Bankipur Bypoll | మోదీ-షాలకు ఇక ఇంటిదారే
Bankipur Bypoll | బీహార్‌లోని బంకిపూర్ ఉప ఎన్నిక ఫలితం బీజేపీ అహంకారానికి గట్టి ఎదురుదెబ్బ అని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ అన్నారు. ఈ తీర్పు కేవలం ఒక నియోజకవర్గానికి పరిమితం కాదని, దేశ రాజకీయాల్లో మార్పునకు సంకేతమని పేర్కొన్నారు. బంకిపూర్ ఉప ఎన్నిక ఫలితాలపై ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
- ప్రజలు మార్పును కోరుకుంటున్నరు
- బంకిపూర్ తీర్పు బీజేపీ అహంకారానికి చెంపపెట్టు
- టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్
Bankipur Bypoll | బీహార్‌లోని బంకిపూర్ ఉప ఎన్నిక ఫలితం బీజేపీ అహంకారానికి గట్టి ఎదురుదెబ్బ అని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ అన్నారు. ఈ తీర్పు కేవలం ఒక నియోజకవర్గానికి పరిమితం కాదని, దేశ రాజకీయాల్లో మార్పునకు సంకేతమని పేర్కొన్నారు. బంకిపూర్ ఉప ఎన్నిక ఫలితాలపై ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కేంద్రంలో, బీహార్‌లో అధికారంలో ఉన్న బీజేపీ అనుసరిస్తున్న నియంతృత్వ విధానాలకు ప్రజలు తగిన సమాధానం చెప్పారని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ నిర్ణేతలని మరోసారి నిరూపించారన్నారు. బంకిపూర్ సాధారణ అసెంబ్లీ స్థానం కాదని, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ రాజ్యసభకు వెళ్లడంతో ఖాళీ అయిన ప్రతిష్ఠాత్మక నియోజకవర్గమని మహేశ్‌కుమార్‌గౌడ్ తెలిపారు. దాదాపు మూడు దశాబ్దాలుగా బీజేపీకి కంచుకోటగా ఉన్న ఈ స్థానం చేజారడం అధికార అహంకారానికి ప్రజలు ఇచ్చిన తీర్పుగా అభివర్ణించారు.
ప్రజలు అధికార దుర్వినియోగం, ప్రజా సమస్యల పట్ల నిర్లక్ష్యం, నిరుద్యోగం, ధరల పెరుగుదల, రైతుల ఇబ్బందులు, సామాజిక విభజన రాజకీయాలను గమనిస్తున్నారని అన్నారు. ఎంత బలమైన రాజకీయ కోట అయినా ప్రజల తీర్పు ముందు నిలవలేదని బంకిపూర్ ఫలితం స్పష్టం చేసిందన్నారు. బీజేపీ అగ్ర నాయకత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న స్థానంలో ఎదురైన పరాజయం దేశవ్యాప్తంగా రాజకీయ సందేశాన్ని ఇస్తోందని పేర్కొన్నారు. కేవలం ప్రచారంతో కాకుండా పాలనలో ప్రజలకు కనిపించే ఫలితాలు చూపించినప్పుడే విశ్వాసం పొందగలరని ఈ తీర్పు చాటిందన్నారు. దేశ ప్రజలు ప్రత్యామ్నాయ రాజకీయాల కోసం ఎదురుచూస్తున్నారని, కాంగ్రెస్ వైపు ప్రజల మద్దతు పెరుగుతోందని మహేశ్‌కుమార్‌గౌడ్ అన్నారు.
ప్రజా సమస్యల పరిష్కారం, సామాజిక న్యాయం, రాజ్యాంగ విలువల పరిరక్షణ, సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ ముందుకు సాగుతోందని తెలిపారు. రాబోయే రోజుల్లో దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ మరింత బలపడుతుందనే నమ్మకాన్ని బంకిపూర్ ఫలితం కలిగించిందన్నారు. బంకిపూర్ ప్రజలకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ‘ప్రజాస్వామ్యంలో అంతిమ విజయం ఎప్పుడూ ప్రజలదే’ అని మహేశ్‌కుమార్‌గౌడ్ పేర్కొన్నారు.
సంబంధిత వార్తలు

Mallikarjun Kharge | విద్యార్థులపై పోలీసుల చర్య.. సభలో ప్రకటన చేయడానికి అమిత్‌షాకు ఏం అడ్డంకులు ఉన్నాయ్..?
ఆగస్టు 6, 2026

LPG | ఎల్పీజీ సిలిండర్ ధరలు పెంపు..? కేంద్రం కొత్త ప్లాన్‌తో వినియోగదారులపై భారం..?
ఆగస్టు 6, 2026

Congress | నామినేటెడ్ పోస్టుల్లో కాంగ్రెస్ సీనియర్లకే 60 శాతం పదవులు..
ఆగస్టు 6, 2026
తాజావార్తలు
- ●India Smallest Airport | ఇండియాలో అతిచిన్న ఎయిర్పోర్ట్.. 15 ఏళ్లుగా ఒక్క ఫ్లైట్ టేకాఫ్ అవ్వలేదు.. అసలు కారణం ఇదే!
- ●Wife Demanding Separate Residence | అత్తమామలకు దూరంగా వేరు కాపురం కావాలనడం నేరమే.. సంచలన తీర్పునిచ్చిన కేరళ హైకోర్టు!
- ●GCC Companies Hyderabad | తెలంగాణలో 'జీసీసీ'ల జాతర: 150 కంపెనీలు.. లక్షన్నర కొలువులు
- ●Telangana Cyber Crime Control | సైబర్ నేరగాళ్ల గుండెల్లో దడ.. కట్టడిలో దేశానికే రోల్ మోడల్‌గా తెలంగాణ
- ●Prof Jayashankar Birth Anniversary | తెలంగాణ వచ్చినంక నాకు సంబంధాలు చూస్తావా? నవ్వులు పూయించిన ప్రొఫెసర్ జయశంకర్ ఆన్సర్!
- ●Telangana Jowar Farmers Payment | జొన్న రైతులకు శుభవార్త.. అకౌంట్లలో నేరుగా రూ.994 కోట్లు జమ

India Smallest Airport | ఇండియాలో అతిచిన్న ఎయిర్పోర్ట్.. 15 ఏళ్లుగా ఒక్క ఫ్లైట్ టేకాఫ్ అవ్వలేదు.. అసలు కారణం ఇదే!

Wife Demanding Separate Residence | అత్తమామలకు దూరంగా వేరు కాపురం కావాలనడం నేరమే.. సంచలన తీర్పునిచ్చిన కేరళ హైకోర్టు!

GCC Companies Hyderabad | తెలంగాణలో 'జీసీసీ'ల జాతర: 150 కంపెనీలు.. లక్షన్నర కొలువులు

Telangana Cyber Crime Control | సైబర్ నేరగాళ్ల గుండెల్లో దడ.. కట్టడిలో దేశానికే రోల్ మోడల్‌గా తెలంగాణ



