త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

BRS Womens Leaders protest | బండి కుమారుడిపై బీఆర్ఎస్ మ‌హిళ‌ల భ‌గ్గు.. కేసు న‌మోదుపై హ‌ర్షం

BRS Womens Leaders protest | కేంద్ర హోం శాఖ‌ సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) కుమారుడుపై కుత్బుల్లాపూర్ (Quthbullapur) బీఆర్ఎస్ పార్టీ మహిళా నాయకురాళ్లు భ‌గ్గుమ‌న్నారు. బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు నమోదుపై మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

S

News | Published On May 10, 2026, 11.48 am IST

BRS Womens Leaders protest | బండి కుమారుడిపై బీఆర్ఎస్ మ‌హిళ‌ల భ‌గ్గు.. కేసు న‌మోదుపై హ‌ర్షం
Advertisement
  • పేట్ బ‌షీరాబాద్ పోలీస్‌స్టేష‌న్ ఎదుట బీఆర్ఎస్ మ‌హిళా నాయ‌కురాళ్ల‌ ఆందోళ‌న‌

BRS Womens Leaders protest | త్రినేత్ర‌.న్యూస్‌: కేంద్ర హోం శాఖ‌ సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) కుమారుడుపై కుత్బుల్లాపూర్ (Quthbullapur) బీఆర్ఎస్ పార్టీ మహిళా నాయకురాళ్లు భ‌గ్గుమ‌న్నారు. బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు నమోదుపై మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ పార్టీ మహిళలు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన దిగారు.

బండి సంజ‌య్‌కి వ్య‌తిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. బాలిక‌కు న్యాయం చేయాల‌ని నిల‌దీశారు. బండి సంజ‌య్ కొడుకును వెంట‌నే అరెస్టు చేయాల‌ని డిమాండ్ చేశారు. కేంద్ర హోంశాఖ‌ సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కుత్బుల్లాపూర్ కు చెందిన మైనర్ బాధితురాలికి ప్ర‌భుత్వం అండగా నిల‌వాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు.

[video width="860" height="480" mp4="https://www.trinethra.news/static-media/wp-content/uploads/2026/05/WhatsApp-Video-2026-05-10-at-11.33.17-AM-1.mp4"][/video]

Advertisement
Advertisement