త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Komatireddy Venkat Reddy | వరదలపై వేగంగా స్పందించేందుకు ఆర్‌అండ్‌బీ స్పెష‌ల్ ఎస్‌ఓపీ : మంత్రి కోమటిరెడ్డి

Komatireddy Venkat Reddy | వర్షాకాలంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రహదారి రవాణా వ్యవస్థను నిరంతరం కొనసాగించడంతో పాటు, వరదల వల్ల రహదారులు, వంతెనలు, కల్వర్టులకు కలిగే నష్టాన్ని తగ్గించేందుకు రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్‌ఓపీ) విడుదల చేసినట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.

P

Telangana | Published On Jun 22, 2026, 4.18 pm IST

Komatireddy Venkat Reddy | వరదలపై వేగంగా స్పందించేందుకు ఆర్‌అండ్‌బీ స్పెష‌ల్ ఎస్‌ఓపీ : మంత్రి కోమటిరెడ్డి
Advertisement

Komatireddy Venkat Reddy | వర్షాకాలంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రహదారి రవాణా వ్యవస్థను నిరంతరం కొనసాగించడంతో పాటు, వరదల వల్ల రహదారులు, వంతెనలు, కల్వర్టులకు కలిగే నష్టాన్ని తగ్గించేందుకు రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్‌ఓపీ) విడుదల చేసినట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు ఈ మార్గదర్శకాలు రూపొందించినట్లు పేర్కొన్నారు. ఆర్‌అండ్‌బీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని స్థాయిల అధికారులు పూర్తి అప్రమత్తతతో పనిచేయాలని మంత్రి ఆదేశించారు. జూన్ నుంచి అక్టోబర్ వరకు సూపరింటెండింగ్ ఇంజినీర్ నుంచి అసిస్టెంట్ ఇంజినీర్ వరకు అన్ని స్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని సూచించారు.

ప్ర‌త్యామ్నాయ మార్గాలు సిద్దం చేయాలి

వరద ముప్పు ఉన్న ప్రాంతాలు, బలహీన వంతెనలు, కల్వర్టులు, రహదారులను ముందుగానే గుర్తించి నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ మార్గాలను సిద్ధం చేయాలని ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల కోసం జేసీబీలు, ఎక్స్కవేటర్లు, టిప్పర్లు, డీ-వాటరింగ్ పంపులు, ఇసుక సంచులు, కంకర, తారు తదితర సామగ్రిని ముందుగానే సిద్ధంగా ఉంచాలని సూచించారు. భారత వాతావరణ శాఖ, తెలంగాణ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ జారీ చేసే హెచ్చరికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ పోలీస్, రెవెన్యూ, ఇరిగేషన్, విద్యుత్ శాఖలతో సమన్వయం చేసుకోవాలని పేర్కొన్నారు. భారీ వర్షాలు, వరదలతో రహదారులు దెబ్బతిన్న వెంటనే హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి ప్రత్యామ్నాయ మార్గాలను అందుబాటులోకి తీసుకురావాలని, వరద నీరు తగ్గిన వెంటనే తాత్కాలిక పునరుద్ధరణ పనులు ప్రారంభించాలని ఆదేశించారు. నష్టం జరిగిన 24 గంటల్లోపు ఫొటోలు, జీపీఎస్ వివరాలతో నష్టం అంచనా నివేదికలు సమర్పించాలని, ప్రజల ప్రాణ భద్రతకు సంబంధించిన పనుల్లో ఎలాంటి ఆలస్యం లేకుండా ఇంజినీర్లు తక్షణ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. వరదల అనంతరం చేపట్టే పునరుద్ధరణ పనులకు ఎస్‌డీఆర్‌ఎఫ్, ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఎంఎఫ్ నిబంధనల ప్రకారం నిధులను వినియోగించాలని తెలిపారు.

వ‌ర్షాపాతం ఆధారంగా అలెర్ట్ వ్య‌వ‌స్థ అమ‌లు

వర్షపాతం తీవ్రత ఆధారంగా గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్ అలర్ట్ వ్యవస్థను అమలు చేయనున్నట్లు మంత్రి చెప్పారు. 204 మిల్లీమీటర్లకుపైగా వర్షపాతం నమోదయ్యే రెడ్ అలర్ట్ సమయంలో ఏఈలు, ఏఈఈలు, ఈఈలు 24 గంటల పాటు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండి సహాయక చర్యలను సమన్వయం చేయాలని ఆదేశించారు. హైదరాబాద్‌లోని ఆర్‌అండ్‌బీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌కు రోజువారీ పరిస్థితుల నివేదికలు పంపాలని, నష్టం జరగకపోయినా ‘నిల్ రిపోర్ట్’ సమర్పించాలని సూచించారు. ఫీల్డ్ సిబ్బందికి ప్రత్యేక అనుమతి లేకుండా సెలవులు మంజూరు చేయరాదని స్పష్టం చేశారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా రహదారి రవాణా వ్యవస్థను కొనసాగించడం, వరదల వల్ల కలిగే నష్టాన్ని తగ్గించడం, అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందించడమే ఈ ఎస్‌ఓపీ ప్రధాన లక్ష్యమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వివ‌రించారు.

Advertisement
Advertisement