక విలువలు ఉంటాయని.. ఆరోగ్యకరమైన ఆహారంలో చేప‌ల‌ను తీసుకోవ‌డం పెంచాల‌ని సూచించారు. రాష్ట్ర మత్స్యశాఖ ప్రధాన కార్యాలయాన్ని మంత్రి వాకిటి శ్రీహరి శుక్రవారం తొలిసారిగా సందర్శించారు. మాసబ్‌ట్యాంక్‌లోని కార్యాలయానికి చేరుకున్న ఆయనకు మత్స్యశాఖ డైరెక్టర్‌ నిఖిల, అదనపు డైరెక్టర్‌ మురళీకృష్ణ, ఇతర అధికారులు స్వాగతం పలికారు. అనంతరం మత్స్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఫిష్‌ క్యాంటీన్‌ను మంత్రి పరిశీలించారు. అక్కడి వంటగది, పరిసరాల పరిశుభ్రత, ఆహార నాణ్యత, వినియోగదారులకు అందుతున్న సేవలను స్వయంగా పరిశీలించారు. క్యాంటీన్‌లో అందుబాటులో ఉన్న చేపల వంటకాలు, మెనూ వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

నాణ్యత విషయంలో రాజీ వద్దు

ఫిష్‌ క్యాంటీన్‌లో వినియోగదారులకు అందించే ఆహార పదార్థాల విషయంలో నాణ్యత ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. పరిశుభ్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని.. ప్రజలకు ఆరోగ్యకరమైన, సురక్షితమైన ఆహారం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. చేప‌ల్లో అధిక ప్రొటీన్లు, శరీరానికి అవసరమైన పలు పోషకాలు కలిగిన ఆహారమని మంత్రి పేర్కొన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండే ధరల్లో నాణ్యమైన చేపల వంటకాలను అందించడం ద్వారా ఫిష్‌ క్యాంటీన్‌లకు మరింత ఆదరణ తీసుకురావాలని అన్నారు. ఫిష్‌ క్యాంటీన్‌ సేవలను రాష్ట్రంలోని మరింత మంది ప్రజలకు అందుబాటులోకి తీసుకెళ్లేలా చర్యలు చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు. అవసరమైన చోట్ల ఇలాంటి క్యాంటీన్‌లను విస్తరించే అవకాశాలను పరిశీలించాలని సూచించారు. మాసబ్‌ట్యాంక్‌ ఫిష్‌ క్యాంటీన్‌ను ఆధునిక సౌకర్యాలతో మరింత అభివృద్ధి చేసి.. వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. క్యాంటీన్‌ నిర్వహణ, పరిశుభ్రత, ఆహార నాణ్యతపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని మంత్రి స్పష్టం చేశారు.

Advertisement
Advertisement