Jeevan Reddy | తెలంగాణకు శనిలా దాపురించారు
Jeevan Reddy | రేవంత్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలంగాణ ప్రాంతానికి శనిలా దాపురించారని బీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి టీ జీవన్‌రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీలకు మూడేళ్లుగా చిన్నపాటి మరమ్మతులు కూడా చేపట్టలేదని, అందుబాటులో ఉన్న నీటిని వినియోగించుకోకుండా లక్షల క్యూసెక్కులను వృథాగా సముద్రంలో కలిపేస్తున్నారని ఆరోపించారు.
- సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్‌పై జీవన్‌రెడ్డి మండిపాటు
- మూడేళ్లుగా బ్యారేజీలకు మరమ్మతులు చేయలేదు
- నీరంతా సముద్రంలో కలిపేస్తున్నరు
- తక్షణమే అన్నారం, సుందిళ్ల నుంచి నీటిని ఎత్తిపోయాలని డిమాండ్
Jeevan Reddy | రేవంత్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలంగాణ ప్రాంతానికి శనిలా దాపురించారని బీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి టీ జీవన్‌రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీలకు మూడేళ్లుగా చిన్నపాటి మరమ్మతులు కూడా చేపట్టలేదని, అందుబాటులో ఉన్న నీటిని వినియోగించుకోకుండా లక్షల క్యూసెక్కులను వృథాగా సముద్రంలో కలిపేస్తున్నారని ఆరోపించారు. అన్నారం, సుందిళ్ల నుంచి తక్షణమే నీటిని ఎత్తిపోసి శ్రీరాంసాగర్‌కు తరలించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్‌లో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎల్‌నినో ప్రభావంతో సాగునీరు, తాగునీరు, విద్యుత్ కొరతతో రైతాంగం, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని జీవన్‌రెడ్డి అన్నారు.
అవకాశం ఉన్నా ఉపయోగించుకోవడం లేదు..
అవకాశం లేక కాదు.. అవకాశం ఉండి కూడా ప్రభుత్వం ఉపయోగించుకోవడం లేదని, నదీజలాలు వృథాగా సముద్రంలో కలుస్తున్నాయని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ నివేదిక ఆధారంగా ప్రాణహిత జలాలను కన్నెపల్లి పంప్‌హౌస్ నుంచి ఎత్తిపోసి అన్నారం, సుందిళ్ల మీదుగా ఎల్లంపల్లికి తరలించవచ్చని తెలిపారు. ఎల్లంపల్లిలో 20 టీఎంసీల నీరు ఉందని, అక్కడి నుంచి దిగువకు విడుదల చేసి మళ్లీ పైకి ఎత్తిపోసుకోవచ్చన్నారు. కేసీఆర్ దూరదృష్టితో గ్రావిటీ కెనాళ్లు నిర్మించారని, రివర్స్ పంపింగ్ ద్వారా శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు నీటిని తరలించేలా పంపింగ్ వ్యవస్థను రూపొందించారని చెప్పారు. శ్రీరాంసాగర్‌లో 46 టీఎంసీల నీరు ఉన్నా ఖరీఫ్ పంటకు వినియోగించుకోలేకపోతున్నామని, రెండో పంటకు నీరు ఇవ్వాలంటే దిగువ నుంచి నీటిని ఎత్తిపోసి ఎస్సారెస్పీ నిల్వ సామర్థ్యాన్ని నింపాల్సి ఉంటుందని జీవన్‌రెడ్డి అన్నారు. ఈ అవకాశం ప్రస్తుతం అందుబాటులో ఉన్నా రేవంత్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వినియోగించుకోవడం లేదని విమర్శించారు. ‘అన్ని అవకాశాలు ఉన్నా కూడా అల్లుడి నోట్లో శని ఉన్నట్టు రేవంత్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఉన్నారు. మొత్తం తెలంగాణ ప్రాంతానికి శనిలా దాపరించారు’ అని వ్యాఖ్యానించారు.
మూడేళ్లయినా ఎలాంటి చర్యలు లేవ్
తుమ్మిడిహట్టి నుంచి నీటిని తరలిస్తామని ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్న కాంగ్రెస్ ప్రభుత్వం మూడేళ్లు, మూడు బడ్జెట్లు పూర్తయినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదన్నారు. మహారాష్ట్రతో మాట్లాడుతున్నామని చెప్పడం తప్ప పురోగతి లేదని అన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు కేంద్రంలో, మహారాష్ట్రలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్నప్పటికీ ఒప్పందం చేసుకోలేదని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ లౌక్యం ప్రదర్శించి మహారాష్ట్రతో ఒప్పందం చేసుకున్నారని జీవన్‌రెడ్డి తెలిపారు. ఉత్తర, దక్షిణ తెలంగాణను సస్యశ్యామలం చేయాలంటే ప్రాణహిత జలాలను వినియోగించుకోవాల్సిందేననే ఉద్దేశంతో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని చెప్పారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కాళేశ్వరం గుర్తింపు పొందిందన్నారు. మేడిగడ్డ మరమ్మతులకు సమయం పడుతుందని, అయితే అన్నారం, సుందిళ్ల నుంచి నీటిని ఎత్తిపోసుకునే అవకాశం ఉందని తెలిపారు.
శ్రీరాంసాగర్ నుంచి నీరివ్వాలి
ఈ నెల 30న సిరిసిల్లకు వస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి.. సిరిసిల్ల, వేములవాడ, జగిత్యాల ప్రాంతాలకు ఎస్సారెస్పీ ద్వారా సాగునీరు అందించాలని కోరారు. కన్నెపల్లి నుంచి నీటిని ఎగువకు ఎత్తిపోసి శ్రీరాంసాగర్‌కు తరలిస్తే రబీకి సాగునీరు అందించే అవకాశం ఉంటుందన్నారు. రిపోర్టు వచ్చి రెండు నెలలు అయినా నవంబర్‌లో పనులు ప్రారంభిస్తామని, 2027 వర్షాకాలంలో పూర్తి చేస్తామని ప్రభుత్వం చెబుతోందని జీవన్‌రెడ్డి అన్నారు. ‘మూడేళ్లు గడిచింది.. ఇంకో నాలుగైదు నెలలు అయితే మీరు దిగిపోయే సమయం వచ్చింది. మీ చిత్తశుద్ధి ఏ విధంగా ఉందో అందరికీ అర్థమయ్యింది. ఇప్పటికైనా జ్ఞానోదయం తెచ్చుకోండి’ అని వ్యాఖ్యానించారు. నీటి సదుపాయం లేకుంటే కరువు అనుకోవచ్చని, కానీ పుష్కలంగా నీరు ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం కరువు తెచ్చిందని ఆరోపించారు. ‘ఇది కాలం తెచ్చిన కరువు కంటే కాంగ్రెస్ తెచ్చిన కరువు’ అని అన్నారు. లక్షల క్యూసెక్కుల నీరు వృథాగా సముద్రంలో కలుస్తున్నా ప్రభుత్వంలో చలనం లేదని విమర్శించారు. మేడిగడ్డ మరమ్మతులకు సమయం పడుతున్న నేపథ్యంలో అన్నారం, సుందిళ్ల నుంచి తక్షణమే నీటిని ఎత్తిపోసి సాగుకు వినియోగించాలని బీఆర్‌ఎస్ తరఫున డిమాండ్ చేస్తున్నట్లు జీవన్‌రెడ్డి తెలిపారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Ponnam Prabhakar | కార్యకర్తలారా.. మీ గ్రామాల్లో పట్టభద్రుల ఓట్లు నమోదు చేయించండి
- ●LNG Rail | దేశంలోనే తొలిసారిగా పట్టాలెక్కిన ఎల్ఎన్జీ రైలు..
- ●TVK Vijay RTI Rollback | తీవ్ర వ్యతిరేకతతో విజయ్ సర్కార్ యూటర్న్: లా అండ్ ఆర్డర్ RTI మినహాయింపు రద్దు.. పక్కనే పోక్సో కేసు సెగ
- ●Priyadarshi | కేసీఆర్ పాత్ర కోసం ప్రియదర్శి మేకోవర్ - ప్యారడైజ్ వర్కింగ్ స్టిల్స్
- ●Harish Rao | ఆరు నెలలు మొబైల్‌ను దూరం పెట్టండి.. అప్పుడే ఉద్యోగం సాధ్యం
- ●TGSRTC Bus Bhavan | కొండా లక్ష్మణ్ బాట భావితరాలకు నిరంతర స్ఫూర్తి

Ponnam Prabhakar | కార్యకర్తలారా.. మీ గ్రామాల్లో పట్టభద్రుల ఓట్లు నమోదు చేయించండి

LNG Rail | దేశంలోనే తొలిసారిగా పట్టాలెక్కిన ఎల్ఎన్జీ రైలు..

TVK Vijay RTI Rollback | తీవ్ర వ్యతిరేకతతో విజయ్ సర్కార్ యూటర్న్: లా అండ్ ఆర్డర్ RTI మినహాయింపు రద్దు.. పక్కనే పోక్సో కేసు సెగ

Priyadarshi | కేసీఆర్ పాత్ర కోసం ప్రియదర్శి మేకోవర్ - ప్యారడైజ్ వర్కింగ్ స్టిల్స్





