త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kodandaram | ఈసారి ఎన్నిక‌ల్లో క‌చ్చితంగా పోటీ చేస్తాం: ప్రొఫెస‌ర్ కోదండ‌రాం

Kodandaram | వ‌చ్చే ఎన్నిక‌ల్లో క‌చ్చితంగా పోటీ చేస్తామ‌ని ఎమ్మెల్సీ, తెలంగాణ జ‌న‌స‌మితి అధ్య‌క్షుడు ప్రొఫెస‌ర్ కోదండ‌రాం (Kodandaram) అన్నారు. మార్పు కోస‌మే తాము పార్టీ న‌డుపుతున్నామ‌ని చెప్పారు.

G

Telangana | Published On Apr 29, 2026, 12.33 pm IST

Kodandaram | ఈసారి ఎన్నిక‌ల్లో క‌చ్చితంగా పోటీ చేస్తాం: ప్రొఫెస‌ర్ కోదండ‌రాం
Advertisement

Kodandaram | త్రినేత్ర‌.న్యూస్‌: వ‌చ్చే ఎన్నిక‌ల్లో క‌చ్చితంగా పోటీ చేస్తామ‌ని ఎమ్మెల్సీ, తెలంగాణ జ‌న‌స‌మితి అధ్య‌క్షుడు ప్రొఫెస‌ర్ కోదండ‌రాం (Kodandaram) అన్నారు. మార్పు కోస‌మే తాము పార్టీ న‌డుపుతున్నామ‌ని చెప్పారు. ఓట్లు, సీట్లు కావాలంటే పార్టీని వేరేలా న‌డ‌పాల‌ని వ్యాఖ్యానించారు. తెలంగాణ జ‌న స‌మితి (Telangana Jena Samithi) 8వ ఆవిర్భావ దినోత్స‌వం సంద‌ర్భంగా నాంప‌ల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాల‌యంలో జ‌రిగిన వేడుక‌ల‌కు కోదండ‌రాం ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. పార్టీ జెండాను ఎగుర‌వేసిన అనంత‌రం మాట్లాడుతూ.. నిరంకుశ పాలన అంతమై, ప్రజాపాలన రావాలని కొరుకున్నామన్నారు.

రాజకీయ వ్యూహంలో భాగంగానే కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చినట్లు చెప్పారు. తెలంగాణలో టీజేఎస్​లేని ప్రజా పోరాటాలు లేవు అని చెప్పారు. మంత్రులం, ఎమ్మెల్యేలం కావాలని తమకు లేదని స్పష్టం చేశారు. ప్రజలకు అవసరమైనప్పుడు తోడుగా ఉన్నామని వెల్ల‌డించారు. ప్రజలు కేంద్రంగా ఉండేలా రాజకీయాలు చేశామని తెలిపారు. ప్ర‌భుత్వంలో భాగ‌స్వామ్యం ఉండాల‌ని కోరుకుంటున్నామ‌ని చెప్పారు. మే 12న జరిగే పార్టీ ప్లీనరీలో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటామని వెల్ల‌డించారు. కాగా, ఆచార్య కోదండ‌రాం రెండు రోజుల క్రిత‌మే ఎమ్మెల్సీగా ప్ర‌మాణం చేసిన విష‌యం తెలిసిందే.

Advertisement
Advertisement