Palla Rajeshwar Reddy | కొబ్బరి కాయలు కొట్టుడు కాదురా.. ధాన్యం కొనరా నాయనా
Palla Rajeshwar Reddy | ప్రభుత్వం సకాలంలో ధాన్యం కొనడం లేదని బీఆర్ఎస్ (BRS) నాయకులు ధర్నా, రాస్తారోకోలకు దిగారు. వరంగల్ ఎనుమాముల మార్కెట్ (Enumamula market) వద్ద ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, నాయకులు, జగిత్యాల (Jagityal) జిల్లా కొడిమ్యాల మండలం పూడూర్ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి జీవన్‌రెడ్డి (Jeevan Reddy) రైతులతో కలిసి రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు.
- నినాదాలతో హోరెత్తించిన బీఆర్ఎస్ నేతలు, రైతులు
- వరంగల్ ఎనుమాముల వద్ద పల్లా రాజేశ్వర్‌రెడ్డి ధర్నా
- జగిత్యాలలో రోడ్డుపై బైఠాయించి జీవన్‌రెడ్డి రాస్తారోకో
- బస్తాకు ఏడు కిలోల కటింగ్ ఆపాలని రైతుల డిమాండ్
- కరీంనగర్ - జగిత్యాల హైవే పై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
Palla Rajeshwar Reddy | త్రినేత్ర.న్యూస్: ప్రభుత్వం సకాలంలో ధాన్యం కొనడం లేదని బీఆర్ఎస్ (BRS) నాయకులు ధర్నా, రాస్తారోకోలకు దిగారు. వరంగల్ ఎనుమాముల మార్కెట్ (Enumamula market) వద్ద ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, నాయకులు, జగిత్యాల (Jagityal) జిల్లా కొడిమ్యాల మండలం పూడూర్ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి జీవన్‌రెడ్డి (Jeevan Reddy) రైతులతో కలిసి రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు.

70 లారీల మాల్ మార్కెట్ వద్దే ఉంది..
ఈ సందర్భంగా ఎనుమాముల మార్కెట్ వద్ద పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడారు. ప్రభుత్వం అంతా ధాన్యం కొంటుందట.. ఒకసారి కొనుగోలు కేంద్రాలకెళ్లి చూడాలని కేటీఆర్ చెప్పారు. ఇక్కడొచ్చి చూస్తే దారుణాలు కనిపిస్తున్నయ్. ఒక్కొక్క కొనుగోలు కేంద్రంలో 60, 70 లారీల మాల్ అక్కడే ఉంది. ఇక్కడున్న రైతులు వారి సమస్యలను కళ్లకు కట్టినట్టు చెప్పారు. అప్పుడు కొంత మోసపోయినమని, కానీ ఇంత దారుణంగా మోసపోలేదని రైతులు చెబుతున్నారు అని పల్లా తెలిపారు.
25 క్వింటాళ్లే కొంటరట.. ఏం రోగం?
కాంగ్రెసోళ్లు రూ.15 వేలు ఇస్తారంటే మోసపోయినం, 24 గంటలు కరెంటు ఇస్తామంటే మోసపోయినం. రెండు లక్షలు రుణమాఫీ చేస్తమంటే మోసపోయినం, 45 క్వింటాళ్ల ధాన్యం పండితే 25 క్వింటాళ్లే తీసుకుంటరట. ఏం రోగం. ఏమైంది కొనడానికి అని అడుగుతున్నా. భారత్‌లోనే ఎనుమాముల పెద్ద మార్కెట్. ఇక్కడ కొంటరని వస్తే 25 రోజులుగా పడిగాపులు తప్పడం లేదని రైతులు చెప్పారు. పరదాలు ఇవ్వరు, కాంటా పెట్టరు.. ఎందుకు ఈ మోసం. రైతుబంధు రెండుసార్లు వేయకుండా మోసం చేశారు. ఒకసారి కేసీఆర్ మీటింగ్ వెడితే 6 వేలు ఏసిండు. మొన్న జగిత్యాల మీటింగ్‌తో మళ్లొక్కసారి వేసిండు. భద్రకాళి మీద ఒట్టేసిర్రు. కానీ అన్ని మరిచారు. మిర్చి అయినా, వడ్లు అయినా, మొక్కజొన్న అయినా ఏది నష్టపోయినా స్వయంగా కేసీఆర్ వచ్చి నష్ట పరిహారం ఇచ్చిండు అని పల్లా రాజేశ్వర్‌రెడ్డి గుర్తు చేశారు.
జగిత్యాల జిల్లాలో రాస్తారోకో..
తక్షణమే వరిధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ కొడిమ్యాల మండలం పూడూర్ చౌరస్తా వద్ద రోడ్డుపై బైఠాయించి రైతుల ధర్నా చేపట్టారు. బస్తాకు ఏడు కిలోల కటింగ్ ఆపాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నేతలు, రైతులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి, చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవి శంకర్ ధర్నాలో పాల్గొని రైతులకు మద్దతు తెలిపారు. కొబ్బరి కాయలు కొట్టుడు కాదు.. కొనుగోలు చేయరా.. వద్దురా నాయనా, కాంగిరేసు పాలనా.. ఇదేం రాజ్యం ఇదేం రాజ్యం.. దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం, సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. సుమారు రెండు గంటల పాటు రోడ్డుపై బైఠాయించారు. జీవన్ రెడ్డిని, బీఆర్ఎస్ నేతలు, రైతులను పోలీసులు బలవంతంగా అరెస్టు చేశారు. ఈ అరెస్టుపై బీఆర్ఎస్ నాయకులు భగ్గుమన్నారు. ఈ నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి.
జగిత్యాల జిల్లాలో రైతుల రాస్తారోకో
తక్షణమే వరిధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ కొడిమ్యాల మండలం పూడూర్ చౌరస్తా వద్ద రోడ్డుపై బైఠాయించి రైతుల ధర్నా
బస్తాకు ఏడు కిలోల కటింగ్ ఆపాలని కోరుతున్న రైతులు
కరీంనగర్ - జగిత్యాల హైవే పై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
ప్రభుత్వానికి… pic.twitter.com/KUMRbmsgdG
— TNews Telugu (@TNewsTelugu) May 4, 2026
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ వద్ద.. pic.twitter.com/f1eEsG1WjL
— Dr. Palla Rajeshwar Reddy (@PRR_BRS) May 4, 2026
ధాన్యం కొనుగోలు చేయాలని బీఆర్ఎస్ ధర్నా 🔥
దౌర్జన్యంగా అరెస్ట్ చేసిన నిరంకుశ రేవంత్ సర్కార్!ధాన్యం కొనుగోలు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్న
రైతు వ్యతిరేక కాంగ్రెస్ సర్కార్ తీరుకు నిరసనగా..
పూడూర్ జాతీయ రహదారిపై సుమారు రెండు గంటల పాటు రోడ్డుపై బైఠాయించిన బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ… pic.twitter.com/6lkPAGYQc7— BRS Party (@BRSparty) May 4, 2026
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



