Garbage | రెండు వారాలుగా రాని చెత్త వాహనం.. మున్సిపల్ ఆఫీస్‌లో వేసి జనం నిరసన.. వీడియో
Garbage | ఆ వార్డులో రెండు వారాలుగా చెత్త (Garbage) సేకరణ నిలిచిపోయింది. ఇండ్లు, వీధులు మొత్తం వ్యర్థాలతో కంపుకొడుతున్నాయి. సహనం కోల్పోయిన జనం ఇండ్లలో పేరుకుపోయిన చెత్తతో మున్సిపల్ ఆఫీసుకు వెళ్లారు.
Garbage | త్రినేత్ర.న్యూస్: ఆ వార్డులో రెండు వారాలుగా చెత్త (Garbage) సేకరణ నిలిచిపోయింది. ఇండ్లు, వీధులు మొత్తం వ్యర్థాలతో కంపుకొడుతున్నాయి. సహనం కోల్పోయిన జనం ఇండ్లలో పేరుకుపోయిన చెత్తతో మున్సిపల్ ఆఫీసుకు వెళ్లారు. దానిని అక్కడ పడేసి నిరసన (Protest) తెలిపారు. ఇప్పటికైన సమస్యను పరిష్కరించాలంటూ డిమాండ్ చేశారు. ఈ ఘటన మహబూబాబాద్ మున్సిపాలిటీలో (Mahabubabad Municipality) చోటుచేసుకున్నది.
పట్టణంలోని 21వ వార్డుకు రెండు వారాలుగా మున్సిపల్ వాహనం రావడం లేదు. దీంతో స్థానికులు చెత్తతో వార్డు కౌన్సిలర్ జరీనా బేగం ఇంటికి వెళ్తారు. చేసేది ఏమీ లేక కౌన్సిలర్.. వారిని, వారు తీసుకొచ్చిన చెత్తతో మున్సిపాలిటీ కార్యాలయానికి వెళ్లారు. ఆ సంచులను అక్కడ వేసి జనంతోపాటు ఆమె కూడా నిరసనకు దిగారు. డ్రైవర్ లేరని, వాహనాలు మరమ్మతులు ఉన్నాయని గత 45 రోజులుగా అధికారులు చెబుతున్నారని కౌన్సిలర్ అన్నారు. రెండు వారాలుగా వాహనం వస్త లేదని, అంతకుముందు కూడా వార్డు మొత్తం కాకుండా సగం మాత్రమే చెత్త సేకరించేవారని అసహనం వ్యక్తం చేశారు. అధికార పార్టీకి చెందిన వార్డులకు ప్రాధాన్యమిస్తున్నారని ప్రజలు విమర్శించారు. దీంతో స్పందించిన కమిషనర్ రాజేశ్వర్.. వాహనాలు మరమ్మతులో ఉన్నాయని, సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మరో వార్డుకు కేటాయించిన ట్రాక్టర్‌ను 21వ వార్డుకు పంపించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.
HOW TO TEACH LAZY AUTHORITIES A LESSON???
Mahabubabad Municipality 21st ward decided not cleaning garbage for a few days is okay!
Citizens requested, complained and then decided to teach the officials a lesson.
They collected the trash and dumped the garbage in every section… pic.twitter.com/sqhyVFwdmc
— Revathi (@revathitweets) April 15, 2026
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






