CM Prajavani | ప్రగతిశీల భావాజాలంతోనే సమస్యల పరిష్కారం : జీ చిన్నారెడ్డి
CM Prajavani | ప్రగతిశీల దృక్పథంతోనే ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కారాలు సాధ్యమవుతాయని సీఎం ప్రజావాణి ఇన్‌చార్జి, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ చిన్నారెడ్డి అన్నారు. అధికారుల నుంచి సానుకూల ధోరణి పెరిగితేనే పిటిషనర్ల ముఖాల్లో సంతోషం కనిపిస్తుందని ఆయన పేర్కొన్నారు. మంగళవారం మహాత్మా జ్యోతిబాపూలే ప్రజా భవన్‌లో ఆదిలాబాద్ జిల్లాలో ప్రజావాణి అమలు తీరుపై రూపొందించిన పైలట్ ప్రాజెక్టు నివేదికను ఆయన ఆవిష్కరించారు. కార్యక్రమంలో సీఎం ప్రజావాణి స్టేట్ నోడల్ అధికారి దివ్య దేవరాజన్‌తో కలిసి నివేదికను విడుదల చేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ చిన్నారెడ్డి మాట్లాడుతూ ప్రజావాణికి వివిధ సమస్యలతో వచ్చే దరఖాస్తుదారుల పట్ల అధికారులు, సిబ్బంది మానవీయ కోణంలో స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. సమస్యను కేవలం ఫైల్‌గా కాకుండా ఒక మనిషి అవసరంగా చూసినప్పుడే సమర్థవంతమైన పరిష్కారం సాధ్యమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్ర, జిల్లా స్థాయిలో కొనసాగుతున్న ప్రజావాణి కార్యక్రమాన్ని ఇప్పటికే డివిజన్ స్థాయికి విస్తరించగా, భవిష్యత్తులో మండల స్థాయికి కూడా తీసుకెళ్లే ఆలోచన ప్రభుత్వ పరిశీలనలో ఉందని ఆయన తెలిపారు. సీఎం ప్రజావాణి ద్వారా ప్రజల సమస్యలను ఓపికతో విని పరిష్కరిస్తున్న విధానం మంచి ఫలితాలు ఇస్తోందని పేర్కొన్నారు. కార్యక్రమంలో స్టేట్ నోడల్ అధికారి దివ్య దేవరాజన్‌తో పాటు నిర్వాహకులు హర్ష, ఆనందిత, అభిషేక్ అఖిల్, ప్రజావాణి అధికారులు రాకేష్ రెడ్డి, జగన్, సహదేవ్, సాయి పాల్గొన్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

CM Revanth Reddy Erravalli Review | ఎర్రవల్లిలో 45 ఎకరాల భూమి మాయం.. సీఎం సీరియస్.. కేసీఆర్ కుటుంబానికి నోటీసులు
అక్టోబర్ 6, 2026

BitChat | బ్లూటూత్ మెసేజింగ్ యాప్ బిట్‌చాట్‌పై కేంద్రం చర్యలు.. ప్లే స్టోర్ నుంచి అవుట్..!
అక్టోబర్ 6, 2026

DRDO | ఆత్మనిర్భర్ భారత్‌లో ముందడుగు.. డీఆర్డీవో హై-ఆల్టిట్యూడ్ ప్లాట్‌ఫామ్ సిస్టమ్ సక్సెస్..!
అక్టోబర్ 6, 2026
తాజావార్తలు
- ●CM Revanth Reddy Erravalli Review | ఎర్రవల్లిలో 45 ఎకరాల భూమి మాయం.. సీఎం సీరియస్.. కేసీఆర్ కుటుంబానికి నోటీసులు
- ●PM Narendra Modi 25 Years | సీఎంగా మొదలై పీఎంగా విశ్వవేదికపైకి.. పాలనాధినేతగా మోదీ 25 ఏళ్ల ప్రభంజనం: కేంద్ర మంత్రివర్గం చారిత్రక తీర్మానం
- ●Sridevi | కోర్ట్ హీరోయిన్ కొత్త మూవీ - ఉమెన్‌న్ కాలేజీలో యువకుడికి అడ్మిషన్ దొరికితే!
- ●BitChat | బ్లూటూత్ మెసేజింగ్ యాప్ బిట్‌చాట్‌పై కేంద్రం చర్యలు.. ప్లే స్టోర్ నుంచి అవుట్..!
- ●DRDO | ఆత్మనిర్భర్ భారత్‌లో ముందడుగు.. డీఆర్డీవో హై-ఆల్టిట్యూడ్ ప్లాట్‌ఫామ్ సిస్టమ్ సక్సెస్..!
- ●Jason Sanjay | నేను లవ్ ఫెయిల్యూర్నే - బ్రేకప్‌పై దళపతి విజయ్ కొడుకు కామెంట్స్

CM Revanth Reddy Erravalli Review | ఎర్రవల్లిలో 45 ఎకరాల భూమి మాయం.. సీఎం సీరియస్.. కేసీఆర్ కుటుంబానికి నోటీసులు

PM Narendra Modi 25 Years | సీఎంగా మొదలై పీఎంగా విశ్వవేదికపైకి.. పాలనాధినేతగా మోదీ 25 ఏళ్ల ప్రభంజనం: కేంద్ర మంత్రివర్గం చారిత్రక తీర్మానం

Sridevi | కోర్ట్ హీరోయిన్ కొత్త మూవీ - ఉమెన్‌న్ కాలేజీలో యువకుడికి అడ్మిషన్ దొరికితే!

BitChat | బ్లూటూత్ మెసేజింగ్ యాప్ బిట్‌చాట్‌పై కేంద్రం చర్యలు.. ప్లే స్టోర్ నుంచి అవుట్..!



