Puligundala | ప్రకృతి అందాలకు నెలవు ‘పులిగుండాల’.. ఎక్కడుందో తెలుసా..?
Puligundala | తెలంగాణ రాష్ట్ర పర్యాటక ప్రాంతాలకు ప్రసిద్ధి గాంచింది. రాష్ట్రం నలుమూలాల అనేక పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. తాజాగా ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం బ్రాహ్మళ్లకుంట పరిధిలోని పులిగుండాల ఎకో టూరిజం ప్రాజెక్టును, జంగిల్ సఫారీ, బోటింగ్‌ను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి ప్రారంభించారు.
Puligundala | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణ రాష్ట్ర పర్యాటక ప్రాంతాలకు ప్రసిద్ధి గాంచింది. రాష్ట్రం నలుమూలాల అనేక పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. తాజాగా ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం బ్రాహ్మళ్లకుంట పరిధిలోని పులిగుండాల ఎకో టూరిజం ప్రాజెక్టును, జంగిల్ సఫారీ, బోటింగ్‌ను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కనకగిరి గుట్టల్లోని అద్భుతమైన ప్రకృతి ఒడిలోని పులిగుండాల ప్రదేశాలను మంత్రులు, అధికారులు సందర్శించారు.

తెలంగాణలోని అపురూపమైన ప్రకృతి సంపదను ప్రపంచానికి పరిచయం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. భవిష్యత్తులో తప్పకుండా పులి గుండాలను అన్ని రకాల హంగులతో తీర్చిదిద్ది రాష్ట్రంలోని మొదటి మూడు ఉత్తమ పర్యాటక కేంద్రాలలో ఒకటిగా నిలబెడతాం. రాష్ట్రంలోనే ఎలాంటి కాలుష్యం లేని ప్రదేశం. పర్యాటకుల రాకపోకలకు వీలుగా మార్గాన్ని వెంటనే డబుల్ రోడ్డుగా అభివృద్ధి చేసేందుకు అనుమతులు మంజూరు చేస్తాం. మిగిలిన పనులకు కావాల్సిన నిధులను ప్రభుత్వం తప్పకుండా విడుదల చేస్తుంది. కనకగిరి హిల్స్ అభివృద్ధికి తక్షణమే కార్యాచరణ ప్రారంభించాలని అధికారులను ఆదేశించామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.

ప్రతిష్టాత్మకంగా సీతారామ ప్రాజెక్టును పూర్తి చేసే దిశగా ప్రభుత్వం పనిచేస్తోంది. ఈ ప్రాజెక్ట్ నుంచి పులిగుండాలకు నీటిని మళ్లించే సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేస్తాం. తద్వారా వేసవిలోనూ ఈ ప్రాంతం జలకళతో ఉట్టిపడుతుంది. పర్యాటక రంగానికి ఊతమివ్వడం ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని మంత్రి అన్నారు.
కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మట్టా రాగమయి దయానంద్, రాందాస్ నాయక్, గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ నాయుడు సత్యనారాయణ, పీసీసీఎఫ్, కలెక్టర్, సీపీ, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



